Mon Dec 23 2024 07:23:31 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మహిళను కాల్చి చంపిన వీడియో మయన్మార్ లో చోటు చేసుకుంది కాదు
భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మెయిటీ, కుకీ గిరిజన సమాజాల మధ్య హింస చెలరేగింది. ఈ హింసాకాండలో పలువురు మరణించగా, వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా కొందరు పురుషుల బృందం ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Claim :
మణిపూర్ హింసాకాండ సమయంలో మరో మహిళను దారుణంగా కాల్చిచంపారుFact :
మయన్మార్ కు చెందిన పాత వీడియో'
భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మెయిటీ, కుకీ గిరిజన సమాజాల మధ్య హింస చెలరేగింది. ఈ హింసాకాండలో పలువురు మరణించగా, వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా కొందరు పురుషుల బృందం ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మణిపూర్‌లో జరిగిన మరో సంఘటన అంటూ ఓ మహిళను నడిరోడ్డుపై కొట్టి.. కాల్చి చంపిన వీడియో వైరల్ అవుతూ ఉంది.
మణిపూర్‌లో కుక్కి క్రిస్టియన్ యువతిపై క్రూరమైన దాడి.. హత్యకు సంబంధించిన షాకింగ్ వీడియో.. మణిపూర్ కోసం ప్రార్థించండి, భారతదేశం కోసం ప్రార్థించండి.. అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఈ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు. “Shocking Video of Brutal Attack and Killing of Kukki Christian Girl in Manipur. This is too gruesome; the sad reality of what Manipur and India are becoming under a regime of hate. Pray for Manipur, Pray for India.” అంటూ వీడియోను పోస్టు చేశారు.

“మణిపూర్‌లో మరో దారుణం. మహిళ హత్య” అంటూ కూడా వీడియోను కొందరు వైరల్ చేస్తున్నారు.
మేము Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, డిసెంబర్ 2, 2022న బర్మీస్ భాషలో క్యాప్షన్‌తో అదే వైరల్ వీడియోని షేర్ చేస్తున్న ట్విట్టర్ ఖాతాని మేము కనుగొన్నాము. అందులో “Pdfတွေ တော်တော်ရက်စက်တာပဲ မိန်းကလေးငယ်တစ်ယောက်ကို လက်ထိပ်ခတ်ပြီး ရက်ရက်စက်စက် ပစ်သတ်သွား” అని ఉంది.
పీడీఎఫ్ బృందం ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తోంది. మహిళ చేతులకు బేడీలు వేసి.. నడిరోడ్డుపై కాల్చి చంపారు.. అనే అర్థం వస్తుంది.
నిజ నిర్ధారణ
మణిపూర్‌లో జరిగిన ఘటన అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. డిసెంబర్ 2022లో మయన్మార్‌లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో ఇది.మేము Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, డిసెంబర్ 2, 2022న బర్మీస్ భాషలో క్యాప్షన్‌తో అదే వైరల్ వీడియోని షేర్ చేస్తున్న ట్విట్టర్ ఖాతాని మేము కనుగొన్నాము. అందులో “Pdfတွေ တော်တော်ရက်စက်တာပဲ မိန်းကလေးငယ်တစ်ယောက်ကို လက်ထိပ်ခတ်ပြီး ရက်ရက်စက်စက် ပစ်သတ်သွား” అని ఉంది.
పీడీఎఫ్ బృందం ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తోంది. మహిళ చేతులకు బేడీలు వేసి.. నడిరోడ్డుపై కాల్చి చంపారు.. అనే అర్థం వస్తుంది.
దీన్ని మేము క్యూ గా తీసుకొని, మరింత శోధించాం, డిసెంబర్ 2022లో ప్రచురించిన అనేక వార్తా నివేదికలను మేము కనుగొన్నాము.
elevenmyanmar.com ప్రకారం, 3 నిమిషాల నిడివిగల వీడియో మయన్మార్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు యువతిని కొట్టడం, తన్నడం వంటివి రికార్డు అయ్యాయి. ఆ తర్వాత ఆమెపై నాలుగు సార్లు కాల్పులు జరిపారు. మృతదేహాన్ని పేవ్‌మెంట్‌పై వదిలేశారు.
నివేదిక ప్రకారం, వీడియోలో సంఘటన యొక్క ప్రదేశం స్పష్టంగా లేదు, కానీ దానిని పంచుకునే వ్యక్తులు మయన్మార్‌లోని 'టము' ప్రాంతం అని పేర్కొన్నారు. ఈ భయంకరమైన దాడి వెనుక PDF (పీపుల్ డిఫెన్స్ ఫోర్సెస్) No-4 బెటాలియన్ ఉంది.
ఈ సంఘటనను అనేక ఇతర బర్మీస్ మీడియా సంస్థలు కూడా నివేదించాయి.
https://www.rfa.org/burmese/
http://www.daweiwatch.com/
ఒక యువతిని నడి వీధిలో దారుణంగా కాల్చి చంపిన వైరల్ వీడియో మయన్మార్‌కి చెందినది స్పష్టంగా తెలుస్తోంది. భారతదేశంలోని మణిపూర్‌కు చెందినది కాదని స్పష్టమవుతోంది. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Viral video shows another woman being brutally shot in Manipur violence
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Twitter
Fact Check : False
Next Story