Tue Nov 05 2024 13:56:17 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఇస్కాన్ సంస్థ ఉక్రెయిన్ లోని ప్రజలకు భోజనాలు పెడుతున్నట్లుగా పోస్టులు వైరల్..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రారంభించిన సంగతి తెలిసిందే..! రష్యా దాడి మొదలుపెట్టినప్పటి నుండి ఆ దేశంలోని చాలా ప్రాంతాల ప్రజలు.....
క్లెయిమ్: ఇస్కాన్ సంస్థ ఉక్రెయిన్ లోని ప్రజలకు భోజనాలు పెడుతున్నట్లుగా ఫోటోలు వైరల్
ఫ్యాక్ట్: వైరల్ ఫోటోలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రారంభించిన సంగతి తెలిసిందే..! రష్యా దాడి మొదలుపెట్టినప్పటి నుండి ఆ దేశంలోని చాలా ప్రాంతాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా ఉక్రెయిన్‌లో కనీసం తినడానికి తిండి, తాగడానికి మంచి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది. రష్యా-ఉక్రెయిన్ వివాదం సమయంలో ప్రజలకు సహాయక చర్యలు చేపడుతున్న ఇస్కాన్ దేవాలయం ట్రస్టు అని చెబుతూ కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వైరల్ చిత్రాలలో, వాలంటీర్లు ఆహారం అందిస్తున్నప్పుడు ప్రజలు క్యూలో నిలబడి ఉన్నారు.
కోల్‌కతాలోని ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామ్ దాస్ ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ఇస్కాన్ ఉక్రెయిన్‌లో 54 పైగా దేవాలయాలను కలిగి ఉంది. మా భక్తులు, దేవాలయాలు ఆపదలో ఉన్నవారికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాయి. సేవ కోసం మా తలుపులు తెరిచి ఉన్నాయి. హరే కృష్ణ." అంటూ పోస్టు పెట్టారు.
మేఘాలయ మాజీ గవర్నర్ తథాగత రాయ్ ఈ చిత్రాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. "ఇస్కాన్ వారి దేవాలయాల ద్వారా ఉక్రెయిన్ లో సేవలు అందిస్తోంది. శ్రీల AC భక్తివేదాంత స్వామి ప్రభుపాద కోల్‌కతాలోని అప్పటి-హారిసన్ రోడ్లో ఒక చిన్న రిటైలర్. ఇప్పుడు ప్రపంచమంతటా కృష్ణుడి గురించి తెలియజేయడానికి బయలుదేరారు." అంటూ ట్వీట్ చేశారు. "ISKCON serving war-torn Ukraine through their temples. What the devotion of an inspired man can do! Sreela A C Bhaktivedanta Swami Prabhupada,a tiny retailer in Kolkata's then-Harrison Road set forth to preach the name of Krsna all over the world." అని ట్వీట్ పెట్టారు.

కొన్ని రైట్-వింగ్ పేజీలు కూడా ఇవే ఫోటోలను షేర్ చేస్తూ.. ఇస్కాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
Zee News, DNA మీడియా సంస్థలు కూడా ఆర్టికల్స్ కోసం ఈ ఫోటోనే ఉపయోగించాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో కూడా ఈ ఫోటోలను విపరీతంగా షేర్ చేశారు.
ఫోటో 1:
ఫ్యాక్ట్ చెక్:
మా ఫ్యాక్ట్ చెక్ టీమ్.. ఈ వైరల్ ఫోటోలు ప్రజలను తప్పుదోవ పట్టించేవని గుర్తించింది. ఈ వైరల్ ఫోటోలను ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్న పరిస్థితులకు ఎటువంటి సంబంధం లేదు.ఫోటో 1:
వైరల్ చుత్రాన్ని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. 'Religion in Russia' వికీపీడియా పేజీలో ఈ చిత్రాన్ని కనుగొన్నాము. ఫుడ్ ఫర్ లైఫ్ గ్లోబల్ యొక్క వికీపీడియా పేజీలో కూడా మేము ఈ చిత్రాన్ని కనుగొన్నాము. ఫుడ్ ఫర్ లైఫ్ గ్లోబల్ అనేది 1995లో స్థాపించబడిన సంస్థ. ఇదొక లాభాపేక్ష లేని ఆహార సహాయ సంస్థ. 1974 నుండి ఇస్కాన్‌తో అనుబంధం కలిగి ఉంది. ఈ వివరాలను బట్టి ఈ చిత్రం 2009లో అప్లోడ్ చేయబడిందని స్పష్టంగా తెలుస్తోంది. "ఇస్కాన్ ఫుడ్ ఫర్ లైఫ్ ఇన్ రష్యా: హరే కృష్ణ భక్తులకు ఉచితంగా శాఖాహార భోజనాలు పంపిణీ చేస్తున్నారు."("ISKCON Food for Life in Russia: Hare Krishna devotees distributing free vegetarian meals.") అంటూ క్యాప్షన్ ను పెట్టారు. కాబట్టి ఈ ఫోటో 2009 లోనిది అని స్పష్టంగా తెలుస్తోంది.
మరింత సెర్చ్ చేయగా.. మేము ఈ చిత్రాన్ని ఇస్కాన్ అధికారిక వెబ్సైట్లో కూడా కనుగొన్నాం. ఫోటో చెచెన్యాలో జరిగిన సహాయక చర్యలకు సంబంధించినది. చెచెన్యా కాస్పియన్ సముద్రానికి దగ్గరగా తూర్పు ఐరోపాలోని ఉత్తర కాకసస్లో ఉన్న ప్రాంతం. ఈ చిత్రాన్ని ఎప్పుడు తీశారు అనే దాని గురించి వెబ్సైట్లో ఎటువంటి సమాచారం పేర్కొనబడలేదు. వైరల్ చిత్రం ఉక్రెయిన్‌కు చెందినది కాదని స్పష్టంగా తెలుస్తోంది.
ఫోటో 2:
ఫోటో 2:
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2019 లో ఇదే ఫోటో ఉన్న పలు ఆర్టికల్స్ ను గమనించవచ్చు. ISKCON Desire Tree వారి వెబ్సైట్ లో 03 జూన్ 2019న పోస్టు చేయడం గమనించవచ్చు.
మేము ఇతర వెబ్సైట్లలో అలచువా హరే కృష్ణ దేవాలయంలో ఆహార పంపిణీ వలె అదే చిత్రాన్ని కనుగొన్నాము. ఈ ఫోటోను జీవనా విల్హోయిట్ తీశారు.
మేము చిత్రం యొక్క ఎక్సిఫ్ డేటాను శోధించాము మరియు ఇది 29 మార్చి 2015న తీయబడినదని కనుగొన్నాము. మేము ఇతర వెబ్సైట్లలో 'అలచువా హరే కృష్ణ దేవాలయం'లో ఆహార పంపిణీకి సంబంధించి అదే చిత్రాన్ని కనుగొన్నాము. ఈ ఫోటోను జీవనా విల్హోయిట్ తీశారు.
ఫోటో ఎక్సిఫ్ డేటాను సెర్చ్ చేశాం.. ఇది 29 మార్చి 2015న తీయబడినదని కనుగొన్నాము.

ఉక్రెయిన్‌లో యుద్ధం మధ్య మానవతా సహాయం అందిస్తున్న ఇస్కాన్ దేవాలయాలకు సంబంధించిన మీడియా నివేదికల కోసం కూడా మేము వెతికాము. డెకాన్ హెరాల్డ్ లో అందుకు సంబంధించిన వార్తను కనుగొన్నాము. కీవ్ ఇస్కాన్ ఆలయం, ఉక్రెయిన్ అంతటా ఉన్న ఇస్కాన్ అనుబంధ ఇతర దేవాలయాలు పేద ప్రజల కోసం ద్వారాలను తెరిచాయి. వారికి ఆహారం, ఆశ్రయం అందిస్తున్నాయి.
ఉక్రెయిన్‌లోని ఇస్కాన్ దేవాలయాలు సహాయం అందిస్తున్నాయన్నది నిజమే అయినప్పటికీ వైరల్ చిత్రాలు ఇటీవలివి కావని మా పరిశోధనలో కనుగొన్నాం. మొదటి చిత్రం 2009లో తీయబడింది. రెండవ చిత్రం 2015 నుండి ఇంటర్నెట్లో అందుబాటులో ఉందని మేము కనుగొన్నాము. ఈ చిత్రాలకు ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదు.
క్లెయిమ్: ఇస్కాన్ సంస్థ ఉక్రెయిన్ లోని ప్రజలకు భోజనాలు పెడుతున్నట్లుగా ఫోటోలు వైరల్
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ ఫోటోలు ఇప్పటివి కావు
Claim : Viral Images Show Meals Distribution Organised By ISKCON In Ukraine
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story