Sun Nov 17 2024 16:22:13 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బహిరంగ సభలో ప్రధాని మోదీ వినాయకుడి విగ్రహాన్ని స్వీకరించలేదంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి
Claim :
భారత ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో వినాయకుడి విగ్రహాన్ని స్వీకరించలేదుFact :
వీడియోను ఎడిట్ చేశారు. నరేంద్ర మోదీ విగ్రహాన్ని స్వీకరించారు.
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలకు పోటీ చేస్తున్న 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించిన ప్రధాని మోదీ మూడోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు.
బహిరంగ సభ సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని స్వీకరించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నిరాకరించారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
వినాయకుడి విగ్రహాన్ని పట్టుకున్న వ్యక్తితో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడడం. విగ్రహాన్ని పట్టుకున్న వ్యక్తి దూరంగా వెళ్లిన తర్వాత నమస్కారం చేస్తూ కెమెరాలకు పోజులిస్తున్న వీడియోను పలువురు వినియోగదారులు పంచుకున్నారు. నరేంద్ర మోదీ ఆ వ్యక్తితో మాట్లాడి.. చేయి చూపించగా ఆయన కాస్తా వెనక్కు వెళ్లిపోయారు.
“नरेंद्र मोदी ने गणेश जी की मूर्ति नहीं ली! कल्पना कीजिए मोदी की जगह अगर किसी विपक्षी नेता ने भगवान गणेश को लेने से मना कर दिया होता तो आज गोदी मीडिया और भाजपाइयों का झुंड अपनी चूड़ियां तोड़ रहा होता।“ అంటూ హిందీలో పోస్టు వైరల్ అవుతూ ఉంది. 'నరేంద్ర మోదీ వినాయకుడి విగ్రహాన్ని తీసుకోలేదు! మోదీ స్థానంలో ప్రతిపక్ష నేత ఎవరైనా ఉండి.. వినాయకుడి విగ్రహాన్ని తీసుకోడానికి నిరాకరించి ఉంటే.. ఈరోజు ఓ వర్గం మీడియా.. బీజేపీ మద్దతుదారులు, ఏమైనా చేసి ఉండేవారని గుర్తు పెట్టుకోండి.
“मोदी जी ने भगवान गणेश को लेने से मना कर दिया” అనే క్యాప్షన్ తో ఫేస్బుక్ వినియోగదారు వీడియోను షేర్ చేశారు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వినాయకుడి విగ్రహాన్ని ప్రధాని మోదీ అంగీకరించలేదని జరుగుతున్న ప్రచారం తప్పు. ఆయన విగ్రహాన్ని స్వీకరించడాన్ని చూడవచ్చు. వైరల్ వీడియో ఎడిట్ చేశారు.
మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్లను ఉపయోగించి Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, మే 3, 2023న న్యూస్ 18 కన్నడ ప్రచురించిన YouTube వీడియోని మేము కనుగొన్నాము. “LIVE: PM Modi Rally In Ankola | BJP Election Campaign | Karnataka Elections 2023 | News18 Kannada.”అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని అంకోలాలో నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసార వీడియో. వైరల్ వీడియోలో కనిపించిన సంఘటనను 1.41.33 నిమిషాల నుండి 1.42.20 నిమిషాల వరకు చూడవచ్చు. అక్కడ మోడీ పలు బహుమతులను స్వీకరించడాన్ని చూడవచ్చు. నరేంద్ర మోదీ యక్షగాన కిరీటం ధరించారు, పూలమాలలు స్వీకరించారు. వినాయకుడి విగ్రహం తీసుకున్న వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు.. ఆయన్ను కొంచెం వెనక్కి వెళ్ళమని సూచించారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ నమస్కారం పెట్టడం.. తరువాత వినాయకుడి విగ్రహాన్ని స్వీకరించడం కనిపిస్తుంది.
వైరల్ వీడియోలో కన్నడ భాషలో ‘విజయవాణి’ లోగోను చూడవచ్చు. దాన్ని క్యూగా తీసుకొని విజయవాణి యూట్యూబ్ ఛానెల్ కోసం వెతికాము. మే 3, 2023న ‘ముల్కీలో ప్రధాని మోదీ యక్షగాన కిరీటం ధరించారు’ అనే శీర్షికతో ప్రచురించబడిన వీడియోను మేము కనుగొన్నాము
'ಮೋದಿಗೆ ಯಕ್ಷಗಾನ ಕಿರೀಟ ತೊಡಿಸಿ ಸನ್ಮಾನಿಸಿದ VishweswarHegdeKageri’ అంటూ వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో కూడా ప్రధాని మోదీ వినాయకుడి విగ్రహాన్ని స్వీకరించడాన్ని మనం చూడవచ్చు.
ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వీడియోను భారతీయ జనతా పార్టీ యూట్యూబ్ ఛానెల్లో కూడా మనం చూడవచ్చు.
కాబట్టి, బహిరంగ సభ సమయంలో వినాయకుడి విగ్రహాన్ని నరేంద్ర మోదీ స్వీకరించలేదనే వాదన అబద్ధం. వైరల్ వీడియోను ఎడిట్ చేసి పోస్టు చేశారు.
Claim : Indian Prime Minister Narendra Modi did not accept Ganesh idol at a public meeting
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story