Fri Jan 10 2025 15:52:47 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అశోక హోటల్ కు సంబంధించిన ఫోటోలు, వైరల్ పోస్టులలో ఎటువంటి నిజం లేదు.
ఫ్యాక్ట్ చెక్: అశోక హోటల్ కు సంబంధించిన ఫోటోలు, వైరల్ పోస్టులలో ఎటువంటి నిజం లేదు.
కేరళలోని అలప్పుజాలోని అశోకా హోటల్లో మటన్ అని చెప్పి.. వినియోగదారులకు కుక్క మాంసాన్ని అందిస్తున్నారనే ఆరోపణలతో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
వినియోగదారులు రెస్టారెంట్ కు సంబంధించిన పలు చిత్రాలు, షెడ్లోని కుక్కల గుంపు.. కుక్క మాంసం ముక్కలకు సంబంధించిన చిత్రాన్ని కూడా షేర్ చేస్తున్నారు, ""అలప్పుజాలోని హోటల్లో కుక్క మాంసం వడ్డిస్తున్నారు. ఈ హోటల్ యజమానులు కుక్క మాంసాన్ని వండి మటన్‌గా చెప్పి అమ్ముతున్నారు."" అంటూ వైరల్ పోస్టుల్లో చెబుతున్నారు.
https://www.facebook.com/permalink.php?story_fbid=pfbid0gnM5LEFPcB9mLKdP2xoJVhwgiGPQHbYwU8NqSiLuCbuM1yabs99srfUFwy4o54Nxl&id=%E0%B1%A7%E0%B1%A6%E0%B1%A6%E0%B1%A6%E0%B1%A8%E0%B1%AB%E0%B1%A9%E0%B1%A7%E0%B1%A6%E0%B1%A6%E0%B1%AA%E0%B1%AE%E0%B1%AF%E0%B1%AA%E0%B1%AD
ఫ్యాక్ట్ చెకింగ్:
ఫ్యాక్ట్ చెక్ టీమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి, అశోకా హోటల్ కోల్‌కతాలోని హౌరాలో ఉందని, కేరళలోని అలపుజ్జాలో లేదని కనుగొన్నారు. FC టీమ్ వైరల్ ఫోటోను.. హోటల్ వెబ్సైట్లో పోస్ట్ చేసిన చిత్రాలతో పోల్చినప్పుడు, ఆ హోటల్ హౌరాలో ఉందని స్పష్టమైంది.
హౌరాలోని అశోకా హోటల్‌పై 2018లో అధికారులు రైడ్ చేశారు. కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ అనేక వార్తా నివేదికలను కూడా మేము కనుగొన్నాము. టైమ్స్ ఆఫ్ ఇండియానివేదిక ప్రకారం, అనేక హోటళ్లకు సమీపంలోని డంపింగ్ గ్రౌండ్స్ నుండి సేకరించిన కుళ్ళిన మాంసాన్ని సరఫరా చేస్తున్నారు. ఏ నివేదికల్లో కూడా కుక్క మాంసాన్ని వండుతున్నారని పేర్కొనలేదు.
2.కుక్కలకు సంబంధించిన ఫోటో
కుక్కలకు సంబంధించిన ఫోటోలను మా ఫ్యాక్ట్ చెక్ బృందం రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించింది. అదే చిత్రాన్ని షట్టర్‌స్టాక్‌లో కనుగొంది. ఆగష్టు 19, 2011న వియత్నాంకు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 1,000 కుక్కలను థాయ్ అధికారులు రక్షించారని వివరణలో ఉంది. స్పష్టంగా, చిత్రం ఆ చిత్రం పాతదని తెలిసింది. అంతేకాకుండా అది కేరళకు సంబంధించినది కాదు.
3. కుక్క చర్మం
ఫాక్ట్ చెక్ టీమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి జూన్ 2015లో పోస్ట్ చేసిన పర్షియన్ వెబ్సైట్ అహ్రార్గిల్ నివేదికను కనుగొంది. నివేదిక అదే చిత్రాన్ని కలిగి ఉంది. 2013లో ఇరాన్‌లోని మషాద్‌లో సాసేజ్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న సంఘటన ఇదని పేర్కొంది. ఇందుకు సంబంధించి నిందితులను పట్టుకున్నారు.
ఈ మూడు ఫోటోలకు సంబంధం లేదని తేలింది. కేరళలోని అలప్పుజాలోని అశోకా హోటల్లో కుక్క మాంసం ఇస్తున్నారని తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారని ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి, వైరల్ దావా తప్పు.
Claim : Ashoka Hotel in Alappuzha, Kerala facing allegations of serving dog meat to customers under the pretense of mutton.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story