Tue Nov 05 2024 12:27:27 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బెంగళూరు లోని జామియా మసీదుకు సంబంధించిన వైరల్ ఫోటోను మార్ఫింగ్ చేశారు. నేమ్ బోర్డు కన్నడలో కూడా ఉంది.
కర్ణాటకలోని బెంగుళూరులో కన్నడ భాష అనుకూల నిరసనకారులు నేమ్ బోర్డులకు సంబంధించి నిరసన ప్రదర్శనలను చేస్తున్న సంగతి తెలిసిందే!! నల్లరంగు పూసి పలు నేమ్ప్లేట్లను ధ్వంసం చేశారు. వ్యాపార సంస్థలు కన్నడలో నేమ్ బోర్డులు ఉంచాలని సూచించారు. 60% నేమ్ బోర్డులు కన్నడ భాషలో ఉండేలా పౌర సంఘం ఆదేశించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
Claim :
కర్ణాటక బెంగళూరులోని జామియా మసీదు సైన్ బోర్డుపై కన్నడ అన్నదే భాష లేదుFact :
వైరల్ చిత్రం జుమ్మా మసీదుకు సంబంధించినది. సైన్ బోర్డుపై కన్నడ భాష ఉన్నది జామియా మసీదు కాదు
కర్ణాటకలోని బెంగుళూరులో కన్నడ భాష అనుకూల నిరసనకారులు నేమ్ బోర్డులకు సంబంధించి నిరసన ప్రదర్శనలను చేస్తున్న సంగతి తెలిసిందే!! నల్లరంగు పూసి పలు నేమ్ప్లేట్లను ధ్వంసం చేశారు. వ్యాపార సంస్థలు కన్నడలో నేమ్ బోర్డులు ఉంచాలని సూచించారు. 60% నేమ్ బోర్డులు కన్నడ భాషలో ఉండేలా పౌర సంఘం ఆదేశించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
కన్నడ జెండాకు ప్రతీకగా పసుపు, ఎరుపు రంగు కండువాలు ధరించిన కొంతమంది వ్యక్తులు బెంగళూరు వీధుల్లో కన్నడలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంగ్లంలో ఉన్న పోస్టర్లను, బ్యానర్లను చించివేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపధ్యంలో, బెంగళూరు నగరం నడి బొడ్డున ఉన్న జామియా మసీదుపై కన్నడ సైన్ బోర్డు లేదని పేర్కొంటూ X (ట్విట్టర్)లో ఒక మసీదు ఫోటోను వైరల్ చేస్తూ ఉన్నారు. “Jamia Masjid, Bangalore, Karnataka. The signboard has no #Kannada text. Let's see if "save our language/culture warrior" protests against it or not... Kannada warriors? #Karnataka” అంటూ పోస్టులు పెడుతున్నారు. జామియా మసీదు విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూద్దాం అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.వైరల్ అవుతున్న పోస్టుల్లోని చిత్రం బెంగళూరులోని జుమ్మా మసీదును(Jumma Masjid)చూపుతుంది. జామియా మసీదుకు సంబంధించినది కాదు. మసీదు నేమ్ బోర్డులో కన్నడ భాష ఉంది. వైరల్ చిత్రాన్ని ఎడిట్ చేశారు
“ Jamia Masjid in Bengaluru” అనే కీ వర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. బెంగళూరులోని జామియా మసీదును చూపించే కొన్ని వీడియోలను మేము కనుగొన్నాము. జామియా మసీదు వైరల్ ఇమేజ్‌కి పూర్తిగా భిన్నమైన భవనమని మేము గుర్తించాం. వైరల్ ఇమేజ్‌లో ఉన్నటువంటి మసీదు ఫోటోను Flickr.com వెబ్సైట్ లో గుర్తించాం. బెంగుళూరులోని పురాతన మసీదు (1790లో నిర్మించారు) జుమ్మా మసీదును గతంలో సంగియాన్ జామియా మసీదుగా పిలిచేవారు. ఈ మసీదు అందమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. మసీదు ఇటుక, మోర్టార్ నిర్మాణం ఆకట్టుకునే విధంగా ఉంటాయి.
సెప్టెంబరు 2018లో Facebookలో ప్రచురించిన వీడియోలో కన్నడ సైన్‌బోర్డ్‌ను చూపే మసీదు ముఖ ద్వారం గుర్తించవచ్చు.
మరిన్ని వివరాల కోసం సెర్చ్ చేయగా “Bangalore Jamiya maszid|Jamia Masjid Bangalore|Kr market Jamiya maszid| Jamiya Maszid” అనే టైటిల్‌తో YouTubeలో ప్రచురించిన వీడియోను మేము కనుగొన్నాము. డిసెంబర్ 2022లో వీడియోను పోస్టు చేశారు.
ఈ వీడియోలో, మసీదు గేట్‌పై ఉన్న సైన్‌బోర్డ్‌ను మనం చూడవచ్చు మరియు మసీదు పేరును కన్నడ, ఉర్దూతో పాటు ఆంగ్లంలో కూడా చూడవచ్చు.
మేము వైరల్ ఇమేజ్ కు సంబంధించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఆ ఫోటోలు బెంగుళూరులోని జుమ్మా మసీదుని చూపించాయి.
ఎలక్ట్రానిక్ సిటీ.ఇన్ ప్రకారం, ఈ చిత్రం బెంగళూరులోని శివాజీనగర్ OPH రోడ్డులో ఉన్న జుమ్మా మసీదును చూపుతుంది.
గూగుల్ మ్యాప్స్‌లో జుమ్మా మసీదు గురించి సెర్చ్ చేయగా.. కన్నడ, ఉర్దూ, ఇంగ్లీషులో పేర్లను ప్రదర్శించే బోర్డును చూపించే మసీదుకు సంబంధించిన చిత్రాలు మాకు కనిపించాయి.
వైరల్ చిత్రం బెంగళూరులోని జుమ్మా మసీదుకు సంబంధించినది. జామియా మసీదుకు సంబంధించినది కాదు. మసీదు వద్ద సైన్ బోర్డుపై కన్నడ భాష లేదన్న వాదన అవాస్తవం. రెండు మసీదుల నేమ్ బోర్డులపై కన్నడ భాష ఉంటుంది. వైరల్ చిత్రాన్ని కావాలనే ఎడిట్ చేశారు.
Claim : The image of Jamia Masjid in Bengaluru, Karnataka has no Kannada language on the signboard
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story