నిజ నిర్ధారణ: సోడా శిశువులకు మంచిది అనే పాత ప్రకటన నిజమైనది కాదు
ఒక తల్లీ పాప ఒకరినొకరు చూసుకుని నవ్వుతున్నట్లు ఉన్న పాత ప్రకటన ఒకటి ఫ్లికర్ మొదలైన సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారంలో ఉంది. చిత్రంపై "జీవితంలో మెరుగైన ప్రారంభం కోసం, కోలా ని ముందుగానే ప్రారంభించండి" అని ఉంది.
ఒక తల్లీ పాప ఒకరినొకరు చూసుకుని నవ్వుతున్నట్లు ఉన్న పాత ప్రకటన ఒకటి ఫ్లికర్ మొదలైన సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారంలో ఉంది. చిత్రంపై "జీవితంలో మెరుగైన ప్రారంభం కోసం, కోలా ని ముందుగానే ప్రారంభించండి" అని ఉంది.
ఇది కూడా ఉంది: ఎంత త్వరగా చాలా త్వరగా అవుతుంది? త్వరలో సరిపోదు. నిర్మాణ దశలో సోడా తాగడం ప్రారంభించిన శిశువులు యుక్తవయస్సులో 'అనుకూలతనూ పొందే అవకాశం చాలా ఎక్కువ అని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయోగశాల పరీక్షలు నిరూపించాయి. కాబట్టి, మీకు మీరే సహాయం చేసుకోండి. జీవితకాలం గ్యారెంటీ సంతోషం కోసం, ఇప్పుడే సోడాలు, కార్బోనేటేడ్ పానీయాలను ప్రారంభించడం ద్వారా మీ పిల్లలకు సహాయం చేయండి.
ప్రకటనలో చికాగో, ఇల్లినాయిస్లో ఉన్న సోడా పాప్ బోర్డ్ ఆఫ్ అమెరికా అని ఉంది.
నిజ నిర్ధారణ:
చికాగోలోని "ది సోడా పాప్ బోర్డ్ ఆఫ్ అమెరికా" ఈ ప్రకటన విడుదల చేసిందనే వాదన అవాస్తవం. ఈ ప్రకటన ఒక డిజిటల్ సృష్టి.
గూగుల్ లో కీవర్డ్ శోధనలను నిర్వహించగా "ది సోడా పాప్ బోర్డ్ ఆఫ్ అమెరికా" గురించి అధికారిక నివేదికలు ఏవీ లభించలేదు.
ఫూడ్ పాలిటిక్స్.కాం ప్రకారం, ప్రొ.మారియాన్ నెస్లే, తన పుస్తకం 'టేకింగ్ ఆన్ బిగ్ సోడా'లో చికాగోలో అలాంటి సంస్థ లేదని, ఈ ప్రకటన బూటకమని వివరించాడు.
చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 'ది సిటీ డెస్క్' అనే బ్లాగ్ లభించింది, అందులో బ్లాగర్ "తల్లిదండ్రులు తమ పిల్లలకు సోడా ఇవ్వమని ప్రోత్సహించే నకిలీ ప్రకటనను తయారు చేసాడు" అని వివరించాడు. అమెరికాలో సోడా పాప్ బోర్డ్ ఎప్పుడూ లేదని బ్లాగర్ చివరలో జోడిస్తుంది. శిశువుల కోసం సోడాను సమర్థించే సంస్థ ఎప్పుడూ లేదు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, సోడాలో చాలా చక్కెర కెఫిన్ ఉంటాయి, ఇవి శిశువులకు హానికరం. సోడా చాలా కేలరీలను కలిగి ఉంటుంది, ఇది పిల్లలు క్రమం తప్పకుండా తీసుకుంటే ఊబకాయం ముప్పును పెంచుతుంది. సోడా పిల్లలలో దంత సమస్యలను కూడా కలిగిస్తుంది.
కాబట్టి, సోడా ఇవ్వడం పిల్లలకు మంచిది కాదు.
https://www.parenting.com/
https://www.webmd.com/
అందువల్ల, ది సోడా పాప్ బోర్డ్ ఆఫ్ అమెరికా ద్వారా విడుదల అయ్యిన ప్రకటన నిజమినది కాదు. ఇది ఒక డిజిటల్ సృష్టి, వ్యంగ్యం కోసం చేసినది.