Mon Dec 23 2024 06:55:53 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్ : వీడియోలో బ్యాంక్ మానేజర్ ను చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి బీజేపీ నాయకుడు
ఓ వ్యక్తి బ్యాంక్ మేనేజర్ని చెంపదెబ్బ కొడుతున్న వీడియో, బ్యాంక్ మేనేజర్ని కొట్టింది బీజేపీ నాయకుడేనన్న వాదనతో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Claim :
బీజేపీ నాయకుడు బ్యాంక్ మేనేజర్ని చెంపదెబ్బ కొట్టినట్లు వైరల్ వీడియో చూపిస్తుందిFact :
వీడియోలో కనబడుతున్నది 'స్వాభిమాని షెట్కారీ సంఘటన్ ' యువజన విభాగం అధ్యక్షుడు
ఓ వ్యక్తి బ్యాంక్ మేనేజర్ని చెంపదెబ్బ కొడుతున్న వీడియో, బ్యాంక్ మేనేజర్ని కొట్టింది బీజేపీ నాయకుడేనన్న వాదనతో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోతో పాటు షేర్ అవుతున్న క్యాప్షన్ "ఒక బీజేపీ నాయకుడికి ప్రభుత్వ రంగ బ్యాంక్ మేనేజర్ని చెంప దెబ్బ కొట్టే ధైర్యం వచ్చింది. అహంకారం తో చెలరేగిపోతున్న బీజేపీకి త్వరలోనే గుణపాఠం చెప్పాలి.
ఆ వ్యక్తి బ్యాంక్ మేనేజర్‌తో వాగ్వాదానికి దిగడం, ఆ తర్వాత అతడి చెంప పైన కొట్టడం వీడియోలో చూడొచ్చు. సుదీర్ఘ వాగ్వాదాన్ని వీడియోలో కూడా చూడవచ్చు.
నిజ నిర్ధారణ:
వాదన తప్పుదారి పట్టిస్తోంది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి బీజేపీ నాయకుడు కాదు. అతను స్వాభిమాని షెట్కారీ సంఘటన్ యువజన విభాగం అధ్యక్షుడు.
మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకొని, ఘూగ్లె రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి వాటిని వెతకగా, వీడియో Xలో వైరల్‌గా షేర్ అయ్యిందని తెలిసింది. కొంతమంది X వినియోగదారులు “జల్నాకు చెందిన స్థానిక నాయకుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, వరోద్ బుద్రుక్ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్‌పై దాడి చేశారు. మయూర్ చర్యలు ప్రతి బ్యాంకు ఉద్యోగిని అవమానించేలా ఉన్నాయి, ఏ నాయకుడైనా లోపలికి వెళ్లి దాడి చేయవచ్చని రుజువు చేస్తుంది. #WorkplaceViolence #BankingSafety #LeadershipFail" అనే క్యాప్షన్ తో షేర్ చేసారు.
లోక్ మత్ టైంస్ వారు తమ X ఖాతాలో అదే వీడియోను “#మహారాష్ట్ర ల్ జఫ్రాబాద్ తాలూకా #జల్నాలో జరిగిన షాకింగ్ సంఘటనలో వరుద్ బుద్రుక్లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్‌లోని బ్యాంక్ మేనేజర్‌పై 'స్వాభిమాని' గ్రూప్‌కు చెందిన వ్యక్తి ఒకరు దాడి చేశారు. @మహాబ్యాంక్ #Violence #Politics #Farmers #Assault #Shocking #BankManager #Crime" అనే క్యాప్షన్‌తో షేర్ చేసారు.
భరత్ సోనీ అనే మరో X వినియోగదారుడు “వీడియో ఎవిడెన్స్” అనే శీర్షికతో వీడియోను భాగస్వామ్యం చేసారు. తన బయోలో అసీటంత్ జనరల్ మేనేజర్, ఋత్ద్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బరోడా అని అని పేర్కొన్నారు.
"స్వాభిమాని షెత్కారీ సంఘటన్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ మయూర్ బోర్డే జల్నాలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ని చెంపదెబ్బ కొట్టిన షాకింగ్ వీడియో జతచేసాం! జల్నాలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ని చెంప దెబ్బ కొట్టిన స్వాభిమాని షెత్కారీ సంఘాటన్ యువజన విభాగం అధ్యక్షుడు మయూర్ బోర్డే దారుణమైన చర్యను ఖండిస్తూ! బ్యాంకర్లు తమ జీవితాలను ప్రజలకు సేవ చేయడానికి అంకితం చేస్తారు, తరచుగా కుటుంబానికి దూరంగా ఉంటారు, ప్రభుత్వ గడువులను చేరుకోవడానికి అవిశ్రాంతంగా పని చేస్తారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, చివరి మైలు డెలివరీని నిర్ధారించడంలో వారు వెన్నెముక. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోలేరు! ఈ గూండా యువకుడి వేషధారణతో కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హం @maharashtra_hmo ని ఆదేశించాలని హోంమంత్రి @AmitShah ని కోరుతున్నాను. బ్యాంకర్లు, ఇటువంటి హింసకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి నిరసన తెలపండి! ప్రయోజనాలను మంజూరు చేయడంలో KYC & లబ్ధిదారుల ధృవీకరణ కీలకం. మన బ్యాంకింగ్ వ్యవస్థ సమగ్రతను కాపాడుకుందాం!#BankersUnderAttack #CondemnViolence #UpholdLawAndOrder vc Mohammed Akef toi
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనం ప్రకారం, ఈ సంఘటన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వరుద్ శాఖలో జరిగింది; పంట రుణాలు, ప్రభుత్వ రాయితీలు వంటి వివిధ బ్యాంకు సేవలను పొందడంలో బ్రాంచ్ మేనేజర్ సహకరించకపోవడంపై రైతులు, ఇతరుల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని నిందితుడు మయూర్ బోర్డే తెలిపారు. స్వాభిమాని షెట్కారీ సంఘటన్ యువజన విభాగం అధ్యక్షుడు మయూర్ బోర్డే మంగళవారం బ్యాంకు మానేజర్ ను చెంపదెబ్బ కొడుతూ కెమెరాకు చిక్కారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని బ్రాంచ్ మేనేజర్ రైతులను వేధిస్తున్నారని పలుమార్లు ఆరోపిస్తున్నారు.
అందువల్ల, స్వాభిమాని షెత్కారీ సంఘటన్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ మయూర్ బోర్డే అనే స్థానిక నాయకుడు జాల్నాలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ని చెంపదెబ్బ కొట్టినట్లు వైరల్ వీడియో చూపిస్తుంది. ఆయన బీజేపీ నేత కాదు. వాదన తప్పుదారి పట్టించేది.
Claim : బీజేపీ నాయకుడు బ్యాంక్ మేనేజర్ని చెంపదెబ్బ కొట్టినట్లు వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : Misleading
Next Story