నిజ నిర్ధారణ: హిందూ పారిశుధ్య కార్మికుడిపై దుండగుల దాడి జరిగింది పాకిస్థాన్‌లో, తెలంగాణాలో కాదు
మూసి ఉన్న ఒక బిల్డింగ్‌పైకి కొంత మంది దుండగులు ఎక్కుతూ, తలుపులు తడుతూ కనపడుతున్న వీడియోను సోషల్ మీడియాలో తెలంగాణలో జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు.
మూసి ఉన్న ఒక బిల్డింగ్‌పైకి కొంత మంది దుండగులు ఎక్కుతూ, తలుపులు తడుతూ కనపడుతున్న వీడియోను సోషల్ మీడియాలో తెలంగాణలో జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు.
వీడియోలో 'సర్ తన్ సే జుడా' అని వారు అరవడం వినబడుతుంది, అంటే 'తల శరీరం నుండి వేరు చేస్తాం' అని అర్ధం. వీడియో తో పాటు పంచుకున్న కధనం లో ఈ దృశ్యం తెలంగాణలోనిది అని, శరీరాలనుంచి తలలను వేరు చేస్తాం అనే నినాదాలతో దుండగులు బలవంతంగా హిందూ ఇళ్లలోకి ప్రవేశిస్తున్నారనీ పేర్కొన్నారు.
ఈ వీడియో తో ఉన్న క్యాప్షన్: "ये दृश्य पाकिस्तान की नही है तेलंगाना की है. *हिंदूओ के घरो मे जबरन घुस रहे सिर तन से जुदा के नारे लगा रहे है. देखो ये सब और नींद से जागो आपका साथ देने कोई नही आयेगा न नेता न पुलिस न कोई संगठन. मीडिया को हैदराबाद में घुसने नहीं दिया जा रहा है. अपनी सुरक्षा के इंतजाम करो,, वरना फिर वही दृश्य देखोगे जो कश्मीर मे देखा था"
అనువదించగా, "ఈ దృశ్యం పాకిస్తాన్‌ది కాదు, తెలంగాణది. హిందువుల ఇళ్లలోకి బలవంతంగా ప్రవేశిస్తున్న జనం శరీరం నుంచి తలను వేరు చేస్తామంటూ నినాదాలు చేస్తున్నారు. ఇదంతా చూడండి, చూసి మేల్కోండి, మీకు మద్దతు ఇవ్వడానికి ఎవరూ రారు, నాయకుడు లేదా పోలీసులు లేదా ఏ సంస్థ కూడా రాదు. మీడియాను హైదరాబాద్‌లోకి రానివ్వడం లేదు. మీ భద్రత కోసం ఏర్పాట్లు చేసుకోండి, లేకపోతే కాశ్మీర్లో కనిపించిన దృశ్యాలే మీ దగ్గరా కనిపిస్తాయి."
నిజ నిర్ధారణ:
ఈ ఘటన తెలంగాణలో జరిగిందన్న వాదన తప్పుదారి పట్టిస్తోంది.
ఈ సంఘటన ఇటీవల జరిగినప్పటికీ, ఇది పాకిస్తాన్ లోని హైదరాబాద్ లో జరిగింది, తెలంగాణలో కాదు. వీడియోలోని కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, ఆగ్రహించిన జనం ఒక హిందూ వ్యక్తి నివాసాన్ని చుట్టుముట్టి అతనిపై దాడికి ప్రయత్నించిన సంఘటన పాకిస్తాన్‌లోని హైదరాబాద్ నగరంలో జరిగిందని ధృవీకరించే కొన్ని ట్వీట్లు లభించాయి.
ఆగస్టు 22, 2022న ప్రచురించబడిన ఇండియా నేరేటివ్ చేసిన ట్వీట్ ప్రకారం, పాక్‌లోని హైదరాబాద్‌లోని నివాసితో వ్యక్తిగత ఘర్షణ కారణంగా, మైనారిటీ హిందూ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి, దైవదూషణ చేసాడంటూ ఒక నకిలీ కేసులో బుక్ చేసినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో రబియా సెంటర్లో నివాసం ఉంటున్న అశోక్ కుమార్ స్వీపర్‌గా పని చేస్తున్నాడు, అతనిపై ఆగ్రహించిన జనం దాడి చేసారు. దక్షిణాసియా మీడియా ప్రతినిధి ్ఐలైనయత్, ట్వీట్ చేస్తూ, "ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలతో హిందూ శానిటరీ వర్కర్ అశోక్ కుమార్ పై దైవదూషణ కింద 295బి కేసు నమోదు చేశారు. బిలాల్ అబ్బాసీ అనే దుకాణదారుడు తో గొడవ జరిగిన తరువాత, అతను కుమార్‌పై ఫిర్యాదు చేశాడు."
దీన్ని క్యూగా తీసుకుని, వైరల్ వీడియోను షేర్ చేసిన నైలా ఇనాయత్ ట్వీట్ కోసం శోధించాము.
మరో పాకిస్థానీ జర్నలిస్ట్ ముబాషిర్ జైదీ చేసిన ట్వీట్‌ను కూడా పరిశీలించగా, పాకిస్తాన్ లోని హైదరాబాద్ పోలీసులు హిందూ పారిశుధ్య కార్మికుడిని అప్పగించాలని డిమాండ్ చేస్తున్న దుండగులను చెదరగొట్టారు
ఈ వాదనను తెలంగాణ టుడే కూడా తప్పుదారి పట్టించేదిగా తోసిపుచ్చింది.
అందుకే, వీడియోలో కనిపిస్తున్న ఘటన తెలంగాణలోనే జరిగిందని, పాకిస్థాన్‌లో కాదు, తప్పుదారి పట్టించేలా ఉంది. నిజానికి ఈ ఘటన పాకిస్థాన్‌లో ఆగస్టు 2022 లో జరిగింది.