Sun Dec 22 2024 21:58:45 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వసంత చైత్ర నవరాత్రుల కారణంగా మద్యం, మాంసం దుకాణాలను ఉత్తరప్రదేశ్ లో మూసివేయలేదు.
శ్రీరామనవమి సందర్భంగా వసంత చైత్ర నవరాత్రులు 22 మార్చి నుండి మొదలైనాయి. ఈ తొమ్మిది రోజులూ శ్రీరామనవమి వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం మాంసం దుకాణాలు మొత్తం బందు చేశాడు యోగి ఆదిత్య నాథ్.
“శ్రీరామనవమి సందర్భంగా వసంత చైత్ర నవరాత్రులు 22 మార్చి నుండి మొదలైనాయి. ఈ తొమ్మిది రోజులూ శ్రీరామనవమి వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం మాంసం దుకాణాలు మొత్తం బందు చేశాడు యోగి ఆదిత్య నాథ్. చరిత్రలో మొదటిసారి ఒక హిందూ పండుగ అది కూడ తొమ్మిదిరోజులు జంతు వధలేని పండుగ 25 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రమంతటా అమలు చేయడం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.జయహో యోగిజి. ఇక ,మాన కచరా అనే ఊర పంది పల్లె పల్లెకు బెల్టు షాపులు పెట్టి గుడుంబా బీరు విస్కీ గుటక బ్రాందీ లతో తెలంగాణ మొత్తాన్ని నెత్తురు పీల్చి తాగి చంపుతున్నాడు.” అంటూ కొందరు పోస్టులు పెట్టారు.యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో 9 రోజులుగా మాంసాహార నిషేధంపై పలువురు ముస్లింల ఇంటర్వ్యూను చూపించే వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతోంది. మార్చి 22, 2023న ప్రారంభమైన వసంత నవరాత్రుల సందర్భంగా యూపీ సీఎం మాంసాన్ని నిషేధించారని వీడియోను షేర్ చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా ముస్లింలు తమ మాంసం దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసినట్లు కొందరు పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల మీరు సంతోషంగా ఉన్నారా అని ఇంటర్వ్యూయర్ ప్రజలను అడగడం కనిపిస్తుంది. వారిలో ఎక్కువ మంది నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి. చైత్ర నవరాత్రి పండుగను పురస్కరించుకుని ఘజియాబాద్ 9 రోజుల పాటు మాంసాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించిన వీడియో పాతది. 2022లో పోస్ట్ చేసిన వీడియో అని తెలుస్తోంది.కీలకపదాలను ఉపయోగించి శోధించిన తర్వాత.. ఈ సంవత్సరం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అటువంటి ప్రకటన చేయలేదని మేము కనుగొన్నాము.
ఈ వీడియోలో రిపోర్టర్ 'హెడ్లైన్స్ టుడే' ఉన్న మైక్ను పట్టుకుని ఉండటం చూడవచ్చు.దాన్ని సూచనగా తీసుకుని మేము కీ వర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేశాం. ఏప్రిల్ 5, 2022న హెడ్లైన్స్ ఇండియా Facebook పేజీలో ప్రచురించిన వీడియోను మేము కనుగొన్నాము.
టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 2, 2022న నవరాత్రి సందర్భంగా ఘజియాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మాంసాన్ని అమ్మడాన్ని నిషేధించింది. అయితే ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారు.ఒక నివేదిక ప్రకారం, ఘజియాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మొత్తం జిల్లాలో మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆమోదించింది. అయితే ఆ నిషేధం ఏదైనా దేవాలయానికి 250 మీటర్ల దూరానికి పరిమితం అని పేర్కొంటూ దానిని సవరించింది. ఆ తర్వాత మాంసంపై నిషేధాన్ని వెనక్కి తీసుకున్నట్లు కార్పొరేషన్ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.వైరల్ వీడియోలో ఉన్న ఇంటర్వ్యూ ఏప్రిల్ 2022 నాటిది. ఉత్తరప్రదేశ్లో పచ్చి మాంసం అమ్మకాన్ని నిషేధిస్తూ ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేవు. ఏప్రిల్ 2022లో ఘజియాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పచ్చి మాంసం అమ్మకాన్ని నిషేధించింది. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చారు.
Claim : Rituraj Choudary hacks google
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story