Fri Nov 22 2024 13:30:52 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: శ్రీరాముడి భక్తులు హైదరాబాద్ లో భారీ ఎత్తున ఊరేగింపుకు హాజరయ్యారంటూ వైరల్ అవుతున్న వీడియో తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు
జనవరి 22, 2024న అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠించనున్నారు. దీనికి ముందు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్షత కలశ యాత్ర ఊరేగింపులు జరుగుతున్నాయి.
Claim :
వైరల్ వీడియోలో ఉన్నది హైదరాబాద్లో అయోధ్యకు సంబంధించిన అక్షత కలశ యాత్రFact :
భాగేశ్వర్ ధామ్ వద్ద హనుమాన్ కథ ప్రారంభమైన తర్వాత కలాష్ యాత్రను వైరల్ వీడియో చూపిస్తుంది.
జనవరి 22, 2024న అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠించనున్నారు. దీనికి ముందు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్షత కలశ యాత్ర ఊరేగింపులు జరుగుతున్నాయి. అక్షత కలశ యాత్రలో వేలాది మంది పురుషులు, మహిళలు పాల్గొంటున్నారు. అక్షత కలశ యాత్రకు సంబంధించిన ఊరేగింపులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్నాయి. అలాంటి ఊరేగింపు హైదరాబాద్లో కూడా జరిగింది.
వేలాది స్రీలు కలశాన్ని మోసుకెళ్తున్న వీడియోను చూపించే ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. అయోధ్యలో భక్తుల ఊరేగింపును చూపుతుందని కొంతమంది వినియోగదారులు వీడియోను షేర్ చేసారు. మరికొంత మంది సోషల్ మీడియా వినియోగదారులు దీనిని భాగ్యనగర్ (హైదరాబాద్)లో అక్షత్ కలశ యాత్రగా షేర్ చేశారు.
‘Ayodhya ||अयोध्या के लिए भक्तों का प्रवाह ||’ అంటూ కొందరు పోస్టులు పెట్టారు.
‘அயோத்தியில் பெண்களின் தீர்த்த ஊர்வலம் ஜெய் ஸ்ரீ ராம் అంటూ తమిళంలో మరికొందరు పోస్టులు షేర్ చేశారు. అయోధ్యలో మహిళలు చేపట్టిన ఊరేగింపు ఇదని తెలిపారు.
‘जय श्रीराम..अक्षता कलश यात्रा, भाग्यनगर (हैदराबाद )’ అంటూ ఇది హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఊరేగింపు అని పోస్టులు పెట్టారు
‘Ayodhya ||अयोध्या के लिए भक्तों का प्रवाह ||’ అంటూ కొందరు పోస్టులు పెట్టారు.
‘அயோத்தியில் பெண்களின் தீர்த்த ஊர்வலம் ஜெய் ஸ்ரீ ராம் అంటూ తమిళంలో మరికొందరు పోస్టులు షేర్ చేశారు. అయోధ్యలో మహిళలు చేపట్టిన ఊరేగింపు ఇదని తెలిపారు.
‘जय श्रीराम..अक्षता कलश यात्रा, भाग्यनगर (हैदराबाद )’ అంటూ ఇది హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఊరేగింపు అని పోస్టులు పెట్టారు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో జూలై 2023 నాటిది.. ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో ఈ కలష్ యాత్రను నిర్వహించారు.వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్లపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా జూలై 2023లో అప్లోడ్ చేసిన కొన్ని వీడియోలను చూడవచ్చు.
‘Devo ki Nagri devbhoomi Baba Bageswar Dham Sarkar I Jai Shree Ram #Bhageshwardham #delhi’ అనే టైటిల్ తో వీడియోను షేర్ చేశారు. ఫేస్ బుక్ లో జులై 2023లో వీడియోను పోస్టు చేశారు.
navbharattimes.comలో ప్రచురించిన ఒక కథనంలో వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ లను గుర్తించారు. 'దర్బార్ నిర్వహించడానికి ముందు కలష్ యాత్రను చేపట్టారు. గ్రేటర్ నోయిడాలో దివ్య దర్బార్ వేడుకలకు ముందు ఆదివారం నాడు భారీ ఎత్తున కలష్ యాత్రను నిర్వహించారు. ఇందులో వేలాది మంది ప్రజలు.. ముఖ్యంగా మహిళలు పాల్గొన్నారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర కలశ యాత్రను చేపట్టారని మీడియా కథనాల్లో తేలింది.
opindia.com ప్రకారం.. బాబా ధీరేంద్ర కృష్ణ శాస్త్రి (భాగేశ్వర్ ధామ్ మహారాజ్)చే హనుమాన్ కథా పారాయణ కార్యక్రమం నిర్వహించే మొదటి రోజున సుమారు 11,000 మంది మహిళలు ఈ కలశ యాత్రలో పాల్గొన్నారు. టింకా ఏక్ సహారా సంస్థ కలశ యాత్రను నిర్వహించింది.
హైదరాబాద్లో బిజెపి ఎంపి కె. లక్ష్మణ్ అక్షత్ కలశ యాత్ర నిర్వహించినప్పటికీ.. ఆ విజువల్స్ వైరల్ వీడియోతో సరిపోలడం లేదు.
కాబట్టి, వైరల్ వీడియో అయోధ్యలో ఊరేగింపు లేదా హైదరాబాద్లోని అక్షత్ కలశ యాత్రకు సంబంధించినది కాదు. ఇది జూలై 2023లో ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన కలశ యాత్రను చూపుతుంది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Viral video shows procession of devotees in Ayodhya/ Akshata Kalash yatra in Hyderabad
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story