Mon Dec 23 2024 02:08:04 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: గర్భంతో ఉన్న సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే.. పిల్లలు తీవ్రమైన హృదయ సంబంధిత రోగాలతో పుడుతున్నారని WHO అంగీకరించలేదు
గర్భంతో ఉన్న సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే.. పిల్లలు తీవ్రమైన హృదయ సంబంధిత రోగాలతో పుడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒప్పుకుందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది నిజంగా పెద్ద సమస్య అని.. కొన్ని వేల మంది ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారని అందులో చెప్పుకొచ్చారు.

జూలై 4, 2023న thepeoplesvoice.tv వెబ్సైట్లో అందుకు సంబంధించి ఓ కథనం ప్రచురించారు. గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్లో మయోకార్డిటిస్ (తీవ్రమైన ఇన్ఫెక్షన్) వ్యాప్తిపై కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా WHO కూడా ఇది ధృవీకరించిందంటూ తెలిపింది. ఇందులో ఎపోచ్ టైమ్స్ కథనాన్ని కూడా ఉటంకించారు. UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) ప్రతినిధి.. వేల్స్లో 10 మంది శిశువులకు, ఇంగ్లండ్ లో ఐదుగురికి ఇలా జరిగిందంటూ చెప్పుకొచ్చారు.
వైరల్ కథనంలో, WHO నివేదికలో జూన్ 2022- మార్చి 2023 మధ్య ఎంట్రోవైరల్ మయోకార్డిటీస్ అనే వ్యాధి ఎంట్రోవైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా సంభవిస్తుందని పేర్కొన్నారు.
మయోకార్డిటిస్ అనేది గుండె కండరాల (మయోకార్డియం) వాపు కారణంగా వస్తుందని WHO నివేదిక పేర్కొంది. మయోకార్డిటిస్కు అత్యంత సాధారణ కారణం వైరల్ ఇన్ఫెక్షన్ (ఉదా., ఎంట్రోవైరస్), అయితే ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, డ్రగ్కి ప్రతిచర్య లేదా ఆటో ఇమ్యూన్ వల్ల కూడా సంభవించవచ్చు.
గర్భిణీ స్త్రీలపై కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావం చూపిస్తుందని ఏదైనా నివేదికల కోసం WHO వెబ్సైట్ లో వెతికాం. Question-and-Answer పేజీలో COVID-19 వ్యాక్సిన్ కు సంబంధించి గర్భం, ప్రసవం, ప్రసవానంతర కాలానికి సంబంధించిన ప్రశ్నలను కనుగొన్నాము. ప్రపంచంలోని అనేక దేశాల్లోని గర్భిణీ స్త్రీలు COVID-19 వ్యాక్సిన్లను తీసుకున్నారు. వారికి, వారి శిశువుల ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సమస్యలు గుర్తించబడలేదని నివేదిక తెలిపింది. ఇప్పటి వరకూ COVID-19 వ్యాక్సిన్ల కారణంగా గర్భధారణ సమయంలో ఎటువంటి ప్రమాదం జరగలేదు.
నియోనాటల్ ఎంట్రోవైరల్ మయోకార్డిటిస్ గురించి UK ప్రభుత్వ వెబ్సైట్ www.gov.uk ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. ఎంట్రోవైరస్ ఇన్ఫెక్షన్ వల్ల నియోనాటల్ మయోకార్డిటిస్ వస్తుందని పేర్కొంది. సీజనల్ చైల్డ్ ఇన్ఫెక్షన్లకు ఎంట్రోవైరస్లు ఒక సాధారణ కారణం, ఇదొక రెస్పారేటరీ డిసీజ్, hand-foot-and-mouth ద్వారా వస్తుంది. వైరల్ మెనింజైటిస్కు కారణమవుతాయి. అంటువ్యాధులు చాలా వరకూ తేలికపాటి ప్రభావం చూపుతాయి. నవజాత శిశువులలో చాలా అరుదుగా తీవ్రమైన ఎంట్రోవైరస్ సంక్రమణ అభివృద్ధి జరుగుతుంది. ఇది సెప్సిస్ లాంటి సిండ్రోమ్ లేదా వైరల్ మెనింజైటిస్గా ఉండవచ్చు. మయోకార్డిటిస్ (గుండె కండరాల వాపు) అనేది ఎంట్రోవైరస్ సంక్రమణ ద్వారా వచ్చే చాలా అరుదైన సమస్య, ఇది సాధారణంగా కాక్స్సాకీ B వైరస్లతో సంబంధం కలిగి ఉంటుంది.
అందువల్ల, COVID-19-వ్యాక్సినేషన్ చేయించుకున్న మహిళలు తీవ్రమైన గుండె సంబంధిత లోపాలతో శిశువులకు జన్మనిచ్చారని WHO ఎక్కడా చెప్పలేదు. షేర్ చేసిన వైరల్ కథనం ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశ్యంతో సృష్టించారు. వైరా అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. కోవిడ్ టీకాలు వేయించుకున్న తల్లులకు పుట్టిన పిల్లల్లో గుండె సంబంధిత లోపాలు ఉన్నాయని చెప్పినా.. కేవలం కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా ఇది సంభవించిందని చెప్పలేదు.వైరల్ కథనంలో, WHO నివేదికలో జూన్ 2022- మార్చి 2023 మధ్య ఎంట్రోవైరల్ మయోకార్డిటీస్ అనే వ్యాధి ఎంట్రోవైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా సంభవిస్తుందని పేర్కొన్నారు.
మయోకార్డిటిస్ అనేది గుండె కండరాల (మయోకార్డియం) వాపు కారణంగా వస్తుందని WHO నివేదిక పేర్కొంది. మయోకార్డిటిస్కు అత్యంత సాధారణ కారణం వైరల్ ఇన్ఫెక్షన్ (ఉదా., ఎంట్రోవైరస్), అయితే ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, డ్రగ్కి ప్రతిచర్య లేదా ఆటో ఇమ్యూన్ వల్ల కూడా సంభవించవచ్చు.
గర్భిణీ స్త్రీలపై కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావం చూపిస్తుందని ఏదైనా నివేదికల కోసం WHO వెబ్సైట్ లో వెతికాం. Question-and-Answer పేజీలో COVID-19 వ్యాక్సిన్ కు సంబంధించి గర్భం, ప్రసవం, ప్రసవానంతర కాలానికి సంబంధించిన ప్రశ్నలను కనుగొన్నాము. ప్రపంచంలోని అనేక దేశాల్లోని గర్భిణీ స్త్రీలు COVID-19 వ్యాక్సిన్లను తీసుకున్నారు. వారికి, వారి శిశువుల ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సమస్యలు గుర్తించబడలేదని నివేదిక తెలిపింది. ఇప్పటి వరకూ COVID-19 వ్యాక్సిన్ల కారణంగా గర్భధారణ సమయంలో ఎటువంటి ప్రమాదం జరగలేదు.
నియోనాటల్ ఎంట్రోవైరల్ మయోకార్డిటిస్ గురించి UK ప్రభుత్వ వెబ్సైట్ www.gov.uk ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. ఎంట్రోవైరస్ ఇన్ఫెక్షన్ వల్ల నియోనాటల్ మయోకార్డిటిస్ వస్తుందని పేర్కొంది. సీజనల్ చైల్డ్ ఇన్ఫెక్షన్లకు ఎంట్రోవైరస్లు ఒక సాధారణ కారణం, ఇదొక రెస్పారేటరీ డిసీజ్, hand-foot-and-mouth ద్వారా వస్తుంది. వైరల్ మెనింజైటిస్కు కారణమవుతాయి. అంటువ్యాధులు చాలా వరకూ తేలికపాటి ప్రభావం చూపుతాయి. నవజాత శిశువులలో చాలా అరుదుగా తీవ్రమైన ఎంట్రోవైరస్ సంక్రమణ అభివృద్ధి జరుగుతుంది. ఇది సెప్సిస్ లాంటి సిండ్రోమ్ లేదా వైరల్ మెనింజైటిస్గా ఉండవచ్చు. మయోకార్డిటిస్ (గుండె కండరాల వాపు) అనేది ఎంట్రోవైరస్ సంక్రమణ ద్వారా వచ్చే చాలా అరుదైన సమస్య, ఇది సాధారణంగా కాక్స్సాకీ B వైరస్లతో సంబంధం కలిగి ఉంటుంది.
అందువల్ల, COVID-19-వ్యాక్సినేషన్ చేయించుకున్న మహిళలు తీవ్రమైన గుండె సంబంధిత లోపాలతో శిశువులకు జన్మనిచ్చారని WHO ఎక్కడా చెప్పలేదు. షేర్ చేసిన వైరల్ కథనం ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశ్యంతో సృష్టించారు. వైరా అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : WHO admitted COVID vaccinated pregnant women are giving birth to babies with heart defects
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Twitter
Fact Check : False
Next Story