Thu Dec 19 2024 17:59:11 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అట్లాంటిక్ మహా సముద్రంలో భారీ తిమింగలం విధ్వంసం సృష్టించలేదు
ఫ్లాష్ న్యూస్ జస్ట్* CNN ద్వారా నివేదించబడిన నిమిషాల ముందు - అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న రెండు నౌకలు యాంగ్రీ జంబో వేల్/షార్క్ చేత పూర్తిగా ధ్వంసమయ్యాయి
“*ఫ్లాష్ న్యూస్ జస్ట్* CNN ద్వారా నివేదించబడిన నిమిషాల ముందు - అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న రెండు నౌకలు యాంగ్రీ జంబో వేల్/షార్క్ చేత పూర్తిగా ధ్వంసమయ్యాయి” అంటూ ఓ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.
ఓ భారీ తిమింగలం ఓ షిప్ ను ముక్కలు ముక్కలు చేయడమే కాకుండా.. విమానాన్ని కూడా కూల్చేసిందని వీడియో చూసిన వ్యక్తులు చెప్పుకుంటూ ఉన్నారు. ఇది నిజంగా చోటు చేసుకున్నదని.. భయపడే సమయం వచ్చిందని సోషల్ మీడియా పోస్టుల ద్వారా చెబుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. వైరల్ వీడియో మొత్తం కంప్యూటర్ జెనరేటెడ్ గ్రాఫిక్స్ తో తీసిన వీడియో.వీడియో నుండి సంగ్రహించబడిన కీఫ్రేమ్‌లు తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. 'Aleksey__n' అనే ఛానెల్లో అప్లోడ్ చేసిన YouTube షార్ట్ వీడియోను మేము కనుగొన్నాము. ఈ షార్ట్ మార్చి 9, 2023న “మెగ్” అనే శీర్షికతో అప్లోడ్ చేశారు.https://www.youtube.com/ఈ యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో గ్రాఫిక్స్ వీడియోలను గుర్తించాం.
linktr.ee లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, కళాకారుడికి సంబంధించిన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్‌లను గుర్తించాం.ట్విట్టర్ అకౌంట్ అయిన @AlekseyN11 లోని బయోలో ‘3D artist or 3D Designer’ అని ఒక 3డీ ఆర్టిస్ట్ గా చెప్పుకొచ్చాడు.ఈ పోస్ట్‌లపై వచ్చిన కామెంట్లలో వీడియో నిజమైనది కాదని.. డిజిటల్‌గా రూపొందించారని స్పష్టంగా చెబుతున్నారు.
ఐరిష్ సన్ వెబ్సైట్, thesun.ieలో ప్రచురించిన ఒక కథనంలో యానిమేటెడ్ CGI వీడియో టిక్‌టాక్‌లో తొమ్మిది మిలియన్లకు పైగా లైక్‌లను కలిగి ఉందని.. ఒక పెద్ద మెగాలోడాన్ లాంటి షార్క్ అత్యాధునిక పడవను ఎలా నాశనం చేస్తుందో ఊహించి క్రియేట్ చేశారని పేర్కొంది.మెగాలోడాన్ షార్క్ భూమిపై ఉన్న మహాసముద్రాలలో ఎన్నడూ చూడని అతిపెద్దది జీవిగా చెబుతారు. ఇది దాదాపు 2.6 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయిందని నమ్ముతారు. పూర్తి మెగాలోడాన్ అస్థిపంజరం ఎప్పుడూ కనుగొనలేదు కాబట్టి అవి ఎంత పెద్దవిగా ఉన్నాయో గుర్తించడం శాస్త్రవేత్తలకు చాలా కష్టం. మెగాలోడాన్ 60 అడుగుల పొడవు వరకు పెరుగుతుందని చెబుతూ ఉంటారు. Aleksey (@aleksey__n) పోస్ట్ చేసిన యానిమేటెడ్ వీడియోలో నిజంగా ఉన్న షార్క్ కంటే.. చాలా పెద్ద షార్క్ అని ఊహించారు. ఈ వీడియో మెగాలోడాన్కి సంబంధించిన 'ది మెగ్' సినిమాలో చూపించిన జెయింట్ షార్క్‌ని పోలి ఉంటుంది.
ladbible.com ప్రచురించిన కథనంలో యానిమేషన్ ద్వారా మెగాలోడాన్ ఏమి చేయగలదో చూపించారని తెలిపింది.అట్లాంటిక్ మహాసముద్రంలో పడవలపై దాడి చేస్తున్న తిమింగలం/షార్క్ అంటూ ఏమీ లేదు. ఇది CGI తో రూపొందించిన వీడియో. అదే వైరల్ అవుతోంది. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Claim : Jumbo Whale destroys 2 boats
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Facebook
Fact Check : False
Next Story