ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో భవనాలను కూల్చివేసేందుకు వచ్చిన హైడ్రా అధికారులపై ప్రజల దాడి ని చూపడంలేదు
హైడ్రా కూల్చివేతల కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల ప్రజలు టెన్షన్ పడుతూ ఉన్నారు. న్యాయవ్యవస్థతో సహా వివిధ వర్గాల
Claim :
హైదరాబాద్‌లో భవనాలను కూల్చివేసేందుకు వచ్చిన హైడ్రా అధికారులపై ప్రజలు దాడికి దిగారుFact :
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో. వైరల్ వీడియోకు హైడ్రాకు, తెలంగాణకు సంబంధం లేదు
హైడ్రా కూల్చివేతల కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల ప్రజలు టెన్షన్ పడుతూ ఉన్నారు. న్యాయవ్యవస్థతో సహా వివిధ వర్గాల ప్రజల నుండి హైడ్రాపై విమర్శలు వస్తున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా అమీన్‌పురలో ఇటీవల భవనాన్ని కూల్చివేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ కె లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన విచారణలో, కూల్చివేత చట్టబద్ధత, విధివిధానాలపై కోర్టు అధికారులను ప్రశ్నించింది. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి అధికారులు వ్యవహరిస్తున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. శనివారం సాయంత్రం నోటీసులు జారీ చేశామని, ఆదివారం కూల్చివేత జరిగిందని, ఇది ప్రక్రియలోని అవకతవకలను ఎత్తి చూపుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఇదే వీడియో ను ఇన్స్టాగ్రాం వినియోగదారుడు ఒకరు 'రూపన్‌గఢ్‌లో బాహాటంగా గొడవ పడుతున్న దుండగులు. రూపన్‌గఢ్ ప్రాంతంలో షాపు యాజమాన్య వివాదంపై ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పులు. ఝ్ఛ్భ్ కి నిప్పు అంటించారు. ప్రాంతంలో విస్తృతమైన గొడవల వలన మార్కెట్ మూసివేసారు. ఫ్యాక్షన్ గొడవలో నలుగురికి గాయాలు. హైవే బంజరు భూముల్లో నిర్మించిన దుకాణాలపై వివాదం. ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.' అంటూ షేర్ చేసారు.
Rajasthan.ndtv.inలో ప్రచురించిన కథనం ప్రకారం, అజ్మీర్ జిల్లా రూపన్‌గఢ్‌లో ఒక భూ వివాదం చోటు చేసుకుంది. రూపన్గర్లోని శ్వేతాంబర్ జైన్ సమాజ్ హాస్టల్ స్థలంలో నిర్మిస్తున్న దుకాణాలను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులపై బల్వారం చౌదరి మేనల్లుడి వర్గం దాడి చేసింది.