Sun Nov 24 2024 01:47:01 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఫోటోలో ఉన్నది సాయి బాబా అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
షిర్డీ సాయి బాబా.. ఆధ్యాత్మిక గురువు. హిందూ, ముస్లింలు సాయి బాబాను భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఆరాధిస్తారు. ఆయన్ను సాయిబాబా, షిర్డీ సాయిబాబా అంటూ ఆరాధిస్తారు. ఒక్కో ప్రాంతాల్లో ఆయన్ను ఒక్కో రకంగా ఆరాధిస్తున్నారు.
Claim :
వైరల్ చిత్రం షిర్డీ సాయి బాబా అసలు ఫోటోFact :
ఈ చిత్రంలో ఉన్నది కశ్మీర్‌కు చెందిన సూఫీ కవి షమ్స్ ఫకీర్
షిర్డీ సాయి బాబా.. ఆధ్యాత్మిక గురువు. హిందూ, ముస్లింలు సాయి బాబాను భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఆరాధిస్తారు. ఆయన్ను సాయిబాబా, షిర్డీ సాయిబాబా అంటూ ఆరాధిస్తారు. ఒక్కో ప్రాంతాల్లో ఆయన్ను ఒక్కో రకంగా ఆరాధిస్తున్నారు. ఒక సాధువుగా, ఫకీరుగా, సద్గురువుగా, భగవంతునిగా, శ్రీ దత్తాత్రేయ రూపంగా పరిగణిస్తారు. సాయిబాబాకు భారతదేశంలో గొప్ప ప్రజాదరణ ఉంది.
తెల్ల గడ్డంతో ఉన్న వ్యక్తికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతూ ఉంది. ఇది షిర్డీ సాయిబాబా అసలు చిత్రం అని పేర్కొంటూ ఫేస్బుక్లో వైరల్ చేస్తూ ఉన్నారు. “సాయిబ్బాబా భక్తులారా! మీరు మేకప్ వేసి అందంగా తయారు చేసి కొలుస్తున్న సాయిబ్బాబా అసలు రూపం ఇది. ఇలాంటి వాళ్ళను కొలిస్తే పొయ్యేది నరకానికే. నిజ దైవాలను కొలవండి.” అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ చిత్రంలో ఉన్నది షిర్డీ సాయిబాబా కాదు. కశ్మీర్‌కు చెందిన ప్రముఖ సూఫీ కవి 'షామ్స్ ఫకర్' కు చెందినది.
మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2022లో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఓ వీడియోను గుర్తించాం. “tas naadanas kar chali chay/Kashmiri sufi song/ kalam_e_shamsfaqeer” అనే టైటిల్ తో ఓ సూఫీ కవితను అందులో ఉంచారు.
దీని నుండి క్యూ తీసుకొని, మేము Shams Faqeer/ Shamas Faqir అనే కీ వర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేశాం. ఈ ప్రసిద్ధ సూఫీ కవికి సంబంధించిన అనేక కథనాలను మేము కనుగొన్నాము. సూఫీయిజం- ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్ పేరుతో ఫేస్బుక్ పేజీలో అదే చిత్రాన్ని “షామాస్ ఫకీర్ (అలైహి రహ్మా)" కశ్మీర్‌లోని అత్యంత ప్రసిద్ధ సూఫీ కవులలో ఒకరు అనే శీర్షికతో షేర్ చేశారు.
నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన ఎలాంటి విద్యను అభ్యసించలేదని చెబుతారు. అయితే కశ్మీర్‌లోని మరొక ప్రసిద్ధ సూఫీ విద్వాంసుడు, కవి నియామా సాహెబ్ (అలైహి రహ్మా) వద్ద శిష్యరికం చేశాడని తెలుస్తోంది. షమస్ ఫకీర్ (అలైహి రహ్మా) సూఫీ మతంలోని ఖాదిరియా సిల్సిలకు చెందినవాడు. 25 సంవత్సరాల వయస్సులో, అతను పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు బయలుదేరాడు. అక్కడ అతను మరొక సూఫీ సన్యాసికి శిష్యుడు అయ్యాడు. అమృత్సర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, అతను కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో నివసించాలని అనుకుని.. అక్కడ అతను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం శ్రీనగర్‌లోని తన పూర్వీకుల ఇంటిలో ఉన్నాడు. ఆ తర్వాత కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలోని ఖాజీ బాగ్‌లోని గుహలో ఆరు నెలల పాటు ధ్యానం చేశాడు. అతని ధ్యానం పూర్తయిన తరువాత, క్రిష్పూర్ (షామాస్ అబాద్, బుద్గాం)లో నివసించాలని నిర్ణయించుకున్నాడు.
షమాస్ ఫకర్ (అలైహి రహ్మా) 1901లో మరణించారు. కశ్మీర్‌లోని క్రిష్పూర్లో ఆయనను ఖననం చేశారు. షమస్ ఫకర్ (అలైహి రహ్మా)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
“Shamas Faqir: Makers of Indian Literature” అనే టైటిల్ తో ఆయనకు సంబంధించిన ఓ బుక్ ను మేము గుర్తించాం.
ఫేస్బుక్లో షేర్ చేసిన చిత్రం షిర్డీ సాయిబాబాది కాదు, కశ్మీర్‌కు చెందిన సూఫీ కవిది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ చిత్రం షిర్డీ సాయి బాబా అసలు ఫోటో
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : False
Next Story