Mon Dec 23 2024 16:33:54 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవ్వలేడు అంటూ మంత్రి రోజా వ్యాఖ్యలు చేయలేదు
YSRCP ఎమ్మెల్యే రోజా సెల్వమణి తమ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు మార్లు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోవచ్చనే వార్తలు ఇటీవల వినిపించాయి.
Claim :
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోలేరని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా జోస్యం చెబుతున్నట్లు వీడియోలో ఉంది.Fact :
వీడియోను ఎడిట్ చేశారు. ఆమె ప్రసంగం ఎడిట్ చేశారు. అది తప్పుడు ప్రకటన.
YSRCP ఎమ్మెల్యే రోజా సెల్వమణి తమ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు మార్లు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోవచ్చనే వార్తలు ఇటీవల వినిపించాయి.
ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎంపై ఇలా మాట్లాడుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో మరోసారి జగన్ సీఎం కాలేరని జోస్యం చెబుతున్నట్లు 15 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే రోజా ఆంటీ చూస్తూ ఊరుకుంటుందా.. అది అట్టా” అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. “జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు. ఇది నా శాసనం.” అంటూ మరో పోస్టు కూడా వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియోను ఎడిట్ చేశారు.వైరల్ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. సాక్షి టీవీ లైవ్ యూట్యూబ్ ఛానెల్లో “మంత్రి ఆర్కె రోజా పవర్ఫుల్ స్పీచ్"(“Minister RK Roja Powerful Speech | Janasena Pawan Kalyan | Chandrababu @SakshiTVLIVE”) అనే శీర్షికతో ప్రచురించిన అదే ప్రసంగానికి సంబంధించి నిడివి ఎక్కువ ఉన్న వీడియో మాకు కనిపించింది. ఈ వీడియో అక్టోబర్ 16, 2023న అప్లోడ్ చేశారు. ఆంద్రప్రదేశ్‌కు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోవడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారని.. అయితే రాష్ట్ర అసెంబ్లీలోకి పవన్‌ను రానివ్వకుండా చేస్తామని ప్రజలు హామీ ఇచ్చారని ఆమె చెప్పడం ఈ వీడియోలో మనం వినవచ్చు. వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించి ఒరిజినల్ వెర్షన్ ను 1.25 నిమిషాల వద్ద చూడొచ్చు.
ఆమె ప్రసంగం గురించి మరింత శోధించినప్పుడు, మాకు సాక్షి, కృష్ణా జిల్లా ఎడిషన్ ఈ-పేపర్ లో “వైస్సార్ సీపిని ఇంటీకి అన్న బాబు జైలుకు..” అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించడం మేము చూశాం. అందులో ఉన్న ఫోటోలో వైరల్ వీడియోలోని బ్యాగ్రౌండ్ ఒకటేలాగా ఉండడం కూడా మనం గమనించవచ్చు. ఈ కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా బంటుమిల్లిలో ఎమ్మెల్యే రోజా ప్రసంగించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె విమర్శలు గుప్పించారు.
ఎమ్మెల్యే ఆర్కే రోజా నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండి ఉంటే.. తప్పకుండా పలు మీడియా సంస్థలు ఆ వీడియోను ప్రచారం చేసి ఉండేవి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నగరి ఎమ్మెల్యే రోజా ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేయలేదు. ఈ వీడియోను ఎడిట్ చేశారు. వైరల్ వీడియోలో ఎలాంటి నిజం లేదు.
Claim : The video shows YSRCP MLA Roja prognosticating that AP CM Jaganmohan Reddy will not be able to retain power for the second term
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story