Sun Dec 22 2024 15:32:20 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఓ కోతి ఆఫీసులో ఫైళ్లను తనిఖీ చేస్తున్న వీడియో అయోధ్య రామ మందిరానికి సంబంధించింది కాదు
అయోధ్య రామ మందిరం రామ్‌లల్లా శంకుస్థాపన తర్వాత కూడా వార్తల్లో నిలిచింది. కొత్తగా ప్రారంభించిన రామాలయానికి దేశం నలుమూలల నుండి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ TTD అవలంబించే క్రౌడ్ మేనేజ్మెంట్లో ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
Claim :
అయోధ్యలో రామ మందిరం పేరు రిజిస్ట్రేషన్ అయిందా లేదని చూస్తున్న కోతిFact :
ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లోని లాయర్ కార్యాలయంలోకి కోతి ప్రవేశించినట్లు వీడియో చూపిస్తుంది.
అయోధ్య రామ మందిరం రామ్‌లల్లా శంకుస్థాపన తర్వాత కూడా వార్తల్లో నిలిచింది. కొత్తగా ప్రారంభించిన రామాలయానికి దేశం నలుమూలల నుండి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ TTD అవలంబించే క్రౌడ్ మేనేజ్మెంట్లో ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
ఇక ఆలయం, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం చుట్టూ చాలా తప్పుడు వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల, ఒక కోతి కార్యాలయంలో కూర్చొని ఫైళ్లు, పత్రాలను పరిశీలిస్తున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. అయోధ్యలోని రామాలయం రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా అని ఆ కోతి పరిశీలిస్తుందనే వాదనతో వీడియోను షేర్ చేశారు.
“అయోధ్యలో రామ మందిరం పేరు రిజిస్ట్రేషన్ అయిందా లేదని చూస్తున్న హనుమంతుడు జై శ్రీరామ్" అంటూ పోస్టులు పెట్టారు.
“అయోధ్యలో రామ మందిరం పేరు రిజిస్ట్రేషన్ అయిందా లేదని చూస్తున్న హనుమంతుడు జై శ్రీరామ్" అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ వీడియో ఇటీవలిది కాదు.. అంతేకాకుండా అయోధ్యకు చెందినది కాదు.
మేము వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్‌లను ఉపయోగించి సెర్చ్ చేశాం. అక్టోబర్ 2023లో ప్రభుత్వ కార్యాలయంలో కోతి ఫైళ్లను తనిఖీ చేస్తుంది, అరటిపండ్లను పట్టించుకోలేదనే వాదనతో ప్రచురించిన YouTube వీడియో మాకు కనిపించింది.
‘Trending I Monkey check files at Government office, ignores Bananas” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
ఈ వీడియోను అక్టోబర్ 14, 2023న ఇండియా టుడే కూడా ప్రచురించింది, “ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లోని ఒక కార్యాలయంలో కోతి ఫైళ్లను చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో ఒక కోతి టేబుల్‌పై కూర్చొని, రిజిస్టర్ పేజీలను పరిశీలిస్తూ ఉంది. కోతికి అరటిపండ్లు ఇస్తున్నా కూడా.. అది వాటిని తీసుకోవడానికి నిరాకరించింది.
బెహత్ తహసీల్ ప్రాంతంలోని ప్రభుత్వ ఏజెన్సీకి చెందిన కార్యాలయంగా మొదట భావించారు.. అయితే, వైరల్ వీడియో ప్రభుత్వ కార్యాలయానికి చెందినది కాదని సహరాన్పూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) దీపక్ కుమార్ స్పష్టం చేశారు. కోతి బెహత్ తహసిల్ ప్రాంతంలోని ఒక న్యాయవాది ఛాంబర్లోకి ప్రవేశించి టేబుల్‌పై కూర్చుందని ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలో కోతి బాగా తిరుగుతూ ఉంటుందని అన్నారు. ఈ ఘటనపై అటవీశాఖ, పోలీసు అధికారులకు సమాచారం అందించామని ఏడీఎం తెలిపారు.
న్యూస్ 18 కూడా ఈ సంఘటనను నివేదించింది. అక్టోబర్ 2023లో UPలోని సహరన్‌పూర్‌లో జరిగిందని ధృవీకరించింది.
వైరల్ వీడియో ఇటీవలిది కాదని.. అయోధ్యలోని రామమందిర రిజిస్ట్రేషన్ ఫైళ్లను కోతి చూడలేదని స్పష్టంగా చెబుతున్నాం. వీడియో పాతది, ఆ కోతి ఓ న్యాయవాది కార్యాలయంలోకి ప్రవేశించి ఫైళ్లను పరిశీలిస్తోంది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : A monkey is checking the registration files in Ayodhya to know if the Ram Temple is registered or not
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : False
Next Story