Fri Nov 15 2024 07:07:55 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ ఫోటోకు నేషనల్ జియోగ్రాఫిక్ 2024 సంవత్సరపు అత్యుత్తమ చిత్రంగా నమోదు కాలేదు, ఏఐ తో తయారు చేసింది
నేషనల్ జియోగ్రాఫిక్ అనేది నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ అధికారిక పత్రిక. ఇది ప్రపంచంలోని అతిపెద్ద లాభాపేక్షలేని శాస్త్రీయ,
Claim :
వైరల్ చిత్రం నేషనల్ జియోగ్రాఫిక్ 2024 సంవత్సరపు అత్యుత్తమ చిత్రంగా నమోదు అయ్యిందిFact :
ఈ చిత్రం AI సాంకేతికతను ఉపయోగించి రూపొందించబడింది, ఇది అసలు చిత్రం కాదు
నేషనల్ జియోగ్రాఫిక్ అనేది నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ అధికారిక పత్రిక. ఇది ప్రపంచంలోని అతిపెద్ద లాభాపేక్షలేని శాస్త్రీయ, విద్యా సంస్థలలో ఒకటిగా నిలిచింది. కలర్ ఛాయాచిత్రాలను అందిస్తూ మంచి పేరును సంపాదించుకుంది. ఈ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ వన్యప్రాణుల ఛాయాచిత్రాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళుతుంది.
ప్రతి సంవత్సరం, నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ ద్వారా సంవత్సరపు ఉత్తమ ఫోటోగ్రాఫ్ టైటిల్ కోసం అనేక ఫోటోలు పోటీపడతాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రతి సంవత్సరం "పిక్చర్స్ ఆఫ్ ది ఇయర్" ఫోటో పోటీని నిర్వహిస్తుంది. ప్రకృతి, వ్యక్తులు, ప్రదేశాలు, జంతువులు ఇలా 4 విభిన్న వర్గాలకు సంబంధించి విజేతలను ప్రకటిస్తుంది. మంత్రముగ్దులను చేసే చిత్రాలు నేషనల్ జియోగ్రాఫిక్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.
ఇంతలో, ఆకాశంలో ఒక పౌర్ణమి చంద్రుడు కనిపిస్తుండగా సముద్రంలో ఈదుతున్న తిమింగలం చిత్రం వైరల్ అవుతూ ఉంది. ఈ చిత్రంలో చంద్రుడు చాలా పెద్దదిగా, నీటికి చాలా దగ్గరగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం X, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతూ ఉంది. ఈ చిత్రం "ఈ ఏడాది నేషనల్ జియోగ్రాఫిక్ అవార్డు గెలుచుకున్న ఛాయాచిత్రం" అనే వాదనతో పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ చిత్రం అసలైనది కాదు. AI టెక్నాలజీని ఉపయోగించి రూపొందించారు.
మేము ఇటీవలి ఫోటోగ్రఫీ పోటీలో విజేతల గురించి కథనాల కోసం వెతికాం, నేషనల్ జియోగ్రాఫిక్ ద్వారా 2024 సంవత్సరానికి గానూ ఉత్తమ ఫోటోగ్రాఫ్గా ఎటువంటి ప్రకటన కనిపించలేదు. అయితే నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ (UK) ఫోటోగ్రఫీ పోటీ 2024 విజేతల గురించిన కథనాన్ని మేము కనుగొన్నాము. ఈ కథనంలో పోస్టు చేసిన చిత్రాలలో వైరల్ చిత్రాన్ని మేము కనుగొనలేదు.
అలాగే, నేషనల్ జియోగ్రాఫిక్ ప్రచురించిన ఫోటో కాంటెస్ట్ గ్యాలరీలో మేము వైరల్ చిత్రాన్ని కనుగొనలేదు. 2015 నుండి వివిధ సంవత్సరాల నుండి పోటీ విజేతలుగా నిలిచిన చిత్రాలన్నీ ఇక్కడ ఉన్నాయి. నేషనల్ జియోగ్రాఫిక్ వెబ్ సైట్ లో మాకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు లభించాయి కానీ, వైరల్ అవుతున్న చిత్రం మాత్రం లభించలేదు. అయితే ఈ చిత్రం ఇతర వెబ్ సైట్లలో కూడా ఎక్కడా ప్రచురించలేదు. కేవలం సోషల్ మీడియా లో ప్రచారంలో ఉంది.
తెలుగుపోస్ట్ బృందం 'ఈజ్ ఇట్ AI' అనే AI ఇమేజ్ డిటెక్టర్‌ని ఉపయోగించి చిత్రాన్ని తనిఖీ చేసింది. చిత్రం AI ద్వారా రూపొందించిన చిత్రంగా మేము కనుగొన్నాము. దాదాపు 80% ఏఐ సృష్టి అని తెలుసుకున్నాం.
మా ఫలితాలను నిర్ధారించడానికి మేము మరొక AI ఇమేజ్ డిటెక్షన్ టూల్ హైవ్ మోడరేషన్‌ని కూడా ఉపయోగించాం. ఆ డిటెక్షన్ టూల్ 96% AI ద్వారా రూపొందించిన చిత్రమని మేము కనుగొన్నాము.
అందువల్ల, ఈ సంవత్సరం నేషనల్ జియోగ్రాఫిక్ అవార్డు గెలుచుకున్న ఫోటో అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేసిన చిత్రం అసలైన ఫోటో కాదు. మా పరిశోధన లో వైరల్ అవుతున్న చిత్రం నిజమైన చిత్రం కాదని తెలుస్తోంది. ఏఐ టెక్నాలజీ ని వాడి ఈ చిత్రాన్ని తయారుచేసారు. తప్పుడు కధనం తో దీనిని ప్రచారం చేస్తున్నారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలు నేషనల్ జియోగ్రాఫిక్ లో ప్రచురితం అయినప్పటికీ, ఇది ఆ జాబితా లో లేదు. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ చిత్రం నేషనల్ జియోగ్రాఫిక్ 2024 సంవత్సరపు అత్యుత్తమ చిత్రంగా నమోదు అయ్యింది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story