Sat Nov 23 2024 07:23:49 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నీటి అడుగున కఠోరమైన వ్యాయామాలను కొందరు చేస్తున్న వీడియో భారత నౌకాదళానికి సంబంధించినది కాదు, USAకి చెందినది
ఇండియన్ నేవీ భారత్ కు రక్షణగా నిలుస్తూ ఉంది. నావికాదళం ప్రధాన లక్ష్యం దేశం సముద్ర సరిహద్దులను రక్షించడం. భారతీయ నావికాదళం మధ్య-ఉత్తర అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన తర్వాత వైమానిక నిఘాను పెంచింది. బలగాలను పెద్ద ఎత్తున సముద్రంలో మోహరించింది.
Claim :
భారత నావికాదళ సభ్యులు నీటి అడుగున కఠోరమైన వ్యాయామాలు చేస్తున్నారుFact :
వీడియోలో ఉన్నది ఇండియన్ నేవీకి సంబంధించిన శిక్షణ కాదు. ఇది అమెరికాలో డీప్ ఎండ్ ఫిట్నెస్ అనే సంస్థ ఇస్తున్న శిక్షణకు సంబంధించింది
ఇండియన్ నేవీ భారత్ కు రక్షణగా నిలుస్తూ ఉంది. నావికాదళం ప్రధాన లక్ష్యం దేశం సముద్ర సరిహద్దులను రక్షించడం. భారతీయ నావికాదళం మధ్య-ఉత్తర అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన తర్వాత వైమానిక నిఘాను పెంచింది. బలగాలను పెద్ద ఎత్తున సముద్రంలో మోహరించింది.
ఇంతలో, కొంతమంది యువకులు నీటి అడుగున కఠినమైన వ్యాయామాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. భారతీయ నేవీకి చెందిన సైనికులు వ్యాయామాలు చేస్తున్నారనే వాదనతో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో వ్యక్తుల చేతులు, కాళ్ళు కట్టివేశారు. ఎంతో కఠినమైన వ్యాయామంగా మనకు అనిపిస్తూ ఉంది. ఈ వీడియో "ఇండియన్ నేవీ ట్రైనింగ్" అనే శీర్షికతో వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో ఉన్నది ఇండియన్ నేవీకి సంబంధించిన శిక్షణ కాదు.
ముందుగా, మేము ఇండియన్ నేవీకి సంబంధించిన వీడియోలు, చిత్రాల కోసం వెతికాం. భారత నేవీకి సంబంధించిన అనేక మీడియా పోస్ట్‌లను షేర్ చేసిన ఇండియన్ నేవీ అధికారిక ఫేస్బుక్ పేజీని కనుగొన్నాము. కానీ వైరల్ అవుతున్న వీడియో ఏదీ కనుగొనలేకపోయాం.
వీడియోకు సంబంధించిన కీలక ఫ్రేమ్‌లను తీసుకున్నాం.. వాటిని Google లో రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించాము. సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని వీడియోలను కనుగొన్నాము. “Crazy Underwater Military Training (@deependfitness)” అనే టైటిల్ తో యూట్యూబ్ లో వీడియోను పోస్టు చేసినట్లు గుర్తించాం. Dan Curl అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియోను కనుగొన్నాం.
House of Highlights అనే ఇంస్టాగ్రామ్ పేజీలో @deependfitness అనే అకౌంట్ కు క్రెడిట్స్ ఇవ్వడాన్ని కూడా మేము గుర్తించాం.
దీన్ని క్యూ గా తీసుకొని, మేము డీప్ ఎండ్ ఫిట్నెస్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ను సెర్చ్ చేశాం. మే 29, 2023న వారు షేర్ చేసిన వైరల్ వీడియో మాకు కనిపించింది. ““As we express our gratitude, we must never forget that the highest appreciation is not to utter words but to live by them.” -JFK అనే క్యాప్షన్ తో వీడియోను పోస్టు చేశారని మేము గుర్తించాం.
మెమోరియల్ డే శుభాకాంక్షలు చెబుతూ వీడియోను పోస్టు చేశారు.
మేము YouTube ఛానెల్లోనూ, ఆ సంస్థకు చెందిన Facebook పేజీలో ఇలాంటి అనేక వీడియోలను కనుగొన్నాము.
సంస్థ నీటిలోపల శిక్షణ ఇస్తుంది. కావాల్సిన ఫిట్నెస్ సామర్థ్యాన్ని చేరుకోవడానికి, మెరుగుపరుచుకోడానికి వ్యక్తులకు శిక్షణ ఇస్తుంది. ఇది US మిలిటరీ స్పెషల్ ఆపరేటర్లచే రూపొందించిన ఫిట్నెస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మానసిక స్థితిస్థాపకతను పెంచుతుందని నిరూపించారు.
డీప్ ఎండ్ ఫిట్నెస్ వెబ్సైట్లో.. నీటిలోనూ, వెలుపల మనుషుల పనితీరును మెరుగుపరచడానికి తాము ఈ ప్రోగ్రామ్ ను తీసుకుని వచ్చినట్లు తెలిపారు. శ్వాసపైన దృష్టి పెట్టడమే కాకుండా.. మనస్సులను కూడా బలోపేతం చేయవచ్చు. ఈ ప్రోగ్రామ్ లో ఎలైట్ హ్యూమన్ పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్, రీసెర్చ్-బ్యాక్డ్ సైన్స్‌లో డెవలప్ చేసిన టెక్నిక్‌లు, మెథడాలజీని కలిగి ఉంటాయి. ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో వేలాది మందికి నిజ జీవిత అనుభవ శిక్షణను అందించినట్లు తెలిపారు.
అందుకే, వైరల్ వీడియోలో భారత నావికాదళంలోని సైనికులకు కఠినమైన శిక్షణ ఇవ్వడం లేదు. దీనిని USAలోని డీప్ ఎండ్ ఫిట్నెస్ అనే ఫిట్నెస్ సంస్థ షేర్ చేసింది. ఇది ఇండియన్ నేవీకి సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : Video shows rigorous exercises underwater in the Indian Navy
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story