ఫ్యాక్ట్ చెక్: వైరల్ పోస్టుల్లో కనబడుతున్న రహదారి తెలంగాణ రాష్ట్రం లోని ఆదిలాబాద్ కు చెందినది కాదు
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అందమైన ప్రకృతికి ప్రసిద్ధి చెందింది. దట్టమైన అడవులు, మంత్రముగ్దులను చేసే జలపాతాలు ఉన్నాయి.
Claim :
వైరల్ పోస్ట్‌లలో కనిపించే రహదారి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో ఉంది.Fact :
వైరల్ ఫోటోలో కనిపించే రహదారి ఆస్ట్రేలియాలో ఉంది. ఆదిలాబాద్‌లో కాదు.
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అందమైన ప్రకృతికి ప్రసిద్ధి చెందింది. దట్టమైన అడవులు, మంత్రముగ్దులను చేసే జలపాతాలు ఉన్నాయి. అందమైన ప్రకృతి, పచ్చదనంతో ఉన్న ప్రదేశాలు. ఎన్నో అద్భుతమైన జీవరాశులకు అనువైన ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు గొప్ప డెస్టినేషన్. ఇక్కడి ప్రాంతాలు ట్రెక్కింగ్‌కు కూడా అనువైనవి.
ఓవైపు అరణ్యం, మరోవైపు జలసవ్వడులు.. ఇలాంటి దృశ్యాలను ఒక్కమాటలో వర్ణించలేం. ఉత్తర సహ్యద్రి కొండల మధ్యలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్.. ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. వాగులు, వంకలు, డట్టమైనా అడవులు, కావ్వాల్ అభయ్యారణ్యం, బాసర దేవాలయం, సింగరేణి బొగ్గు గనులు ఇలా ఎన్నో ప్రత్యేకలకు ఆదిలాబాద్ జిల్లా కేరాఫ్ గా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న పలు జలపాతాలు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో టూరిజం కూడా ఇటీవల బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. కుంతల జలపాతాలు, కవాల్ వన్యప్రాణుల అభయారణ్యం, బాసర సరస్వతి దేవాలయం వంటి అందమైన ప్రదేశాలు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
ప్రపంచం లో అద్భుతమైన చిత్రాలని ప్రచురించే వెబ్సైట్ ఒకటి, కేప్ డు కౌడిక్ రోడ్ గురించి వివరిస్తూ, ఇది ఆస్ట్రేలియాలోని కంగారూ ద్వీపంలోని ఫ్లిండర్స్ చేజ్ నేషనల్ పార్క్‌లో ఉన్న సుందరమైన రోడ్ అంటూ వివరించింది. ఈ రహదారి పైన వెల్తుంటే శిఖరాలు, గుహలు, అలాగే చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన మలుపులను చూడొచ్చు. సుందరమైన డ్రైవ్‌తో పాటు వాట్సన్ హిల్ లుకౌట్, ఈగిల్ క్లిఫ్స్ వంటి అనేక సందర్శనా ప్రదేశాలు ఉన్నాయి. చుట్టూతా ఉన్న సముద్రం, ఈ దృశ్యాలని ఇంకా అద్భుతంగా చేస్తుంది.