ఫ్యాక్ట్ చెక్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద యువతి సెటైర్లు వేస్తున్న వీడియోను ఎడిట్ చేశారు.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయనుండగా.. బీజేపీ 10 స్థానాల్లో, టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
Claim :
ఓ యువతి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ కామెంట్స్ చేసిందిFact :
అమ్మాయి ప్రసంగానికి సంబంధించిన ఒరిజినల్ ఆడియో మార్ఫింగ్ చేశారు. పవన్ కళ్యాణ్‌ను కించపరిచేలా కొత్త ఆడియోను జోడించారు
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయనుండగా.. బీజేపీ 10 స్థానాల్లో, టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. టీడీపీ-బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత సోషల్ మీడియాలో పలు వీడియోలు, చిత్రాలు వైరల్ అవుతున్నాయి. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్‌పై ఓ కాలేజీ అమ్మాయి వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి వాట్సాప్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వైరల్‌గా మారింది.
2 లక్షల పుస్తకాలు చదివినా గ్రేస్ మార్కులతో 10వ తరగతి పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ (12వ తరగతి)లో ఫెయిల్ అయిన స్టార్ పవన్ కళ్యాణ్ అని ఆ అమ్మాయి వ్యాఖ్యలు చేసింది. మ్యారేజ్ స్టార్, ప్యాకేజీ స్టార్ అంటూ చెప్పడం వినొచ్చు. తన తల్లితండ్రులంతా పవన్ కళ్యాణ్‌కు బానిసలని చెప్పుకొచ్చింది. జనసేన అంటే చంద్ర బాబు నాయుడు కోసమే అని పవన్ కళ్యాణ్ చెప్పారు. జై జనసేన.. అంటూ వ్యాఖ్యలు చేయడం మనం గమనించవచ్చు.
జనసేన అధినేతపై జనసేన సభ్యులే వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే క్యాప్షన్లతో కూడిన వీడియోను షేర్ చేశారు. ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్ అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ప్రకాశం జిల్లాలో జరిగిన జనసేన విద్యార్థుల సమావేశంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఇతర విద్యార్థుల ప్రసంగాలను కూడా ఈ వీడియోలో చూడవచ్చు. ఒరిజినల్ వీడియోలో.. ప్రకాశం జిల్లాలో పుట్టిన గొప్ప వ్యక్తుల గురించి ఆమె మాట్లాడారు. జిల్లాలో సరైన విద్యా సౌకర్యం కూడా లేదని ఆమె తెలిపారు. ఆమె పవన్ కళ్యాణ్‌ను భగత్ సింగ్‌తో పాటు సుభాష్ చంద్రబోస్‌తో పోల్చారు. జనసేనలో విద్యార్థులంతా సైనికులేనని ఆమె అన్నారు.
‘Pawan Kalyan Lady Fan Mind Blowing Speech At Prakasam | Pawan Kalyan Speech | Janasena Latest News’ అనే టైటిల్ తో ఇదే వీడియోను మ్యాంగో న్యూస్ యూట్యూబ్ ఛానెల్లో మార్చి 6, 2019న పబ్లిష్ చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఓ కాలేజీ అమ్మాయి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన వీడియోను ఎడిట్ చేశారని గుర్తించాం. అసలైన ఆడియోలో ఆమె పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు.