ఫ్యాక్ట్ చెక్: కెనరా బ్యాంకు ముందు కెనడాకు వ్యతిరేకంగా బీజేపీ మద్దతుదారులు నిరసన తెలపలేదు
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ప్రభుత్వ "ఏజెంట్" కారణమని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత,
Claim :
కెనరా బ్యాంకు ముందు కెనడాకు వ్యతిరేకంగా బిజెపి మద్దతుదారులు నిరసన తెలుపుతున్న చిత్రంFact :
అసలు చిత్రంలో కెనరా బ్యాంక్ లోగో లేదు, డిజిటల్‌గా ఎడిట్ చేసిన చిత్రం తప్పుడు వాదనతో వైరల్ చేస్తున్నారు
ప్రవాస భారతీయుల సంఖ్య పరంగా కొన్ని కీలక దేశాలలో కెనడా ఒకటి. ఈ దేశం ఇటీవల భారత్‌తో వ్యవహరిస్తున్న తీరు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. భారతదేశం గానీ మరే దేశం గానీ రాయబారి స్ధాయి దౌత్యవేత్తను వెనక్కి రప్పించుకోవడం చాలా అరుదు. భారత్ ఇప్పుడు అటువంటి అరుదైన నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్ధితిని కెనడా సృష్టించింది.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ప్రభుత్వ "ఏజెంట్" కారణమని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత, సెప్టెంబర్ 2023 నుండి భారత్, కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. కెనడాలో భారత ప్రభుత్వ ఏజెంట్లు తీవ్రమైన నేర కార్యకలాపాలకు పాల్పడ్డారని కెనడా పోలీసులు కూడా ఆరోపించారు. భారత్ మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొట్టింది.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2023లో విశ్వాస్ న్యూస్ కూడా డీబంక్ చేసింది. విశ్వాస్ న్యూస్ విభాగం ఊటీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోగన్ రాజ్‌ను సంప్రదించింది, ఈ చిత్రం 2020 నాటిదని, ఇటీవలిది కాదని ఆయన ధృవీకరించారు. ఆ ప్రాంతంలో కెనరా బ్యాంక్ బ్రాంచ్ లేదని, ఇమేజ్ ను డిజిటల్‌గా ఎడిట్ చేశారని కూడా ధృవీకరించారు.