ఫ్యాక్ట్ చెక్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పెద్దపులి కనపడలేదు
భారతదేశంలో పులుల సంఖ్య గత కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే 2023 సంవత్సరంలో రికార్డు స్థాయిలో
Claim :
తెలంగాణలోని నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందిFact :
ఈ వీడియో తెలంగాణకు చెందినది కాదని అటవీ అధికారులు నిర్ధారించారు
భారతదేశంలో పులుల సంఖ్య గత కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. 19 వ శతాబ్దం లో భారత దేశం లో సుమారు 40 నుంచి 50 వేల పులులు ఉండేవి, కానీ ఎన్నో కారణాల వల్ల వాటి సంఖ్య క్రమేణా తగ్గిపోయింది. అయితే, 1973 సంవత్సరం లో భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ కి నాంది పలికింది. టైగర్ రిజర్వ్‌లు 1973లో ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్‌లో భాగంగా ఏర్పాటు చేసారు, వీటిని భారత ప్రభుత్వ జాతీయ పులుల సంరక్షణ అథారిటీ నిర్వహిస్తుంది. టైగర్ రిజర్వ్‌లు జాతీయ ఉద్యానవనం లేదా వన్యప్రాణుల అభయారణ్యం వంటి రక్షిత ప్రాంతాలు, అలాగే బఫర్ ప్రాంతాలూ ఉంటాయి. ప్రాజెక్ట్ టైగర్ కోర్ ఏరియాలో పులుల సంఖ్య పెరగడానికీ, బఫర్ జోన్లలో ప్రజలు, జంతువుల మధ్య సమతుల్యతను ప్రోత్సహించడానికి అవసరమైన కార్యాలు ప్రాజెక్ట్ టైగెర్ నిర్వహిస్తుంది. అప్పటినుంచీ టైగర్ రిసర్వ్ లను పెంచుకుంటూ పులుల ను సమ్రక్షించుకుంటూ వస్తున్నాం.
అయినా, సాధారణ ప్రజలకు పులులు కనిపించడం అరుదే. కానీ, పులులు కొన్ని ఊర్లలోకి వచ్చి అక్కడ పరజలకు హాని కలిగించిన సంఘటనలు కూడా ఈ మధ్యకాలం లో కనిపించాయి. అయితే 2023 సంవత్సరంలో రికార్డు స్థాయిలో పులులు చనిపోవడం అధికారులను ఆందోళనకు గురి చేసింది.
చిరుతపులులు, పులులు దేశంలోని వివిధ ప్రదేశాలలో కనిపించాయని తప్పుదారి పట్టించే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ ప్రాంతంలో పులి కనిపించిందంటూ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ఇది స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. వాట్సాప్‌తో సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.
ఈ క్లెయిం స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్: