Sat Nov 23 2024 01:07:57 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: సిల్క్యారా సొరంగం నుండి రక్షించిన కార్మికులను చూపుతున్నట్లు క్లెయిమ్ చేసే వైరల్ చిత్రం ఏఐ ద్వారా రూపొందించారు
ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ ప్రాజెక్ట్‌లో 4.5 కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగం ఒక భాగం. నాలుగు హిందూ పుణ్యక్షేత్రాల మధ్య కనెక్టివిటీని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం
Claim :
వైరల్ చిత్రం ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగం నుండి రక్షించిన కార్మికులకు సంబంధించినదిFact :
ఈ చిత్రం AI ద్వారా రూపొందించారు. రక్షించిన కార్మికుల నిజమైన చిత్రాలు కావు
ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ ప్రాజెక్ట్‌లో 4.5 కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగం ఒక భాగం. నాలుగు హిందూ పుణ్యక్షేత్రాల మధ్య కనెక్టివిటీని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. నవంబర్ 12, 2023న, కొండచరియలు విరిగిపడటం వలన సొరంగం కొంత భాగం కూలిపోయింది. 41 మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు. కొన్ని పైపుల ద్వారా సరఫరా చేసిన ఆహారం, ఆక్సిజన్ సహాయంతో వారు జీవించారు.
17 రోజుల ప్రయత్నాల తర్వాత కార్మికులను బయటకు రప్పించగలిగారు. ఈ వార్తను విని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆనందించారు.
ఈ సొరంగం రెస్క్యూకి సంబంధించి ఒక చిత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. అందులో రక్షించిన కార్మికులు భారత జెండాతో ఉన్నారు. ఈ చిత్రాన్ని అనేక మీడియా సంస్థలు వాడుకున్నాయి.
“Pic of the Day..!!! Uttarakhand tunnel rescue Mission finally successful Om Namah Shivaya “. అంటూ సోషల్ మీడియాలో ఇదే ఫోటోను వైరల్ చేశారు. నిజంగా ఆ సొరంగం దగ్గర తీసిన ఫోటో అంటూ ప్రచారం చేశారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ ఫోటోలో ఉన్నది నిజంగా రక్షించిన వ్యక్తులు కాదు. ఆ ఫోటో ఏఐ ద్వారా రూపొందించారు.
నిశితంగా పరిశీలించగా.. మనం చిత్రంలోని వ్యత్యాసాలను జాగ్రత్తగా చూడవచ్చు. భారత జెండాను పట్టుకున్న చేతికి బొటనవేలుతో పాటు 5 వేళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొన్ని వేళ్లు కూడా స్థిరంగా లేవు. వెనుక నిలబడిన వ్యక్తుల చూపుల్లో కూడా అనేక అసమానతలు ఉన్నాయి.
హైవ్ మోడరేషన్ ను ఉపయోగించి, మేము ఈ చిత్రం ఒరిజినాలిటీని ధృవీకరించాలని ప్రయత్నించగా.. ఈ చిత్రం 99% AI అని ఫలితాలు చూపించాయి.

మరింత సెర్చ్ చేయగా.. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన AI- చిత్రాలను పోస్ట్ చేసిన @Exclusive Minds అనే X ఖాతాను గుర్తించాం. ఆ అకౌంట్ లోనే వైరల్ ఇమేజ్ ను అప్లోడ్ చేశారని మేము కనుగొన్నాము.
ఇతర చిత్రాలలో ఒకదానిపై, ఇది AI ద్వారా రూపొందించిన చిత్రం అని పేర్కొనడం కూడా మనం చూడవచ్చు.
News18.com తన X (ట్విట్టర్) ఖాతాలో రక్షించిన కార్మికులకు సంబంధించిన వీడియోను చూడొచ్చు. కార్మికులు కెమెరాకు పోజులిచ్చిన అసలు ఫుటేజీని మనం చూడొచ్చు. "ఝాన్సీకి చెందిన 12 మంది ర్యాట్ మైనర్లు, కేవలం 27 గంటల్లో 41 మంది కార్మికుల దగ్గరకు చేరుకున్నారు" అని వీడియో శీర్షిక చెబుతోంది.
అందువల్ల, వైరల్ చిత్రం ఉత్తరాఖండ్‌లో కూలిపోయిన సొరంగం నుండి రక్షించిన కార్మికులకు సంబంధించిన ఒరిజినల్ చిత్రం కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : The viral image shows rescued workers who were trapped in the tunnel in Uttarakhand
Claimed By : Social media and Mainstream media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media and mainstream media
Fact Check : False
Next Story