Mon Dec 23 2024 01:45:26 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మహిళలు మద్యం సేవిస్తున్నట్లు చూపుతున్న వీడియో తెలంగాణలో చోటు చేసుకున్నది.. తమిళనాడుకు చెందినది కాదు
తమిళనాడుకు చెందిన మహిళలు కలిసి మద్యం సేవిస్తున్నట్లు చూపుతున్నట్లు ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది
Claim :
వైరల్ వీడియోలో మద్యం సేవిస్తున్న మహిళలు తమిళనాడుకు చెందినవారుFact :
ఈ వీడియో తెలంగాణకు చెందినది.. దసరా సందర్భంగా చిత్రీకరించారు
తమిళనాడుకు చెందిన మహిళలు కలిసి మద్యం సేవిస్తున్నట్లు చూపుతున్నట్లు ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. పిల్లలను పెంచాల్సిన మహిళలు ఇలాంటి సంస్కృతిలో భాగమయ్యారని వైరల్ పోస్ట్ చెబుతోంది. మహిళలు విందులో పాల్గొనడం.. ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవడం.. కూల్ డ్రింక్స్తో కలిసి మద్యం సేవించడం వంటివి వీడియోలో చూపించారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన తప్పుదోవ పట్టిస్తూ ఉంది. వైరల్ వీడియో తెలంగాణకు సంబంధించినది.. తమిళనాడుకు చెందినది కాదు.మేము వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్లను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా 'బంజారా అశ్విత' అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోను కనుగొన్నాము.
రీల్స్ రూపంలో ఈ వీడియోను పోస్టు చేశారు. అక్టోబర్ 25, 2023న వీడియోను పోస్టు చేశారు. 'దసరా దావత్' అనే క్యాప్షన్ ఉంచారు. నిడివి ఎక్కువ ఉన్న వీడియోను నవంబర్ 4, 2023న అప్లోడ్ చేశారు.
ఈ వీడియోలతో పాటు, మేము ఛానెల్లో ఇతర వీడియోలను కూడా పరిశీలించాము. ఈ మహిళలు స్థానిక గీతాలకు నృత్యం చేస్తున్నట్లు చూపించే మరొక వీడియో మాకు కనిపించింది.
ఈ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలోని నాగర్కర్నూల్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన బంజారా అశ్విత అనే మహిళకు చెందినది. ఆమె బంజారా అనే తెగకు చెందినవారు. స్థానిక సంప్రదాయాలు, సంస్కృతిని చూపిస్తూ ఈ ఛానెల్లో అనేక వీడియోలను అప్లోడ్ చేశారు.
మద్యం సేవిస్తూ విందులో పాల్గొన్న మహిళల గుంపుకు సంబంధించిన వీడియో తెలంగాణ రాష్ట్రానికి చెందినది. తమిళనాడుకు సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
Claim : Women seen drinking alcohol in the viral video are from Tamil Nadu
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : Misleading
Next Story