Sat Dec 21 2024 08:27:24 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: లాహోర్ ఎయిర్ పోర్టులో వర్షం వీడియోను తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు
పాకిస్థాన్ లోని చాలా నగరాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా విద్యుత్తు అంతరాయం, కొండచరియలు విరిగిపడి ప్రజలు చనిపోవడం లాంటి ఎన్నో ఘటనలు సంభవించాయి.
Claim :
వైరల్ వీడియోలో తాజాగా పాకిస్థాన్‌లోని లాహోర్ ఎయిర్‌పోర్టు నీటిలో మునిగిపోయిందిFact :
ఇది పాత వీడియో
భారీ వర్షాల కారణంగా పాకిస్థాన్‌లో ఇలాంటి పరిస్థితి ఉందంటూ పాత వీడియోను షేర్ చేశారు
పాకిస్థాన్ లోని చాలా నగరాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా విద్యుత్తు అంతరాయం, కొండచరియలు విరిగిపడి ప్రజలు చనిపోవడం లాంటి ఎన్నో ఘటనలు సంభవించాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీటిలో నిండిన రన్‌వేపై విమానం దిగిన వీడియో ఇటీవల పాక్ లో చోటు చేసుకున్న ఘటనగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
“లాహోర్ ఎయిర్పోర్ట్ టుడే మార్నింగ్” అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేస్తున్నారు.
“లాహోర్ ఎయిర్పోర్ట్ టుడే మార్నింగ్” అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ వీడియోకు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియో ఇప్పటిది కాదని మేము కనుగొన్నాం.మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాము. ఈ వీడియో కనీసం ఒక సంవత్సరం కిందటి నుండి సోషల్ మీడియాలో ఉందని కనుగొన్నాం. వీడియోని “PIA A320 Taxing in Rain at Karachi Airport (sic).” అనే టైటిల్ తో అప్లోడ్ చేసినట్లు కూడా గుర్తించాం.
టైటిల్‌ను సూచనగా తీసుకుని, మేము మరింత వెతకగా.. 2020లో కూడా అదే శీర్షికతో అదే వీడియో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.
అంతేకాకుండా, గత ఏడాది కూడా ఇదే వీడియోను తప్పుడు వాదనతో షేర్ చేయగా.. వైరల్ వీడియో పాతదని పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పష్టం చేసింది.
లాహోర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రస్తుత పరిస్థితి ఇది అంటూ షేర్ చేస్తున్న వీడియో పాతది. దీన్ని ఆన్లైన్లో తప్పుడు వాదనలతో షేర్ చేస్తున్నారు.
Claim : Video shows current situation at the Lahore Airport in Pakistan
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Twitter
Fact Check : False
Next Story