Fri Nov 22 2024 03:12:22 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రాహుల్ గాంధీ తనకు సమర్పించిన హిందూ విగ్రహాన్ని స్వీకరించడానికి నిరాకరించినట్లు చూపుతున్న వీడియో ట్రిమ్ చేసి అప్లోడ్ చేశారు.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని
Claim :
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బహిరంగ సభలో హిందూ దేవుళ్ల విగ్రహాన్ని తీసుకోడానికి అంగీకరించలేదుFact :
వేదికపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విగ్రహాన్ని స్వీకరించి.. ఫోటోకు పోజులిచ్చారు
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని నాసిక్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సన్మానం సందర్భంగా రాహుల్ గాంధీకి పార్టీ కార్యకర్త ఒకరు సమర్పించిన హిందూ దేవుళ్ల విగ్రహాన్ని స్వీకరించేందుకు నిరాకరించారని సోషల్ మీడియాలో వీడియో షేర్ అవుతోంది.
ఇది భగవంతుడిని ఆరాధించే లక్షలాది మంది హిందూ భక్తులకు అవమానమంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదే వాదనతో.. సోషల్ మీడియా వినియోగదారులు, ఒక జాతీయ పార్టీకి చెందిన మీడియా సెల్ ట్విట్టర్ ఖాతాలో వీడియోను పంచుకున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ సహాయంతో మేము వెతకగా.. ఈవెంట్ లైవ్ స్ట్రీమ్‌కు సంబంధించిన వీడియోను మేము కనుగొన్నాం. మార్చి 14, 2024న రాహుల్ గాంధీ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. మేము సరిగ్గా 17:15 టైమ్స్టాంప్కి, రాహుల్ విగ్రహాన్ని పట్టుకుని ఫోటోగ్రాఫర్లకు పోజులివ్వడం మాకు కనిపించింది.
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసిన తర్వాత.. మార్చి 14, 2024న మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నానా పటోలే తన X ఖాతాలో చేసిన పోస్ట్‌లో వీడియోను మేము కనుగొన్నాము.
అతను తన పోస్ట్‌లో కూడా.. "కాషాయ కుర్తాలో అదే వ్యక్తి, తెల్ల చొక్కా ధరించిన మరొక వ్యక్తితో కలిసి సమర్పించిన విగ్రహాన్ని గాంధీ తీసుకోవడం స్పష్టంగా చూడవచ్చు" వివరించారు.
క్లిప్ ఒరిజినల్ వెర్షన్‌ను షేర్ చేస్తున్న వీడియోను మేము కనుగొన్నాం..
ఒడియా ఉక్కు మనిషి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్ధార్థ్ రౌత్రే రెండు చిత్రాలను పోస్ట్ చేశారు. రెండు ఘటనలకు సంబంధించిన పోస్టులను ఆయన వివరిస్తూ, ఎడిట్ చేసిన వీడియోలను మేము గుర్తించాం. ఆయన తన పోస్ట్‌లో “గోడీ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తల గురించి తెలుసుకోండి. భగవాన్ విఠల్‌ను గౌరవించినా కూడా రాహుల్ గాంధీని తప్పుడు వాదనతో ట్రోల్ చేశారు." తెలిపారు.
న్యూస్ యాప్ ఇన్షార్ట్లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. రాహుల్ గాంధీ విఠల్ విగ్రహం వీడియోను తీసుకునే విషయంలో తప్పుగా చూపించారని వివరణ కూడా ఇచ్చింది.
మీరు వైరల్ వీడియోను నిశితంగా గమనిస్తే, రాహుల్ గాంధీ హిందూ దేవతల విగ్రహాన్ని స్వయంగా అందుకోవడం మీరు కనుగొనవచ్చు. అందువల్ల, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ట్రిమ్ చేశారు.
Claim : Congress leader Rahul Gandhi did not accept an idol of a Hindu deity at a public gathering
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story