Thu Dec 26 2024 02:00:05 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మసీదు దగ్గర కాషాయ జెండాలతో ఉన్న హిందువులు ఉన్న వీడియో ఉజ్జయినిది కాదు, కర్ణాటకది
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ముహర్రం ఊరేగింపు సందర్భంగా ముస్లింలు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయడంతో
Claim :
ముహర్రం ఊరేగింపులో పాకిస్తాన్ అనుకూల నినాదాలకు నిరసనగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో హిందువులు కాషాయ జెండాలతో మసీదు దగ్గర గుమిగూడినట్లు వీడియోలో ఉందిFact :
ఈ వీడియో 2018లో కర్ణాటకలో చోటు చేసుకున్నది. రామనవమి ఊరేగింపు సందర్భంగా ఈ వీడియోను తీశారు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ముహర్రం ఊరేగింపు సందర్భంగా ముస్లింలు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయడంతో.. హిందువులు కాషాయ జెండాలతో మసీదు దగ్గరకు వెళ్లి పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేశారనే వాదనతో ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఒక మసీదు ముందు హిందువులు భారీగా నిలబడి ఉన్న వీడియో వైరల్ అవుతూ ఉంది.
ఈ వీడియోతో పాటు షేర్ చేసిన క్యాప్షన్ “ఇటీవల ఉజ్జయిని నగరంలో జరిగిన ఊరేగింపులో ముస్లింలు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత రోజు నగరంలోని హిందువులంతా కాషాయ జెండాలతో మసీదు ముందు గుమిగూడి ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిన వారు ఇక్కడ ఉండకూడదు.. పాకిస్థాన్ కు వెళ్లండి’ అంటూ నిరసన తెలిపారు. హిందువుల సమూహాన్ని ఓసారి చూడండి. మరి పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడతారా? (భారతదేశంలో ఉంటున్నారు, భారతదేశంలో బతుకుతున్నారు, భారతదేశంలో సంపాదిస్తున్నారు, అయితే పాకిస్థానీలు తమ ముస్లిం సోదరులు అనే కారణంగా ఇప్పటికీ పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నారు)!!!” అంటూ పోస్టులు పెడుతున్నారు.
పలువురు ట్విట్టర్ వినియోగదారులు ఇదే వాదనతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో ఉజ్జయినికి సంబంధించినది కాదు. 2018లో కర్ణాటకలో శ్రీరామ నవమి ఊరేగింపుకు సంబంధించినది.మేము Google లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, 2019లో యూట్యూబ్ ఛానెల్‌లు ఇలాంటి వీడియోని షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. హిరేమత్ వరుణ్ అనే యూట్యూబ్ ఛానెల్ ఏప్రిల్ 13, 2019న “ప్రపంచంలో రామనవమికి సంబంధించి అతిపెద్ద వేడుక” అంటూ వీడియోను షేర్ చేసింది. గుల్బర్గా శోభా యాత్రలో 2 లక్షల మంది డ్యాన్స్ చేస్తున్నారు” అని కూడా చెప్పుకొచ్చారు.
మేము మరింత సెర్చ్ చేయగా.. NCB creation అనే యూట్యూబ్ ఛానల్ లో “Ram Navami Full Crowd in Karnataka Gulbarga 2k18” అంటూ వీడియోను పోస్టు చేశారు. కర్ణాటకలోని గుల్బర్గాలో చోటు చేసుకున్నదని ఆ వీడియోలో తెలిపారు.
వైరల్ వీడియో, యూట్యూబ్ వీడియోలకు సంబంధించిన స్క్రీన్షాట్లను ఇక్కడ చూడొచ్చు.. రెండూ ఒకే లొకేషన్ అని తెలియజేస్తాయి.
కాబట్టి, వైరల్ వీడియో కర్ణాటకకు సంబంధించినది.. ఉజ్జయినికి సంబంధించినది కాదు. పాకిస్థాన్ అనుకూల నినాదాలకు నిరసనగా హిందువులు మసీదు దగ్గర గుమిగూడారనే వాదన అబద్ధం. 2018లో కర్ణాటకలో జరిగిన శ్రీరామ నవమి ఊరేగింపుకు సంబంధించిన వీడియో ఇది.
Claim : Video shows Hindus gathered near a mosque with saffron flags in Ujjain, Madhya Pradesh, in protest to pro-Pakistan slogans at the Muharram procession.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story