ఫ్యాక్ట్ చెక్: ఐఫోన్ పేలుడుకు, లెబనాన్‌లోని పేలుళ్లకు ఎలాంటి సంబంధం లేదు. వైరల్ విజువల్స్ పాతవి
హిజ్బుల్లా నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని లెబనాన్ దేశంలో వరుసగా ఎలక్ట్రానిక్ పరికరాలు పేలడం ప్రారంభించాయి.
Claim :
ఇటీవల లెబనాన్‌లో ఐఫోన్ పేలిన దృశ్యాన్ని వైరల్ విజువల్స్ చూపుతున్నాయిFact :
వైరల్ చిత్రం పాతది, 2021లో ఐఫోన్ పేలిన ఘటనకు సంబంధించింది
హిజ్బుల్లా నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని లెబనాన్ దేశంలో వరుసగా ఎలక్ట్రానిక్ పరికరాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో లెబనాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. హిజ్బుల్లా మిలిటరీ గ్రూపుకు చెందిన వందలాది పేజర్లు ఏకకాలంలో పేలడంతో 12 మంది మరణించారు. ఈ పేలుళ్లు జరిగిన ఒక రోజు తర్వాత వాకీ టాకీలు పేలడంతో 20 మంది మరణించారు. దేశవ్యాప్తంగా వేలాది మంది గాయపడ్డారు. ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. తైవాన్, హంగేరీకి చెందిన రెండు సంస్థలు పేజర్లను తయారు చేశాయని మీడియా నివేదికలు వచ్చాయి. లెబనాన్‌లో పేలిన వాకీ టాకీలను ఉత్పత్తి చేసిన జపాన్ కంపెనీ 10 సంవత్సరాల క్రితం ఆ మోడల్‌ను తయారు చేయడం మానేసింది. అయితే, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ కొత్త తరహా యుద్ధాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
ఇంతలో, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు లెబనాన్‌లో ఐఫోన్ పేలిపోయిందనే వాదనతో ఐఫోన్ పేలినట్లుగా చూపించే చిత్రం వైరల్‌గా మారింది. కొంతమంది వినియోగదారులు “లెబనాన్‌లో ఐఫోన్లు పేలుతున్నాయి” అనే శీర్షికతో చిత్రాన్ని షేర్ చేయగా, మరికొందరు “లెబనాన్‌లో ప్రస్తుతం ఏమి జరుగుతోంది. పెద్ద ఎత్తున కమ్యూనికేషన్ పరికరాలు, బ్యాటరీలు, మోటారు, స్కూటర్ బ్యాటరీలు వంటివి పేలే అవకాశం ఉంది" అనే క్యాప్షన్లతో ఫోటోను షేర్ చేశారు. అంతేకాకుండా లిథియం బ్యాటరీలు పేలే అవకాశం ఉందని కూడా తెలిపారు. బ్యాటరీల పరిమాణం పెద్దగా ఉండడంతో ఇళ్లు, వాహనాల్లో మంటలు చెలరేగడంతో తీవ్ర నష్టం జరిగింది. పెద్ద సంఖ్యలో గాయపడ్డారని పోస్టుల్లో వివరించారు.