ఫ్యాక్ట్ చెక్: సాధువులు అమ్మాయిలను ఏడిపిస్తూ ఉంటే ప్రజలు కొట్టరనేది నిజం కాదు
అయోధ్యలో సరయు నది ఒడ్డున అక్టోబర్ 28 నుండి అక్టోబర్ 30, 2024 వరకు భారీ ఎత్తున దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు
Claim :
అయోధ్యలో అమ్మాయిని వేధించిన సాధువులు స్థానికులతో గొడవకు దిగిన వీడియో వైరల్గా మారింది.Fact :
వైరల్ వీడియోలోని ఘటనలో వేధింపుల కోణం లేదని అయోధ్య పోలీసులు ధృవీకరించారు
అయోధ్యలో సరయు నది ఒడ్డున అక్టోబర్ 28 నుండి అక్టోబర్ 30, 2024 వరకు భారీ ఎత్తున దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. సరయూ దీపోత్సవ్ ఉత్సవాన్ని ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో దీపావళి రోజున ఘనంగా నిర్వహిస్తారు. సరయూ నది ఒడ్డున వేలాది మట్టి దీపాలను వెలిగిస్తారు. ఈ ఉత్సవాన్ని చూడడానికి దేశ విదేశాల నుండి ప్రజలు వస్తారు. దీపాలు వెలిగించే ఈ సంప్రదాయం 2017లో రామ్ కి పైడి అనే ప్రదేశంలో ప్రారంభమైంది. ఏడాదికేడాది సరికొత్త రికార్డులను ఈ కార్యక్రమం ద్వారా సృష్టిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఏడాది లక్ష్మణ్ కిలా ఘాట్ నుండి నయా ఘాట్ వరకు 1100 మంది వేదాచార్యులు సరయూ హారతి ఇస్తారని ప్రకటించారు. సరయూ నది ఒడ్డున మొత్తం 25 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ప్రపంచ రికార్డులు సృష్టించేందుకు పర్యాటక శాఖ కూడా సన్నాహాలు చేస్తోంది. మొదటి రికార్డు 25 లక్షల మట్టి దీపాలను వెలిగించడం, రెండవది 1100 మంది కలిసి సరయూ నది ఘాట్లపై అతిపెద్ద హారతి ఇవ్వడం.