Mon Dec 23 2024 14:29:11 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: 80 ఏళ్ల మహిళ భారీ పిల్లులతో ఉన్న వైరల్ చిత్రాలు AI ద్వారా రూపొందించారు
ఉలన్ దారాలతో అల్లిన భారీ పిల్లులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. పెద్ద క్రోచెట్ పిల్లుల పక్కన కూర్చున్న వృద్ధ మహిళ అంటూ ఈ ఫోటోలను ప్రచారం చేస్తున్నారు. “An 80-year-old grandmother and her crochet finished product” అంటూ పోస్టులు పెడుతున్నారు.
Claim :
చిత్రాలలో 80 ఏళ్ల వృద్ధురాలు, ఆమె చేసిన భారీ ఉలన్ దారాలతో చేసిన పిల్లులను చూపుతున్నాయిFact :
ఈ చిత్రాలు AI ద్వారా రూపొందించారు
వైరల్ చిత్రాలలో ఉన్న పిల్లులను 80 ఏళ్ల వృద్ధురాలు సృష్టించలేదు. ఉలన్ ద్వారాలతో భారీ పిల్లుల పక్కన వృద్ధ మహిళ ఉండడం AI తో రూపొందించిన చిత్రాలలో భాగం
ఉలన్ దారాలతో అల్లిన భారీ పిల్లులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. పెద్ద క్రోచెట్ పిల్లుల పక్కన కూర్చున్న వృద్ధ మహిళ అంటూ ఈ ఫోటోలను ప్రచారం చేస్తున్నారు. “An 80-year-old grandmother and her crochet finished product” అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. ఈ ఫోటోలన్నీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించారు.
మేము చిత్రాలను జాగ్రత్తగా పరిశీలించగా.. వేర్వేరు చిత్రాలలో ఉన్న స్త్రీల ముఖాలు ఒకేలా లేవని మేము కనుగొన్నాము. ప్రతి చిత్రం లోనూ క్రోచెట్ క్యాట్‌తో పాటు వేరే స్త్రీని చూడవచ్చు. మేము చేతులు, కాలి వేళ్లు, కళ్ళు మొదలైన స్త్రీల శరీర భాగాలపై పలు మార్పులను కూడా గుర్తించాము.
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి చిత్రాలను సెర్చ్ చేయగా.. జూలై 3, 2023న మొదట ఈ చిత్రాలను షేర్ చేసిన ai.artandcat అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా మాకు కనిపించింది.

ఈ Instagram ఖాతా "Lydia's AI art and Cats" పేరుతో Facebook పేజీకి లింక్ చేశారు. ఫేస్బుక్ పేజీలో పేరు లిడియా మాస్టెరోవా అని గుర్తించాం.
ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతా AI సాంకేతికతను ఉపయోగించి సృష్టించిన పిల్లులకు సంబంధించిన అనేక చిత్రాలు ఉండడాన్ని మనం గుర్తించాం. వృద్ధ మహిళలను క్రోచెట్ బైక్‌లపై కూర్చుని ఉన్న కొన్ని చిత్రాలు కూడా అందులో గమనించాం.
“Grandmas proudly show their crochet cars! Guess the cars! There are four models here” అనే క్యాప్షన్‌తో క్రోచెట్ కార్లతో వృద్ధ మహిళల చిత్రాల ఫోటోలు కూడా ఉన్నాయి.
మేము AI డిటెక్షన్ టూల్ ని ఉపయోగించి చిత్రాన్ని తనిఖీ చేశాం. AIని ఉపయోగించి ఈ చిత్రం రూపొందించారని మేము కనుగొన్నాము.
ఈ చిత్రాలను స్నోప్స్ అనే వాస్తవ తనిఖీ సంస్థ కూడా ఫ్యాక్ట్ చెక్ చేసింది.
కాబట్టి, భారీ క్రోచెట్ పిల్లుల పక్కన కూర్చున్న వృద్ధ మహిళల చిత్రాలు AI ద్వారా రూపొందించారు. ఈ చిత్రాలలో 80 ఏళ్ల వృద్ధురాలు తాను తయారు చేసిన ఉలన్ పిల్లుల బొమ్మల పక్కన కూర్చుందంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Images show an 80-year-old woman and huge crochet cats made by her.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story