Fri Nov 22 2024 20:50:42 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: గాజా ప్రజలకు కావాల్సిన సహాయాన్ని తీసుకెళ్తున్న ట్రక్కులను అడ్డుకున్నట్లు వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు.. తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు
డజన్ల కొద్దీ ట్రక్కులు, గాజా ప్రజలకు సహాయం చేయడానికి వెళుతూ ఉండగా.. ఈజిప్ట్-గాజా సరిహద్దులో ఆపేశారంటూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
Claim :
ఈజిప్ట్-గాజా సరిహద్దు వద్ద డజన్ల కొద్దీ ట్రక్కులను గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం వీడియోలో ఉంది.Fact :
ఈ వీడియో 2021 సంవత్సరానికి సంబంధించినది. 2021లో గాజాలోకి ఈజిప్టు పంపించిన ట్రక్కులకు సంబంధించినది. వీడియో ఇటీవలిది కాదు.
డజన్ల కొద్దీ ట్రక్కులు, గాజా ప్రజలకు సహాయం చేయడానికి వెళుతూ ఉండగా.. ఈజిప్ట్-గాజా సరిహద్దులో ఆపేశారంటూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం సహాయక సామాగ్రిని గాజాలోకి ప్రవేశించకుండా ఆపివేసిందంటూ పేర్కొన్నారు.
"బ్రేకింగ్: రఫా వద్ద ఈజిప్ట్ బోర్డర్ నుండి సహాయ సామాగ్రి గాజాలోకి ప్రవేశించడానికి ఇజ్రాయెల్ నిరాకరించింది" అనే వాదనతో అనేక అకౌంట్లలో ఈ వీడియోను షేర్ చేశారు. “BREAKING: AID VEHICLES AT RAFAH, EGYPT BORDER REFUSED ENTRY INTO GAZA BY ISRAEL.” అంటూ పోస్టులు పెట్టారు.
కొంతమంది ఫేస్బుక్ వినియోగదారులు ఈ వీడియోను పోస్టు చేసి "ఇజ్రాయెల్ అంబులెన్స్‌లతో సహా గాజా స్ట్రిప్ కోసం భారీ మానవతా సహాయ కాన్వాయ్‌ను అడ్డుకుంది. UN, ఇతర పాశ్చాత్య స్వచ్ఛంద సంస్థలు, టర్కీ, ముస్లింలు పెద్ద ఎత్తున సహాయాన్ని పంపగా అడ్డుకున్నారు" అనే వాదనతో పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. ఈ వీడియో 2021 సంవత్సరంలోనిది.. ఈ మధ్య చోటు చేసుకున్నది కాదు. వైరల్ వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్‌లను మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వెతకగా.. ఈ వైరల్ వీడియోలు 2021 నుండి ఆన్లైన్లో ఉన్నాయని కనుగొన్నాము.ఈజిప్టు న్యూస్ ఛానెల్ అల్ నహర్ మొదటిసారిగా మే 31, 2021న తమ ఫేస్బుక్ పేజీలో వీడియోను షేర్ చేసింది. مصر ترسل أضخم قوافل الدعم والمساعدات إلى الفلسطينيين అంటూ అరబిక్ లో వీడియోను పోస్టు చేశారు. ఈజిప్ట్ సహాయాన్ని పంపగా.. మూడోసారి పాలస్తీనా సైన్యం అడ్డుకుందంటూ అందులో తెలిపారు.
మే 24, 2021న ప్రచురించిన ఒక వార్తా కథనంలో వైరల్ వీడియోలో ఉన్న చిత్రాలను షేర్ చేశారు. ఈజిప్ట్ గాజాకు సహాయం పంపుతుంది అనే శీర్షికను కూడా ఉపయోగించారు.
మే 24, 2021న arabnews.comలో ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్-సిసి గాజాకు భారీగా సహాయాన్ని పంపడానికి ప్రతిపాదించారు. లాంగ్ లైవ్ ఈజిప్ట్ (తహ్యా మస్ర్) ఫండ్ ద్వారా 2,500 టన్నుల ఆహారం, మందులు, పాలు, బట్టలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇతర వస్తువులతో 130 ట్రక్కుల భారీ కాన్వాయ్ ను పంపినట్లు ప్రతినిధి బస్సామ్ రాడి తెలిపారు.
ఇటీవల గాజాకు ఈజిప్ట్ పంపిన మానవతా సహాయానికి సంబంధించిన కాన్వాయ్‌ను ఇజ్రాయిలీలు అడ్డుకోలేదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిలా ఉంది. 2021లో గాజాకు ఈజిప్ట్ పంపిన కాన్వాయ్ కు సంబంధించిన వీడియో ఇది. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Video shows dozens of aid trucks at the Egypt-Gaza border, being obstructed from entering into the Gaza strip.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : Misleading
Next Story