Tue Nov 05 2024 14:38:09 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీద నడుస్తున్న వీడియోను తప్పుడు వాదనతో షేర్ చేశారు.
ఇంటర్నెట్లో 3 నిమిషాల 47 సెకన్ల వీడియో వైరల్ అవుతూ ఉంది. హిందూ దేవాలయం ముందు
Claim :
ప్రధాని నరేంద్ర మోదీ తన 26 ఏళ్ల వయసులో కేదార్నాథ్ ఆలయం చుట్టూ తన చేతుల మీద నడిచారుFact :
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021 సందర్భంగా కేదార్నాథ్ ఆలయ పూజారి ఆచార్య సతోష్ త్రివేది చేతుల మీద నడుస్తున్నారు
ఇంటర్నెట్లో 3 నిమిషాల 47 సెకన్ల వీడియో వైరల్ అవుతూ ఉంది. హిందూ దేవాలయం ముందు చేతులపై నడుస్తున్న సాధువుని చూపిస్తుంది. "ప్రధాని నరేంద్ర మోదీ తన చిన్నవయస్సులో యోగా చేశారు" అనే వాదనతో బహుళ సోషల్ మీడియా వినియోగదారులు తమ ఖాతాలలో ఈ వీడియోను పంచుకున్నారు.
మరికొందరు అదే వీడియోను "యోగా చేస్తున్నప్పుడు నరేంద్ర మోదీ అరుదైన వీడియో" వంటి విభిన్న శీర్షికలతో షేర్ చేస్తున్నారు.
మరొక వినియోగదారుడు "ఒక రోజు ఈ వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడని ఎవరికీ తెలియదు" అంటూ పోస్టు చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించినది కాదు.
Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి కీఫ్రేమ్‌లను సెర్చ్ చేయగా.. ఈ వీడియోను యోగి నర్మదా నాథ్ జీ తన ఫేస్బుక్ పేజీలో జూన్ 21, 2021న అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. “Param Yogi Mahadev Kedareshwar’s Shri Charan Acharya Shri Santosh Trivedi ji circumambulating Kedarnath Jyotirlinga temple with his yoga” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు. దీని ద్వారా.. పరమ యోగి మహాదేవ్ కేదారేశ్వర్ శ్రీ చరణ్ ఆచార్య శ్రీ సంతోష్ త్రివేదీ జీ కేదార్‌నాథ్‌ను ప్రదక్షిణ చేస్తున్నారని ఆ టైటిల్ తో తెలిపారు.
మీరు వీడియోను నిశితంగా గమనిస్తే, మంచు కురవడం చాలా అసహజంగా కనిపిస్తోంది. వీడియోలోని నీలం రంగు ఫిల్టర్‌గా కనిపిస్తుంది.. కానీ వాస్తవం కాదు.
తదుపరి పరిశోధనలో, మేము మార్చి 22, 2024న ANI ప్రచురించిన కథనాన్ని కనుగొన్నాము.. “అంతర్జాతీయ యోగా దినోత్సవం: ఆచార్య సంతోష్ త్రివేది కేదార్నాథ్ ఆలయంలో చేతులపై యోగాను చేశారు” అనే వాదనతో పోస్టులు చేశారని మేము తెలుసుకున్నాం.
మేము ఆచార్య సంతోష్ త్రివేది కేదార్నాథ్ గురించి గూగుల్ సెర్చ్ చేశాం. ఆయన ఆలయంలో చేతుల మీద యోగాను చేశారనే వివరాలను కనుగొన్నాం.
ది కమ్యూనిమాగ్ ప్రకారం: "కేదార్నాథ్ ఆలయ పూజారి ఆలయంలో చేతుల మీద నడుచుకుంటూ వెళ్లారు" అని నివేదిక ఉంది.
'శ్రీ కేదార్ 360 ట్రస్ట్' జూన్ 21, 2021న వారి అధికారిక X ఖాతాలో అదే వీడియోను షేర్ చేశారు. ఆచార్య శ్రీ సంతోష్ త్రివేది కేదార్నాథ్ ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆయనకు యోగాలో నైపుణ్యం ఉందని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులను ఆయన యోగా చేయమని ప్రేరేపించారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
కేదార్నాథ్ ఆలయ ప్రాంగణం చుట్టూ తిరుగుతున్న వ్యక్తి ఆచార్య సంతోష్ త్రివేది. 2021లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన యోగాను ప్రచారం చేశారు.
Claim : Narendra Modi walking on his hands around Kedarnath temple when he was 26-year-old
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story