Mon Dec 23 2024 00:10:28 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఆపరేషన్ థియేటర్ లో వైద్యులు గొడవపడుతున్న ఘటన ఇప్పటిది కాదు..!
చండీగఢ్‌లోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసే సమయంలో వైద్యులు తీవ్ర వాగ్వాదానికి దిగారనే సంఘటనకు సంబంధించిన వీడియో అంటూ.. వినియోగదారులు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు.
చండీగఢ్‌లోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసే సమయంలో వైద్యులు తీవ్ర వాగ్వాదానికి దిగారనే సంఘటనకు సంబంధించిన వీడియో అంటూ.. వినియోగదారులు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు.
ఆపరేషన్ జరుగుతూ ఉండగా ఇద్దరి మధ్య గొడవ తీవ్రమైంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఇది ఈ మధ్య చోటు చేసుకున్న ఘటన కాదు.
మేము సంబంధిత కీలక పదాలతో గూగుల్‌లో సెర్చ్ చేసాము. జోధ్‌పూర్‌లోని ఉమైద్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీకి శస్త్రచికిత్స సమయంలో ఇద్దరు వైద్యుల మధ్య వాగ్వివాదానికి సంబంధించిన వీడియో. ఈ ఘటన గురించి ఆగస్ట్ 30, 2017న ANI న్యూస్ ద్వారా నివేదించారు. ఈ సంఘటన ఆగస్టు 29, 2017న జరిగిందని తెలిపారు.
'The Indian Express' ఇందుకు సంబంధించి కథనాన్ని మేము కనుగొన్నాం. ఈ సంఘటనపై మరింత సమాచారాన్ని అందించాయి. అందుకు సంబంధించిన కథనాలు ఆగస్ట్ 30, 2017న ప్రచురించినట్లు గుర్తించాం. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో డాక్టర్ అశోక్ నానివాల్, ఎమ్ ఎల్ ట్యాంక్ అనే ఇద్దరు వైద్యులు తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు కథనం నివేదించింది.
గర్భిణీ స్త్రీకి సి-సెక్షన్ శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు మరణానికి దారితీసింది.
అనేక వార్తా వెబ్సైట్లు 2017లో ఈ సంఘటన వివరాలను నివేదిస్తూ కథనాలను ప్రచురించాయి. ఈ సాక్ష్యాధారాలన్నింటినీ బట్టి, పోస్ట్‌లో షేర్ చేయబడిన వీడియో పాతదని, చండీగఢ్ లేదా పాకిస్తాన్‌కు సంబంధించినది కాదని నిర్ధారించవచ్చు.
అప్పట్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి.. డాక్టర్ నానివాల్ ను విధుల నుండి తప్పించారని.. డాక్టర్ ట్యాంక్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు. జోధ్‌పూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించారు.
https://www.thehindu.com/news/
https://www.hindustantimes.
కాబట్టి, వైరల్ అవుతున్న దావా తప్పు. రాజస్థాన్‌లో గర్భిణీ స్త్రీకి శస్త్రచికిత్స సమయంలో వైద్యులు వాగ్వాదానికి దిగారని చూపించే 2017 నాటి వీడియో చండీగఢ్ కు సంబంధించి ఇటీవలి ఫుటేజ్‌గా షేర్ చేస్తున్నారు.
Claim : A recent incident of doctors having a heated argument during surgery at a hospital in Chandigarh.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story