Mon Dec 23 2024 18:59:24 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అయోధ్యకు భారీగా భక్తులు వచ్చారంటూ వైరల్ అవుతున్న పోస్టు అయోధ్యకు సంబంధించినది కాదు.. పూరీకి సంబంధించినది
జనవరి 22, 2024న అయోధ్యలో శ్రీరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తీ అయింది. ఊహించని రద్దీ కొనసాగుతూ ఉంది. లక్షల్లో భక్తులు రామ్ లల్లాకు ప్రార్థనలు చేసేందుకు ఆలయాన్ని సందర్శిస్తున్నారు
Claim :
అయోధ్యలో దర్శనం కోసం 7.5 కిలోమీటర్ల క్యూలో భక్తులు వేచి ఉన్నారని ఈ చిత్రం చూపిస్తుందిFact :
ఈ చిత్రం పాతది. జూన్ 2023లో జగన్నాథ రథయాత్ర సందర్భంగా అక్కడకు వచ్చిన భక్తులకు సంబంధించినది
జనవరి 22, 2024న అయోధ్యలో శ్రీరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తీ అయింది. ఊహించని రద్దీ కొనసాగుతూ ఉంది. లక్షల్లో భక్తులు రామ్ లల్లాకు ప్రార్థనలు చేసేందుకు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. అయోధ్యలో రామ్ లల్లా దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు సంబంధించిన ఫోటో అంటూ కొందరు భారీగా జనం ఉన్న ఫోటోను షేర్ చేస్తున్నారు.
"అయోధ్యలో దర్శనం కోసం 7.5 కిలోమీటర్ల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు" అనే శీర్షికతో ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఈ చిత్రంలో ఉన్నది అయోధ్యలో భక్తుల రద్దీ కాదు. జగన్నాథ రథయాత్ర నిర్వహించే పూరీలోని జనసమూహానికి సంబంధించినది.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వైరల్ చిత్రాన్ని సెర్చ్ చేయగా.. జూన్ 2023లో పూరీ జగన్నాథ్ రథయాత్రకు సంబంధించిన చిత్రం ఆన్లైన్లో ఉన్నట్లు మేము కనుగొన్నాము.
జూన్ 21, 2023న “Crowd at iconic Jagannath Rath Yatra Puri, Odisha” అనే శీర్షికతో అదే విజువల్స్‌ను షేర్ చేసిన YouTube వీడియోను మేము కనుగొన్నాము.
పురేంద్ర క్రియేషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ కూడా అదే తరహా విజువల్స్ ను షేర్ చేశారు.
shillongtimes.com కూడా వైరల్ ఇమేజ్‌ని పబ్లిష్ చేసింది. ‘భక్తులు జగన్నాథుని వార్షిక రథయాత్రలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.’ అనే శీర్షికతో వీడియోను పోస్టు చేశారు.
టైమ్స్ గ్రూప్ కు చెందిన వెబ్సైట్ కూడా “పూరీలో వార్షిక భగవాన్ జగన్నాథ రథయాత్ర: జూన్ 20, 2023న ఒడిశాలోని పూరీలో జరిగే వార్షిక రథయాత్రలో భక్తుల రద్దీ” అనే శీర్షికతో ఇలాంటి చిత్రాన్ని షేర్ చేసింది.
NDTV నివేదిక ప్రకారం.. పూరీలో 12వ శతాబ్దపు నాటి దేవాలయం ఉంది. జగన్నాథుడుగా భక్తులతో పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాధుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ దివ్యదేశాల్లో ప్రముఖమైనది మరియూ హిందువులు అతి పవిత్రంగా భావించే " చార్ ధాం " పుణ్యక్షేత్రాలలో ఒకటి.ఈ ఆలయాన్ని 1078 లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. పూరీ పట్టణంలో జరిగే వార్షిక ఉత్సవాలకు లక్షల్లో భక్తులు తరలివస్తూ ఉంటారు. పొరుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా.. విదేశాల నుండి కూడా చాలా మంది ఈ ఊరేగింపులలో భాగమయ్యారు.
వైరల్ అవుతున్న చిత్రం పాతది. అయోధ్య రామమందిరానికి ఎటువంటి సంబంధం లేదు. జూన్ 2023లో జగన్నాథ రథయాత్ర సందర్భంగా పూరీలో భక్తుల రద్దీకి సంబంధించింది. అయోధ్యలో దర్శనం కోసం కూడా జనం చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ ఫోటోకు అయోధ్యకు ఎలాంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : The image shows a 7.5-km queue of devotees waiting for darshan at Ayodhya
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story