Fri Nov 22 2024 14:13:39 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: న్యూయార్క్ లో విరాట్ కోహ్లీ విగ్రహం అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
జూన్ 29న బార్బడోస్‌లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచ కప్ ట్రోఫీని రెండోసారి గెలుచుకుంది.
Claim :
న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ విగ్రహాన్ని ఆవిష్కరించారుFact :
ఈ చిత్రం నిజమైన విగ్రహానికి సంబంధించింది కాదు. డ్యురోఫ్లెక్స్, మ్యాట్రెస్ కంపెనీ ప్రచారంలో భాగంగా దీన్ని CGI ద్వారా సృష్టించారు
జూన్ 29న బార్బడోస్‌లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచ కప్ ట్రోఫీని రెండోసారి గెలుచుకుంది. ఈ చిరస్మరణీయమైన విజయం తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా తమ T20I కెరీర్ కు రిటైర్మెంట్ను ప్రకటించారు. విరాట్ కోహ్లి ఫైనల్ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో విరాట్ కోహ్లి విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు తెలిపే వీడియోలు, కొన్ని చిత్రాలు వైరల్ అయ్యాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోను CGI ద్వారా సృష్టించారు. ఇది ఓ బ్రాండ్ ప్రచారంలో భాగంగా రూపొందించారు.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను ఉపయోగించాము. అది పరుపులకు సంబంధించిన ప్రముఖ కంపెనీ Duroflex సృష్టి అని మేము కనుగొన్నాము. విరాట్ కోహ్లీ విగ్రహం వెనుక ఉన్న భవనాల్లోని టీవీలలో డ్యూరోఫ్లెక్స్ ప్రకటన ప్రముఖంగా ఉండడాన్ని మేము వీడియోలో చూపించాము. #CGIanimation అనే హ్యాష్‌ట్యాగ్‌తో డ్యూరోఫ్లెక్స్ తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ వీడియోను షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.
“Just Unveiled: a larger-than-life statue of Virat Kohli at the iconic Times Square.” అనే క్యాప్షన్ తో మ్యాట్రెస్ కంపెనీకి చెందిన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జూన్ 23, 2024న వీడియోను షేర్ చేశారు. సీజీఐతో సృష్టించినట్లుగా సదరు సంస్థ స్పష్టంగా తెలిపింది. #GreatSleepGreatHealth #ViratKohli #worldcup #cricket #CGI #cgianimation అనే హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగించారు.
#CGI #cgianimation అనే హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగించి కంపెనీ ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లలో ఇదే వీడియోను షేర్ చేశారని మేము గుర్తించాం.
Duroflex on King's Duty | Times Square, New York City | Virat Kohli | CGI | అనే క్యాప్షన్ తో ఇదే వీడియోను యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేశారు.
కంప్యూటర్-జెనరేటెడ్ ఇమేజరీ (CGI) అనేది లైవ్-యాక్షన్, యానిమేటెడ్ ఫిల్మ్ మేకింగ్‌లో గొప్ప పాత్ర పోషిస్తున్న అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం. విరాట్ కోహ్లీ విగ్రహాన్ని చూపించే వీడియో, చిత్రాలు CGI ద్వారా సృష్టించారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో విగ్రహాన్ని ఆవిష్కరించలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ విగ్రహాన్ని ఆవిష్కరించారు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story