Mon Dec 23 2024 03:04:55 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఈవీఎం మెషీన్లను తరలిస్తున్న ట్రక్కుపై ఉన్నది బీజేపీ కార్యకర్తలు కాదు
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేవలం ఒక దశ మాత్రమే పెండింగ్ ఉంది. ఎన్నికలు చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తయ్యాయి. చివరి దశ ఎన్నికల కోసం ప్రచారం జరుగుతోంది.
Claim :
ఈవీఎం మెషీన్లను తరలిస్తున్న ట్రక్కుపై బీజేపీ కార్యకర్తలు ఎక్కి.. వాటిని సొంతం చేసుకున్నారుFact :
ఈ వీడియో 2022 సంవత్సరానికి చెందినది, వీడియోలో ఉన్నవి శిక్షణ కోసం ఉపయోగించే ఈవీఎంలు
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేవలం ఒక దశ మాత్రమే పెండింగ్ ఉంది. ఎన్నికలు చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తయ్యాయి. చివరి దశ ఎన్నికల కోసం ప్రచారం జరుగుతోంది.
ఈవీఎం మెషీన్లను చేతిలో పట్టుకుని ట్రక్కుపైకి ఎక్కిన గుంపుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఎన్నికల తర్వాత ఈవీఎం యంత్రాలను బీజేపీ కార్యకర్తలు తీసుకుని వెళ్తున్నారనే వాదనతో వీడియోను వైరల్ చేస్తున్నారు
కొంతమంది వినియోగదారులు “BJP వాలే EVM లూట్ లియా” అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసారు. ఈ వీడియోలోని వాయిస్ లో.. ఈవీఎంలను BJP కార్యకర్తలు పట్టపగలే తీసుకుని వెళ్తున్నారని పేర్కొన్నారు. ఇలా సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారని విమర్శించారు.
ఈ వీడియో యూట్యూబ్, ట్విట్టర్ లలో కూడా వైరల్ అయింది.
“I guess @ECISVEEP @SpokespersonECI will say their truck broke down, and fortunately, BJPEEE had their trucks readily available and helped transport the EVM. @LiveLawIndia” అంటూ ట్విట్టర్ యూజర్లు పోస్టు చేస్తున్నారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన ట్రక్కు కు రిపేరీ జరిగిందని.. ఆ సమయంలో సహాయం చేయడానికి బీజేపీ కార్యకర్తలు మాత్రమే అందుబాటులో ఉన్నారంటూ పోస్టులు పెట్టారు.
“F̶r̶e̶e̶ ̶&̶ ̶F̶a̶i̶r̶ ̶ Elections In Largest D̶e̶m̶o̶c̶r̶a̶c̶y̶ Rajeev Kumar is the Murderer of Largest Democracy. In any other Civilized Democratic country #RajivKumar would have been removed from office. And Elections were conducted under the supervision of the #SupremeCourt. #LokSabhaElections2024 #CongressAaRahiHai #RahulGandhiForPM” అంటూ మరికొందరు పోస్టులు చేశారు. ఎన్నికలు సరిగా జరగడం లేదంటూ విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ.. బీజేపీని విమర్శిస్తూ పోస్టులు పెట్టడాన్ని మేము గమనించాం.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో 2022 సంవత్సరానికి చెందినది, పాతది. ఈ వీడియోలో కనిపించే EVM మెషీన్లు శిక్షణా తరగతులకు సంబంధించినవి. ఎన్నికల కమీషన్ ఎన్నికల్లో భాగమయ్యే అధికారులకు ఈవీఎంలకు సంబంధించిన శిక్షణ ఇస్తూ ఉంటుంది. అలా తీసుకుని వెళుతున్న ఈవీఎంలే ఇవి.
వైరల్ వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించాం.. మోజో స్టోరీ మార్చి 2022లో ప్రచురించిన వీడియోను మేము కనుగొన్నాము. వీడియో టైటిల్ లో “UP election I Akhilesh Yadav alleges EVM theft, party workers protest after spotting trucks with EVMs” అని ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ఈవీఎంలతో ఉన్న ట్రక్కులను గుర్తించి నిరసన తెలిపారని ఆ కథనాల్లో ఉంది.
2022లో వీడియో వైరల్ అయిన తర్వాత ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ కమీషనర్ వివరణ ఇచ్చారు. వైరల్ వీడియోలో కనిపించే EVMలను శిక్షణ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించారని మీడియా ప్రకటనను గుర్తించాం. అవి నిజమైన ఈవీఎం యంత్రాలు కావని.. కౌంటింగ్ అధికారుల శిక్షణ జరుగుతున్న కళాశాలకు తీసుకెళ్లారని వివరించారు. ఇంతలో రాజకీయ పార్టీలకు చెందిన కొందరు వ్యక్తులు వాహనాన్ని ఆపి ఈవీఎం మిషన్ల మీద వివాదం చేశారని తెలిపారు.
అసలు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో సీలు చేసి, సైనిక బలగాల పర్యవేక్షణలో భద్రంగా ఉంచుతామని కూడా ప్రకటనలో తెలిపారు.
వైరల్ పోస్టులలో చెప్పినట్లుగా బీజేపీ కార్యకర్తలు ఈవీఎం మెషీన్లతో నిండిన ట్రక్కును తమ ఆధీనంలోకి తీసుకోలేదు. ట్రక్కులోని EVM మెషీన్లు శిక్షణ ప్రయోజనాల కోసం ఉపయోగించేవి. అవి నిజమైన EVMలు కావు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ఈవీఎం మెషీన్లను తరలిస్తున్న ట్రక్కుపై బీజేపీ కార్యకర్తలు ఎక్కి.. వాటిని సొంతం చేసుకున్నారు
Claimed By : Youtube, Twitter Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Youtube
Fact Check : False
Next Story