Sun Dec 22 2024 19:24:43 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: 500 రూపాయల నోటు మీద శ్రీరాముడి ఫోటోను మార్ఫింగ్ చేశారు
జనవరి 22, 2024న అయోధ్యలో రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో టన్నుల కొద్దీ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు.
Claim :
కొత్త 500 రూపాయల నోట్లపై ఎర్రకోట స్థానంలో రామమందిరం, గాంధీ బొమ్మ స్థానంలో శ్రీరాముడిని ఉంచారు. 22/01/2024న ఈ నోట్లను విడుదల చేయనున్నారు.Fact :
ఈ చిత్రం నకిలీది. అలాంటి 500 రూపాయల నోట్లను విడుదల చేసే ఆలోచన ఆర్బీఐకి లేదు
జనవరి 22, 2024న అయోధ్యలో రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో టన్నుల కొద్దీ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు.
మహాత్మా గాంధీకి బదులుగా రాముడు, ఎర్రకోటకు బదులుగా రామమందిరాన్ని చూపుతున్న రూ.500 నోటు చిత్రం జనవరిలో విడుదల కాబోతోందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది త్వరలోనే వచ్చే కొత్త రూ.500 నోటు అనే వాదనతో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 22 జనవరి 2024 తేదీ అయోధ్యలో శ్రీరాముని పవిత్రోత్సవాన్ని సూచిస్తుంది.
“Major Braking: Now the 500 code note, will have a picture of Sriram Mandir instead of Red Fort. JAY SHREE RAM ” అనే క్యాప్షన్ తో ఫోటోను షేర్ చేస్తున్నారు. 'బిగ్ బ్రేకింగ్: 500 కోడ్ నోట్లో ఎర్రకోటకు బదులుగా శ్రీరామ మందిరం చిత్రం ఉంటుంది. జై శ్రీ రామ్' అని అందులో తెలిపారు.
“वोट के लिए? NEW 500 NOTES WILL BE ISSUED ON 22/01/2024” అనే క్యాప్షన్ తో కూడా ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. రాముడు, రామమందిరం అంటూ ఉన్న రూ.500 నోటు చిత్రం మార్ఫింగ్ చేశారు.కీ వర్డ్స్ ను ఉపయోగించి వెతికితే కొత్త రూ.500 నోటు విడుదలపై ఎలాంటి వార్తా నివేదికలు కనిపించలేదు.
మేము PIB, PMO యొక్క సోషల్ మీడియా ఖాతాలను శోధించాము. అయితే భారత ప్రభుత్వం రూ. 500 నోటుపై రామమందిర చిత్రాన్ని ముద్రించాలని నిర్ణయించినట్లు ఎటువంటి ప్రకటనలు కనుగొనలేదు.
RBI వెబ్సైట్లో కూడా, మేము అలాంటి ప్రకటన ఏదీ కనుగొనలేకపోయాం. తాజా 500 రూపాయల నోటును 2016 సంవత్సరంలో ఆర్బిఐ విడుదల చేసింది. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ (MGNS) ను ప్రధాని ప్రవేశపెట్టారు.
ఆర్బిఐ వెబ్సైట్ లో ఉన్న (కొత్త) సిరీస్‌లోని ₹ 500 డినామినేషన్ నోటు వెనుక భాగంలో భారతీయ వారసత్వ ప్రదేశం రెడ్ ఫోర్ట్‌ను భారత జెండాతో ఉంచారని స్పష్టంగా తెలియజేసారు. ఎలాంటి మార్పులు లేవని.. గాంధీజీ కూడా నోటు మీద ఉన్నారని తెలియజేశారు. ఆర్బిఐ వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు కొత్త నోటును విడుదల చేయగానే అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే వెబ్సైట్ లో ఎటువంటి సరికొత్త విషయం గురించి తెలియజేయలేదు.
కాబట్టి, వైరల్ చిత్రాన్ని మార్ఫింగ్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. రాముడు, రామమందిరం చిత్రాలతో కొత్త రూ.500 నోటును విడుదల చేస్తున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Viral image shows new 500 rupee notes with Red Fort replaced with Ram Mandir and image of Gandhi replaced with Lord Ram, to be issued on 22/01/2024
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story