Tue Mar 18 2025 03:15:18 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: తిరుమలలో అన్నదాన సత్రం లో తొక్కిసలాట జరిగి బాలుడు మరణించాడనే వాదన నిజం కాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా భక్తులు సందర్శించే ఆధ్యాత్మిక క్షేత్రాలలో తిరుమల ఒకటి. వేంకటేశ్వరుని అనుగ్రహం కోసం

Claim :
తిరుమల వెంగమాంబ అన్నదాన సత్రం లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన తొక్కిసలాటలో బాలుడు మృతి చెందాడు.Fact :
బాలుడు కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించాడు, అతనికి ముందే గుండెసంబంధిత వ్యాధులు ఉన్నాయి. తొక్కిసలాట జరగలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా భక్తులు సందర్శించే ఆధ్యాత్మిక క్షేత్రాలలో తిరుమల ఒకటి. వేంకటేశ్వరుని అనుగ్రహం కోసం ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాన్ని నిర్వహిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియంత్రించే ప్రభుత్వరంగ ట్రస్ట్. తిరుమల, తిరుపతికి వచ్చే యాత్రికులకు సేవలందించడంతో పాటు ఆ ప్రాంత పవిత్రతను కాపాడడమే టీటీడీ లక్ష్యం. జనవరి 2025లో తిరుపతిలోని వైకుంట ద్వార దర్శనం టిక్కెట్టు కౌంటర్ వద్ద తొక్కిసలాట జరిగి 6 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు టోకెన్ల కోసం వేచి ఉండటంతో ఈ తొక్కిసలాట జరిగింది.
ఫిబ్రవరి 22, 2025న తేరుమలలోని అన్నదానం సెంటర్లో జరిగిన తొక్కిసలాట కారణంగా ఓ బాలుడు మృతి చెందాడంటూ సోషల్ మీడియా పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. సాక్షి టీవీ ప్రచురించిన వార్తా నివేదికతో వైరల్ పోస్టును షేర్ చేస్తున్నారు. “తిరుమలలో మళ్ళీ దారుణం వెంగమాంబ అన్నదాన సత్రంలో తోపులాటలో బాలుడు మృతి వెంగమాంబ అన్నదాన సత్రం 4వ నెంబర్ హాల్ వద్ద తోపులాట టీటీడీ సెక్యూరిటీ నిర్లక్ష్య వైఖరి వల్లే ప్రమాదం జరిగిందంటున్న బంధువులు “ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. తరిగొండ వెంగమాంబ అన్నదానం సెంటర్లో తొక్కిసలాట జరిగిందని, దాంతో పిల్లాడు కుప్పకూలిపోయాడని, అతడిని ఆసుపత్రికి తరలించారని యాంకర్ చెప్పడం వార్తాకథనంలో వినొచ్చు.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వాదనలను టీటీడీ తోసిపుచ్చింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. ఈ ఘటనపై వాస్తవ పరిస్థితులను టీటీడీ అధికారికంగా విడుదల చేసింది. టీటీడీ ప్రచురించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం, తిరుమలలోని అన్నప్రసాదం సెంటర్లో మూడు రోజుల క్రితం జరిగిన తొక్కిసలాటలో బాలుడు చనిపోయాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అవాస్తవమని తెలిపారు.
మంజునాథ్ అనే 16 ఏళ్ల బాలుడు గత కొన్నేళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం తరిగొండలోని వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేసి తిరిగి వస్తుండగా అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయాడు. టీటీడీ సిబ్బంది వెంటనే యువకుడిని స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతడికి మెరుగైన వైద్యం కోసం స్విమ్స్కు తరలించారు. దురదృష్టవశాత్తు, ఈ రోజు యువకుడు మరణించాడు. తిరుమలలో అన్నదాన సత్రం క్యూలో తొక్కిసలాటలో యువకుడు మృతి చెందాడంటూ వార్తను ప్రచారం చేయడం చాలా బాధాకరమని టీటీడీ తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తొక్కిసలాట జరగలేదని స్పష్టం చేసే సీసీటీవీ ఫుటేజీని కూడా టీటీడీ షేర్ చేసింది, అలాగే బాలుడు కార్డియాక్ అరెస్ట్ వల్లే కుప్పకూలిపోయాడని, తొక్కిసలాట జరగలేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. తిరుమల అన్నదానం సెంటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ బాలుడు చనిపోయాడని తప్పుడు నివేదికలని పేర్కొంటూ ఈ వీడియోను షేర్ చేశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 16 ఏళ్ల మంజునాథ్ ఫిబ్రవరి 22న కుప్పకూలి, ఆ తర్వాత మరణించాడు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది.
ఫిబ్రవరి 22, 2025న తిరుమలలోని వెంగమాంబ అన్నదానం కేంద్రంలో జరిగిన తొక్కిసలాటలో ఒక బాలుడు మరణించాడన్న వాదన అవాస్తవమని టీటీడీ తెలిపింది.
Claim : తిరుమల వెంగమాంబ అన్నదాన సత్రం లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన తొక్కిసలాటలో బాలుడు మృతి చెందాడు.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story