Fri Nov 15 2024 20:41:05 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కేటీఆర్ రోడ్ షో సమయంలో జై కాంగ్రెస్ నినాదాలు చేయలేదు.. వైరల్ అవుతున్న వీడియోను డిజిటల్ గా రూపొందించారు
119 మంది సభ్యుల తెలంగాణ శాసనసభకు నవంబర్ 30, 2023న ఎన్నికలు జరగనున్నాయి.
Claim :
కొడంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ర్యాలీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతుండగా జై కాంగ్రెస్ నినాదాలు మిన్నంటాయిFact :
వీడియోను ఎడిట్ చేసి పోస్టు చేశారు.. కొడంగల్‌లో జరిగిన BRS ర్యాలీ ప్రత్యక్ష ప్రసారంలో కాంగ్రెస్ అనుకూల నినాదాలు చేయలేదు
119 మంది సభ్యుల తెలంగాణ శాసనసభకు నవంబర్ 30, 2023న ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. నాయకులు పలు నియోజకవర్గాలకు వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు.
తెలంగాణ మంత్రి కేటీ రామారావు ప్రచారం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
“Jai Congress, Jai Revanth Reddy slogans while KTR was speaking. Watch his reaction towards the end #KCRNeverAgain #ByeByeKCR” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ ఉండగా జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
“Jai Congress, Jai Revanth Reddy slogans while KTR was speaking. Watch his reaction towards the end #KCRNeverAgain #ByeByeKCR” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ ఉండగా జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. వీడియోలో జై కాంగ్రెస్.. జై రేవంత్ రెడ్డి అనే నినాదాలను జోడించి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.“KTR rally in Kodangal” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ లో సెర్చ్ చేయగా అందుకు సంబంధించిన పలు వీడియోలను మేము కనుగొన్నాం. పలు తెలుగు మీడియా ఛానల్స్ కూడా కొడంగల్ లో కేటీఆర్ రోడ్ షోను లైవ్ టెలీకాస్ట్ చేశాయి.
“Minister KTR Aggressive speech at Kodangal Roadshow I NTV” అనే శీర్షికతో నవంబర్ 9, 2023న ప్రచురించిన NTV వీడియోను చూడొచ్చు. అప్లోడ్ చేసిన వీడియోలో మేము అలాంటి నినాదాలు చేసినట్లుగా కనుగొనలేకపోయాము.
నవంబర్ 9, 2023న కొడంగల్‌లో రోడ్‌షో నిర్వహించారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. ఆయన రోడ్‌షో లైవ్ వీడియోను T News తెలుగు 7 గంటల కంటే ఎక్కువ ఫీడ్‌తో ప్రచురించింది. వీడియోలో వైరల్ భాగాన్ని 2.13 నిమిషాలకు చూడవచ్చు. ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన వీడియోలో కూడా అలాంటి నినాదాలు వినలేదు.
తెలంగాణటుడే.కామ్ ప్రకారం, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు కొడంగల్ నియోజకవర్గంలో టిపిసిసి అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిది అవినీతి చరిత్ర అని అన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ కూడా అని త్వరలోనే రేవంత్ రెడ్డి జైలు పాలవుతారన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులకు టిక్కెట్లు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కుంభకోణంతో జాతీయ స్థాయిలో కొడంగల్ ప్రతిష్టను దెబ్బతీయడం శోచనీయమని కెటి రామారావు వ్యాఖ్యానించారు.
కేటీఆర్ రోడ్‌షోలో కాంగ్రెస్ అనుకూల నినాదాలు లేవు. వైరల్ క్లిప్ ను ఎడిట్ చేశారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Jai Congress slogans were raised at the BRS rally while Minister KTR was speaking in Kodangal
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story