ఫ్యాక్ట్ చెక్: చైనాకు చెందిన వీడియో మహా కుంభ మేళా, ప్రయాగ్ రాజ్ లో తీసినట్టుగా ప్రచారం జరుగుతోంది
మహాకుంభమేళా 2025 జనవరి 13న ప్రయాగ్ రాజ్ లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు నిర్వహించనున్నారు.
Claim :
మహాకుంభమేళా సమయంలో ప్రయాగ్రాజ్లో అగ్నితో విన్యాసాలు చేస్తున్నారుFact :
ఈ వీడియో ప్రయాగ్రాజ్ కు చెందినది కాదు, ఇది చైనాకు చెందిన సంప్రదాయ ప్రదర్శన
మహాకుంభమేళా 2025 జనవరి 13న ప్రయాగ్ రాజ్ లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు నిర్వహించనున్నారు. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుంభమేళా కోసం ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు కావాల్సిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 1.6 లక్షల టెంట్లు ఏర్పాటు చేశారు. కుంభమేళాకు హిందూ మతంలో గొప్ప స్థానం ఉంది. మహా కుంభమేళా గొప్ప మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మూడు నదులు కలిసే త్రివేణి సంగమం ఉన్న ప్రయాగ్రాజ్ ను కుంభమేళా సమయంలో అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. 2025 మహా కుంభమేళా చాలా అరుదైనది, 144 సంవత్సరాల తర్వాత జరుగుతుంది, ఇది అత్యంత అరుదైన సందర్భం.
మహా కుంభమేళాకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయాగ్రాజ్లో భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, స్థానిక అధికారులు ఈ సమయంలో 1.5 నుండి 2 కోట్ల మంది సందర్శకులు వస్తారని అంచనా వేశారు. వసతి, పారిశుధ్యం, భద్రత, వైద్య సౌకర్యాల కోసం సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నారు. కుంభమేళాకు యాత్రికులు, సాధువులు తరలివస్తుంటారు. నాగ సాధువులు కూడా దీక్షను పూర్తీ చేసి ఇక్కడకు చేరుకుంటారు. కుంభమేళా సమయంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏనుగులు, గుర్రాలు, రథాలపై సాంప్రదాయిక ఊరేగింపు నిర్వహిస్తారు. మిలియన్ల మంది యాత్రికులను ఆకర్షించే అనేక ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపడతారు.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.