ఫ్యాక్ట్ చెక్: యూరోపియన్ పరిశోధన సర్వే భారతదేశాన్ని ఆసియాలో ఉగ్రవాదానికి అతిపెద్ద మూలంగా ప్రకటించలేదు
ఉగ్రవాదం అంటే రాజకీయ లేదా ఇతర లక్ష్యాలను సాధించడానికి అమాయక ప్రజలను భయభ్రాంతులను చేయడం లేదా హింసతో బెదిరించడం. ఉగ్రవాదం

Claim :
యూరోపియన్ పరిశోధన సర్వే భారతదేశాన్ని ఆసియాలో ఉగ్రవాదానికి అతిపెద్ద మూలంగా ప్రకటించిందిFact :
ఈ వాదన అబద్దం. అలాంటి ఏ నివేదికలు ఆన్లైన్ లో అందుబాటులో లేవు
ఉగ్రవాదం అంటే రాజకీయ లేదా ఇతర లక్ష్యాలను సాధించడానికి అమాయక ప్రజలను భయభ్రాంతులను చేయడం లేదా హింసతో బెదిరించడం. ఉగ్రవాదం బాంబు దాడులు, సాయుధ దాడులు, విమానాలను హైజాక్ చేయడం లేదా బందీలను తీసుకోవడం వంటివి చేయడం. మన భారత దేశం పై కొన్ని దేశాలు ఉగ్రవాద దాడులు చేస్తూ వస్తున్నాయి.
కానీ, కొందరు సోషల్ మీడియా వినియోగదారులు యూరోపియన్ రీసెర్చ్ సర్వే ద్వారా భారతదేశాన్ని ఆసియాలో ఉగ్రవాదానికి అతిపెద్ద మూలంగా ప్రకటించారని వాదిస్తూ పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌లు భారత ప్రధాన మంత్రి మోదీ చిత్రాన్ని జొడించి షేర్ అవుతున్నాయి.
ఈ క్లెయిం ఆర్కైవ్ లింకు ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
ఈ వాదన అబద్దం. ఇలాంటి కధనం ఎక్కడ ఇటీవలి కాలం లో ప్రచురించలేదు.
'యూరోపియన్ పరిశోధన అధ్యయనం ద్వారా ఆసియాలో ఉగ్రవాదానికి అతిపెద్ద మూలంగా భారతదేశం ప్రకటించబడింది' అనే కీలక పదాలను ఉపయోగించి మేము శోధించినప్పుడు, ఆన్లైన్లో ప్రచురించబడిన అలాంటి అధ్యయనం ఏదీ మాకు కనిపించలేదు.
మరింత పరిశోధన 2024లో ప్రచురించిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌ను చూపించింది, GTI ని ప్రముఖ అంతర్జాతీయ థింక్ ట్యాంక్ సమూహం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ & పీస్ (IEP) గత పదకొండు సంవత్సరాలుగా వార్షికంగా ప్రచురిస్తోంది. ఇది గ్లోబల్ టెర్రరిజం ట్రెండ్లపై అత్యంత సమగ్రమైన వనరులు, సంఘటనలు, మరణాలు, గాయాలు, బందీల సంఖ్యతో సహా దాని స్కోర్‌ను లెక్కించడానికి బహుళ అంశాలను ఉపయోగిస్తుంది, ఉగ్రవాదం యొక్క సమగ్ర చిత్రాన్ని అందిస్తుంది. 2023లో ఉగ్రవాదం కారణంగా మరణాలు 22% పెరిగి 8,352కి చేరుకున్నాయి అని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది.
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ పదకొండవ ఎడిషన్ ప్రకారం, ఉగ్రవాదం కొన్ని దేశాలకే పరిమితం అయ్యింది, ఉగ్రవాదం కారణంగా మరణాలను నమోదు అయిన దేశాల సంఖ్య 41కి తగ్గింది. బుర్కినా ఫాసో అనే దేశం - ఆఫ్ఘనిస్తాన్ లేదా ఇరాక్ కాకుండా ఒక దేశం గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో అగ్రస్థానంలో నిలవడం ఇదే మొదటిసారి. ఎకనామిక్స్ & పీస్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన GTI ప్రకారం, బుర్కినా ఫాసోలో 258 సంఘటనల నుండి దాదాపు 2,000 మంది ఉగ్రవాద దాడులలో మరణించారు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద మరణాలలో దాదాపు పావు వంతు. 2014 నుండి బుర్కినా ఫాసోలో ఉగ్రవాద ప్రభావం ప్రతి సంవత్సరం పెరుగుతోంది, దాని పొరుగు దేశాలైన మాలి, నైజర్‌లో కూడా ఉగ్రవాదం పెరుగుతోంది. 2023లో బుర్కినా ఫాసోలో ఉగ్రవాదం కారణంగా మరణాలు 68 శాతం పెరిగాయి. మొత్తంమీద 2023లో ఉగ్రవాదం కారణంగా మరణాలు 22 శాతం పెరిగి 8,352కి చేరుకున్నాయి.
స్టాటిస్టా ప్రకారం, 2022లో ఆఫ్ఘనిస్తాన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో అగ్రస్థానంలో ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను ర్యాంక్ చేస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో, ముఖ్యంగా బుర్కినా ఫాసో, సోమాలియా, మాలి వంటి కొన్ని ఆఫ్రికన్ దేశాలలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి.
ఇండియా టీవీ న్యూస్ ప్రకారం, GTI 2024 నివేదికలో భారతదేశం 14వ స్థానంలో ఉంది, గత సంవత్సరం తో పోల్చితే ఒక స్థానం తగ్గింది. ఉగ్రవాదం కారణంగా మరణాలు తగ్గిన మొదటి పది దేశాలలో ఇది ఒకటి. బంగ్లాదేశ్ 32వ స్థానంలో ఉండగా, చైనా ఈ సూచికలో 73వ స్థానంలో ఉంది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదంలో గణనీయమైన మెరుగుదలలు జరిగాయి.
ఈ కధనాలను ధృవీకరించడానికి ఆధారాలు లేవు అంటూ ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ X లో ప్రచురించింది. D-intent Data ప్రకారం ఈ కధనాలు ప్రముఖంగా పాకిస్తాన్ కు సంబంధించిన ఖాతాలలో షేర్ అవుతోందనీ, భారతదేశం ఇటీవల UNSC (ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి) లో పాకిస్తాన్‌ను దుయ్యబడుతూ, 'పాకిస్తాన్ ప్రభుత్వం 20 కంటే ఎక్కువ ఊణ్- జాబితాలో ఉన్న ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తూ ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా నిలిచిందనీ అని ప్రకటించింది.
కనుక, యూరోపియన్ రీసెర్చ్ అధ్యయనం భారతదేశాన్ని ఆసియాలో ఉగ్రవాదానికి అతిపెద్ద మూలంగా ప్రకటించిందనే వాదన అబద్దం.