Sat Nov 23 2024 17:34:48 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బస్సులో హిందూ మహిళతో బురఖా ధరించిన మహిళలు వాదిస్తున్న వీడియోలో మతపరమైన కోణం లేదు
బస్సు నిండా బురఖా ధరించిన విద్యార్థులు హిందూ మహిళతో వాదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందివైరల్ అవుతోంది. బురఖా ధరించని మహిళలను బస్సులోకి ఎక్కనివ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
Claim :
బురఖా ధరించిన మహిళలు హిందూ మహిళను కేరళలో వేధిస్తున్న దృశ్యాలను వీడియో లో చూడవచ్చుFact :
తమ కాలేజీ ముందు ప్రైవేట్ బస్సులు ఆపకుండా వెళుతున్నాయని.. విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న వీడియో ఇది
బస్సు నిండా బురఖా ధరించిన విద్యార్థులు హిందూ మహిళతో వాదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందివైరల్ అవుతోంది. బురఖా ధరించని మహిళలను బస్సులోకి ఎక్కనివ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను మతపరమైన కోణంలో షరియా చట్టాన్ని తీసుకుని వస్తున్నారనే వాదనతో వైరల్ చేస్తున్నారు. “భారతదేశంలో షరియా చట్టం! కేరళలో షరియా కవచం(బురఖా) లేకుండా బస్సులో వెళ్లేందుకు సాహసించినందుకు ఓ హిందూ మహిళను ముస్లిం మహిళ వేధించింది. అక్కడే ఉన్న ఇతర ముస్లింలు ఆమెను బురఖా ధరించాలని డిమాండ్ చేశారు. షరియా డిమాండ్లకు కట్టుబడి ఉండకుండా హిందువులు ప్రజా రవాణాలో ప్రయాణించడం ముస్లింలకు ఇష్టం లేదు - అల్లాహు అక్బర్! భారతదేశం, యూరప్‌లో షరియా గస్తీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇస్లామిక్ చట్టం ప్రకారం దుస్తులు ధరించని మహిళలు, ముస్లిమేతరులందరిపై వేధింపులు, దాడులు జరుగుతున్నాయి. భారతదేశం లో ముస్లింలు తాము బలిపశువులుగా మారినట్లు నటిస్తున్నారు”
ఇంకో ఫేస్ బుక్ లింకు ఇక్కడ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. తమ కాలేజీ ముందు ప్రైవేట్ బస్సులను ఆపనందుకు విద్యార్థులు బురఖా ధరించి నిరసన తెలుపుతున్న దృశ్యాలు ఇవని తెలుస్తోంది.మేము వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్‌లను ఉపయోగించి సెర్చ్ చేయగా.. కాసరగోడ్‌లోని కుంబ్లాలోని ఖాన్సా ఉమెన్స్ కాలేజ్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ విద్యార్థినులు ప్రైవేట్ బస్సులను ఆపకుండా వెళుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. 2023 అక్టోబర్ 27న X (ట్విట్టర్)లో ఒక ట్వీట్ కనిపించింది. వాళ్ళ కాలేజీ ముందు బస్టాప్ వద్ద ఆపకుండా వెళ్లకపోవడాన్ని విద్యార్థినులు తప్పుబట్టారు. బస్సును ఆపుతూ ఆలస్యం చేస్తున్నారని విద్యార్థులతో నీలిరంగు చీర ధరించిన మహిళ మాటల యుద్ధానికి దిగిందని పోస్ట్ లో తెలిపారు.
రిపోర్టర్లైవ్.కామ్‌లోని మలయాళ నివేదిక ప్రకారం.. కాలేజీ బస్టాప్‌లో ప్రైవేట్ బస్సులు ఆగకపోవడంతో ధర్నాకు దిగారు. ఎట్టకేలకు విద్యార్థినులు బస్సును ఆపారు. ఈ సంఘటన నిన్న సాయంత్రం కుంబాల-ముల్లేరియా కెఎస్టిపి రోడ్డులోని భాస్కర నగర్లో చోటుచేసుకుంది. కంసా మహిళా కళాశాల ఎదురుగా ఆర్టీఓ స్టాప్ కేటాయించినా బస్సు ఆపకపోవడంతో కంసా మహిళా కళాశాల విద్యార్థినులు బస్సును అడ్డుకుని నిరసన తెలిపారు. రోడ్డు పునరుద్ధరణ పనుల్లో భాగంగా వెయిటింగ్ షెడ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే, బస్సులు తరచుగా స్టాప్‌లో ఆగకుండా వెళ్లిపోతున్నాయి. దీంతో విద్యార్థులు, బస్సు సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది.
యూటర్న్ కు సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, ఈ వాదనను కొట్టిపారేశారు. కుంబ్లా పోలీస్ స్టేషన్ SHO కూడా వాదనలను తిరస్కరించారు.. మతపరమైన కోణం లేదని పేర్కొన్నారు.
బురఖా ధరించిన మహిళలు ఇతర మహిళలను వేధిస్తున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ గొడవలో ఎలాంటి మతపరమైన కోణం లేదు.
Claim : Video shows burqa-clad women harassing a Hindu woman for not wearing a burqa in a bus in Kerala
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story