నిజ నిర్ధారణ: చైనాలో సైనిక తిరుగుబాటు కారణంగా పేలుళ్లు సంభవించాయని పేర్కొంటున్న వీడియోలు అవాస్తవం
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. సైనిక తిరుగుబాటుతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చీఫ్‌గా జిన్‌పింగ్‌ను తొలగించారని నెటిజన్లు పేర్కొంటున్నారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. సైనిక తిరుగుబాటుతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చీఫ్‌గా జిన్‌పింగ్‌ను తొలగించారని నెటిజన్లు పేర్కొంటున్నారు. బీజింగ్ నుండి పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయని కూడా ఊహాగానాలు వినపడుతున్నాయి.
అదే సమయంలో, సైనిక తిరుగుబాటుకు సంబంధించి బీజింగ్ లో భారీ పేలుడు జరిగిందంటూ ఒక వీడియో ప్రచారంలో ఉంది. "జిన్‌పింగ్‌పై చైనా తిరుగుబాటు సమయంలో #బీజింగ్ నుండి వస్తున్న పెద్ద పేలుళ్ల ఫుటేజీ. చైనా అల్లకల్లోలం! జింపింగ్ కనపడుట లేదు! ఇదేనా తిరుగుబాటు? అతను హత్యకు గురయ్యాడా మరియు ఎవరూ మాట్లాడని సైనిక రహస్యాన్ని నేను వెలికితీస్తాను. #chinacoup #chinesecoup #china #xijingping" " అనే శీర్షికతో వీడియో వైరల్‌గా షేర్ అవుతోంది
ఆర్కైవ్ లింకు: https://web.archive.org/web/
నిజ నిర్ధారణ:
సైనిక తిరుగుబాటు కారణంగా బీజింగ్‌లో పేలుళ్లు జరిగినట్లు వైరల్ వీడియో చూపుతోందన్న వాదన అవాస్తవం. నిజానికి 2015లో టియాంజిన్‌లోని ఓ గిడ్డంగిలో పేలుడు సంభవించినప్పుడు తీసిన వీడియో ఇది.
వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, వైరల్ విజువల్స్‌ను 2015 లో షేర్ చేసిన అనేక కథనాలు లభించాయి.
ఇదే వీడియో డైలీమోషన్లో 2015లో 'టియాంజిన్ చైనాలో 200 టన్నుల టి ఎన్ టి భారీ పేలుడు' శీర్షికతో ప్రచురితమయ్యింది.
'చైనా వేర్‌హౌస్ పేలుడు: కొత్త పేలుళ్లు, విషపూరిత గాలులు, పెరుగుతున్న మరణాల సంఖ్య' అనే శీర్షికతో ఈ వీడియోను సిబిఎస్ మార్నింగ్స్ యూట్యూబ్ ఛానెల్ ఆగస్టు 15, 2015న షేర్ చేసింది. వీడియో వివరణలో "చైనాలో గిడ్డంగి విపత్తు జరిగిన ప్రదేశంలో కొత్త పేలుళ్లు, కొత్త ఆందోళనలు. ఈశాన్య ఓడరేవు నగరం టియాంజిన్‌లోని గిడ్డంగి విషపూరిత రసాయనాలను నిల్వ చేయడానికి ఉపయోగించబడింది. ఈదురు గాలుల వల్ల నివాస ప్రాంతాల్లోకి పొగలు వస్తున్నాయని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 85కి చేరుకోగా ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. జోనాథన్ విగ్లియోట్టి నివేదించారు.
సీబిఎస్ న్యూస్.కాం లోని వార్తా కథనాల ప్రకారం, ఈశాన్య చైనా ఓడరేవు టియాంజిన్‌లో ప్రమాదకరమైన పదార్థాల కారణంగా ఒక గిడ్డంగిలో జరిగిన భారీ పేలుళ్లలో కనీసం 17 మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు.
చైనా స్టేట్ బ్రాడ్‌కాస్టర్, సిసిటివి లో, కనీసం 17 మంది మరణించారని మరియు 32 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రిలో తెలిపారు. వందలాది మందిని ఆసుపత్రికి తరలించారు. పేలుళ్ల కారణంగా ఆ ప్రాంతంలో అనేక మైళ్ల దూరం వరకు భవనాల తలుపులు,కిటికీలు పగిలిపోయాయి.
అదే సమయంలో, హిందూ బిజినెస్ న్యూస్ ప్రకారం: గిడ్డంగిలో కంటైనర్లలో నిల్వ చేయబడిన పేలుడు పదార్ధాల కారణంగా భారీ పేలుళ్లు సంభవించాయని అధికారిక పీపుల్స్ డైలీ ఆన్లైన్ నివేదించింది.
టియాంజిన్‌లోని బిన్హై న్యూ ఏరియాలో కంటైనర్ టెర్మినల్‌లోని రసాయనాలు పేలాయి. దాదాపు 10,000 మందిని సమీప ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. గాయపడిన 66 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీడియోలో, భారీ పుట్టగొడుగులలాగా ఏర్పడిన పేలుడు, అగ్ని చాలా దూరం నుంచి కూడా చూడవచ్చు. పేలుడు జరిగిన ప్రదేశంలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో మంటలు చెలరేగుతున్నాయి.
కనుక, 2015లో టియాంజిన్‌లో జరిగిన వేర్‌హౌస్ పేలుళ్లను చైనాలో సైనిక తిరుగుబాటు కారణంగా బీజింగ్‌లో ఇటీవల జరిగిన పేలుళ్ల వీడీయోగా షేర్ చేస్తున్నారు, ఇది అబద్దం.