ఫ్యాక్ట్ చెక్: “India is doing it” అనే వైరల్ మెసేజీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది
ఫ్యాక్ట్ చెక్: “India is doing it” అనే వైరల్ మెసేజీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది
భారతదేశంలో COVID19 వ్యాప్తిని కట్టడి చేస్తున్నట్లు చూపించే వీడియో "ఇండియా ఈజ్ డూయింగ్ ఇట్" అనే శీర్షికతో వైరల్ అవుతుంది. మనం ఆ వీడియోను ప్లే చేస్తే.. అది 10 సెకన్లలో మన ఫోన్‌ను హ్యాక్ చేస్తుందని ఒక వైరల్ సందేశం వైరల్ అవుతోంది. ఆ వీడియోను తెరవవద్దని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఈ సమాచారాన్ని తెలపాలని ఈ సందేశం హెచ్చరిస్తుంది.
ఈ మెసేజీ వాట్సాప్ లో కూడా వైరల్ అవుతోంది
వైరల్ సందేశం ఒక బూటకం. ఇలాంటి మెసేజీలు గతంలో కూడా వైరల్ అయ్యాయి. అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు వాటిని నమ్మొద్దని చెప్పాయి. వాటిని సోషల్ మీడియా నుండి తొలగించారు.
'COVID19 curve', flattening in India’, ‘India is doing it’ లాంటి కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. ఈ వైరల్ సందేశం 2020లో వైరల్ అయిందని.. అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఇవొక తప్పుడు కథనాలని తెలిపాయని మేము కనుగొన్నాము. "ఇండియా ఈజ్ డూయింగ్ ఇట్" అనే సందేశం, అది ఫోన్లను హ్యాకింగ్ చేయడం గురించి మేము మీడియా కథనాలు కనుగొనలేకపోయాం.
సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాట్సాప్ 2019లోనే వీడియో ద్వారా హ్యాక్ చేసే అవకాశం లేకుండా సెక్యూరిటీ పరంగా మరింత మార్పులను తీసుకుని వచ్చింది. హ్యాకర్లు రిమోట్ యాక్సిస్ ద్వారా హ్యాక్ చేయనివ్వకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని వాట్సాప్ సంస్థ వినియోగదారులకు సూచించింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) నవంబర్ 2019లో వాట్సాప్ వెర్షన్‌ను అప్డేట్ చేయాలని పౌరులకు సూచించింది. WhatsApp ద్వారా హానికరమైన వీడియో ఫైల్‌ను పంపడం ద్వారా హ్యాకర్లు టార్గెట్ చేయకుండా కొత్త అప్డేట్ ను తీసుకుని వచ్చారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.
బూమ్ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, బగ్ పరిష్కరించారని, ఫోన్లో అప్డేట్లు అవసరమని సైబర్ నిపుణులు తెలిపారు. దీనికి సంబంధించి వివిధ వార్తా నివేదికలలో కూడా వివరించారు.
ఫోర్బ్స్.కామ్‌లోని సైబర్ సెక్యూరిటీ గురించిన కథనంలో ఈ బూటకపు వాట్సాప్ మెసేజ్‌లపై వివరణ చూడవచ్చు. గతంలో కూడా ఇలాంటివి వైరల్ అవ్వడం మనం గమనించవచ్చు.. గతంలో చైన్ మెసేజీలను కూడా మనం గుర్తించాం. ఒకరి నుండి మరొకరికి పంపడం ద్వారా ఇలాంటి బూటకపు సందేశాలు వైరల్ అవుతాయి. వాటి ద్వారా మాల్వేర్ ను ఇతరులకు పంపించవచ్చు.
కోవిడ్ 19 గురించి 'ఇండియా ఈజ్ డూయింగ్ ఇట్' అనే టైటిల్‌తో వైరల్ అవుతున్న సందేశం నెటిజన్లను తప్పుదారి పట్టిస్తోంది. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.