Thu Jan 16 2025 19:36:41 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నటరాజ్ పెన్సిల్స్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు
నటరాజ్ కంపెనీ గురించి తెలిసిందే..! ఈ ప్రముఖ కంపెనీ పెన్సిల్స్ వంటి పలు వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. నటరాజ్ పెన్సిల్లను మీ ఇంటిలో నుంచే ప్యాకేజింగ్ చేసే అవకాశం ఉందంటూ ఓ మెసేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నటరాజ్ కంపెనీ గురించి తెలిసిందే..! ఈ ప్రముఖ కంపెనీ పెన్సిల్స్ వంటి పలు వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. నటరాజ్ పెన్సిల్లను మీ ఇంటిలో నుంచే ప్యాకేజింగ్ చేసే అవకాశం ఉందంటూ ఓ మెసేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసక్తి ఉన్నవారికి నటరాజ్ పెన్సిల్లను ప్యాకేజింగ్ చేసే పార్ట్‌టైమ్ ఉద్యోగం అందుబాటులో ఉందని అందులో తెలిపారు. ఈ పనిని ఇంటి వద్ద నుంచే చేయవచ్చు.. అందుకు రూ.30,000 చెల్లిస్తారు. ఉద్యోగం రావాలంటే సంప్రదించాల్సిన వాట్సాప్ నంబర్ అని కూడా చెబుతున్నారు.“నటరాజ్ పెన్సిల్ ప్యాకింగ్ ఉద్యోగం, ఇంటి నుండి పని. పార్ట్ టైమ్ ఉద్యోగం. నెలకు 30000 జీతం. పని కోసం పురుషులు మరియు మహిళలు అత్యవసరంగా అవసరం. నా వాట్సాప్ నంబర్ 9387726058 మాత్రమే” అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.https://www.facebook.com/photo/?fbid=1339744133275292 https://www.facebook.com/photo/?fbid=1421089922043854 https://www.facebook.com/photo/?fbid=997619874951219 https://www.facebook.com/photo/?fbid=౯౯౯౮౩౭౬౧౮౦౬౨౭౭౮
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఇది ఒక బూటకపు సందేశం, అమాయక ప్రజలు మోసానికి గురి అవుతున్నారు.మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించగా.. ఈ వైరల్ సందేశం ఒక స్కామ్ అని చెబుతూ పలు ఫలితాలను మేము కనుగొన్నాము. మెసేజ్‌లను జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు, ఫోన్ నంబర్లు చాలానే ఉన్నాయి. ఒక్కటి కూడా నటరాజ్ సంస్థకు సంబంధించినవి కావు. నటరాజ్ పెన్సిల్ కంపెనీకి చెందిన ఏ అధికారికి ఆ నెంబర్లతో సంబంధం ఉండదు. అంతేకాకుండా.. ఆ సంస్థతో కమ్యూనికేట్ చేయడానికి కూడా ఈ నంబర్లతో సాధ్యం అవ్వదని మేము కనుగొన్నాము.ఈ ప్రకటనలు మోసం అని స్పష్టంగా పేర్కొంటూ 2022లో పోస్ట్ చేసిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ చేసిన ట్వీట్‌ను కూడా మేము కనుగొన్నాము.సోషల్ మీడియాలో మరింత సెర్చ్ చేయగా.. ఈ మోసానికి సంబంధించిన ప్రక్రియను వివరిస్తూ పలు వీడియోలు పోస్టు చేశారు. పార్ట్ టైమ్ జాబ్ ఉద్యోగం పొందడానికి కొంత డబ్బు చెల్లించమని అడుగుతారు. మీరు నమ్మి డబ్బు పంపారంటే మాత్రం ఇక మోసపోయినట్లే..! పలువురు వ్యక్తులను ఇలాంటి పార్ట్ టైమ్ జాబ్స్ విషయంలో ఎలా ఒప్పిస్తున్నారో వివరిస్తూ YouTubeలో అప్లోడ్ చేసిన వీడియోలను మేము కనుగొన్నాము. యూట్యూబ్ ఛానెల్ టెక్ క్యాపిటల్‌లో అప్లోడ్ చేసిన వీడియోలో ఈ ఆన్లైన్ మోసం గురించి వివరించారు. మేము ఆన్లైన్లో నటరాజ్ పెన్సిల్స్ కోసం వెతికినప్పుడు, ఈ పెన్సిల్స్ భారతదేశంలోని ముంబైలోని హిందూస్తాన్ పెన్సిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి చెందిన ఉత్పత్తులని మేము కనుగొన్నాము. సోషల్ మీడియాలో చేసిన క్లెయిమ్‌లను ఖండించే వీడియోను కూడా సదరు కంపెనీ వెబ్సైట్ లో ఉంచారు. ఇలాంటి తరహాలో ఎలాంటి ఉద్యోగాలను అందించడం లేదని స్పష్టంగా పేర్కొంది. మొత్తం తయారీ, ప్యాకేజింగ్ ప్రక్రియలో మానవ జోక్యం ఉండదని కూడా వివరించింది.తన ఫేస్బుక్ పేజీలో డిస్క్లైమర్ వీడియోను కూడా పోస్ట్ చేసింది.
నటరాజ్ పెన్సిల్స్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇస్తోందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
Claim : Nataraj pencils offering packing jobs online
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Facebook
Fact Check : False
Next Story