Mon Dec 23 2024 13:43:04 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అశోక్ చక్ర స్థానంలో ఇస్లామిక్ కల్మా ఉన్న భారత జెండాను పట్టుకున్న నిరసనకారుల వీడియో కాంగ్రెస్ విజయానికి సంబంధించినది కాదు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరి సమక్షంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు హామీలు, సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.
Claim :
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత భారత జెండాలో అశోక చక్రం బదులుగా ఇస్లామిక్ కల్మాతో ఉన్న జెండానువు పట్టుకుని ఊరేగింపు జరిగిందని ఆ వీడియో చూపిస్తుంది.Fact :
ఈ వీడియో జూన్ 2022 నాటిది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో జరిగిన ఒక ఊరేగింపుకు సంబంధించింది. ఈ వీడియోకు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి ఎటువంటి సంబంధం లేదు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరి సమక్షంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు హామీలు, సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.
భారతీయ త్రివర్ణ పతాకం తరహాలో ఉన్న జెండాలను పట్టుకుని ఉన్న ఊరేగింపును చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ జెండాపై అశోక చక్రం స్థానంలో ఇస్లామిక్ కల్మా ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత అశోక చర్కా స్థానంలో ఇస్లామిక్ కల్మాతో భారత జెండాను పట్టుకుని ఊరేగింపు జరిపిన ఈ వీడియో వైరల్‌గా మారిందని పలువురు పోస్టులు పెడుతున్నారు.
‘तेलंगाना में कांग्रेस के जीतते ही भारत के झंडे पर कलमा लिख दिया गया. क्या अब भी कांग्रेस को लाना चाहोगे अपने अपने प्रदेस में या केंद्र में ‘ అంటూ హిందీలో పోస్టులు పెట్టారు.
'తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే భారత జెండాలోకి కల్మా వచ్చి చేరింది. ఇది చూశాక కూడా ఇంకా మీరు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అనుకుంటూ ఉన్నారా?' అని అందులో ఉంది.

ఫేస్బుక్ వినియోగదారుల్లో ఒకరు కన్నడ భాషలో కూడా వీడియోను షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. వీడియో పాతది.. జూన్ 2022లో జరిగిన ఊరేగింపుకు సంబంధించినది.మేము వీడియోకు సంబంధించిన కీలక ఫ్రేమ్‌లను సంగ్రహించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని చేశాం. ఇది 2022 సంవత్సరానికి చెందినదని నిర్ధారించే కొన్ని వార్తా కథనాలు, వీడియోలను మేము కనుగొన్నాము.
జీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ లో DNA Live: DNA with Sudhir Chaudhary, June 10, 2022, I Top news Today I Hindi News I Analysis అంటూ వీడియోను అప్లోడ్ చేశారు. వైరల్ వీడియోకు సంబంధించిన భాగాన్ని 32.52 నిమిషాల వద్ద చూడొచ్చు.
అందులో సుధీర్ చౌధరీ మాట్లాడుతూ "తెలంగాణలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో కొందరు అశోక చక్రను తీసేసి ఇస్లామిక్ కల్మాను ఉంచారు" అంటూ తెలిపారు. నుపుర్ శర్మ వ్యాఖ్యల తర్వాత దేశ వ్యాప్తంగా జరిగిన నిరసనల గురించి అందులో తెలిపారు.
ప్రవక్త మహమ్మద్‌పై నూపుర్ శర్మ (సస్పెండ్ చేయబడిన బిజెపి అధికార ప్రతినిధి) వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలలో భాగంగా ఈ నిరసనలు చోటుకు చేసుకున్నాయి. జూన్ 2022లో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించలేదు, ఆ సమయంలో BRS అధికారంలో ఉంది.
ఇదే వార్తను ఇండియా టీవీ కూడా నివేదించింది, వారి యూట్యూబ్ ఛానెల్లో జూన్ 10, 2022న “तेलंगाना के महबूबनगर में तिरंगे से बेअदबी, अशोक चक्र की जगह कलमा लिख दिया गया” హిందీ టైటిల్ తో వీడియోను ప్రచురించింది. “తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో త్రివర్ణపతాకాన్ని అగౌరవపరిచారు, అశోక్ చక్రం స్థానంలో కల్మా ఉంది” అని అందులో కూడా నివేదించారు.
ఫస్ట్పోర్ట్.కామ్‌లోని కథనం ప్రకారం, మహమ్మద్ ప్రవక్త పై నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనల మధ్య, కొంతమంది నిరసనకారులు జాతీయ జెండాను మోస్తూ కనిపించారు, దానిలో అశోక చక్రం స్థానంలో 'కల్మా' ఉంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కాబట్టి, ఈ వీడియో పాతది. ఈ వీడియోకు తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : The video shows a procession after Congress wins Telangana Assembly elections, where the Ashoka Chakra on the Indian flag has been replaced by the Islamic Kalma
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story