Mon Dec 23 2024 18:37:19 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: చంద్రయాన్-3 లాంఛ్ ను విమానంలో వెళుతున్న వ్యక్తులు రికార్డు చేయలేదు
చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన పాత వీడియోను తప్పుగా షేర్ చేశారు. జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Claim :
చెన్నై నుంచి ఢాకాకు వెళుతున్న ఇండిగో విమానంలోని ప్యాసెంజర్ జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగాన్ని రికార్డు చేసింది.Fact :
ఇది పాత వీడియో.. దీనికి చంద్రయాన్-3 ప్రయోగానికి ఎటువంటి సంబంధం లేదు
చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన పాత వీడియోను తప్పుగా షేర్ చేశారు.
జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అలాంటి ఒక వీడియో బాగా వైరల్ అయింది. రాకెట్ ను అంతరిక్షంలోకి పంపిస్తున్న సమయంలో విమానంలో నుండి రికార్డు చేసినట్లు అందులో చూపించింది. ఈ వైరల్ వీడియో చంద్రయాన్ -3 ప్రయోగాన్ని చూపుతుందని.. చెన్నై నుండి ఢాకాకు విమానంలో వెళుతున్నప్పుడు ఇది ఓ ఇండిగో విమానం ప్రయాణీకుడు వీడియో తీసినట్లు నెటిజన్లు తెలిపారు.
“ఇండిగో విమానం చెన్నై నుండి ఢాకాకు వెళ్తోంది. చంద్రయాన్-3 ప్రయోగ సమయంలో అది శ్రీహరికోట మీదుగా వెళుతోంది. చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన చారిత్రాత్మక ఘట్టానికి ప్రయాణికులు సాక్షులు కాగలరని పైలట్ ప్రకటించారు. విండో సీటులో ఉన్న ప్రయాణీకుడు తన మొబైల్లో వీడియోను రికార్డ్ చేశాడు." అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ది ఇండిపెండెంట్లో ఇలాంటి విజువల్స్ ఉన్న రిపోర్ట్ని మేము కనుగొన్నాము. "Passengers see SpaceX rocket launch from plane window." అంటూ టైటిల్ ఇచ్చారు. దీనిని బట్టి ఇది స్పేస్ ఎక్స్ రాకెట్ లాంఛ్ కు సంబంధించిన ప్రయోగమని తెలుస్తూ ఉంది.దాదాపు 2 సంవత్సరాల క్రితం నాటి కథనాలు కూడా కనిపించాయి. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ లో ఆకాశంలో ఉన్న కమర్షియల్ ఫ్లైట్ లోని ప్రయాణీకులు ఈ స్పేస్ఎక్స్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు.
స్పేస్ఎక్స్ తన 200వ ఆర్బిటల్ మిషన్ను నిర్వహించింది. కిటికీ సీట్ల దగ్గర కూర్చున్న ప్రయాణికులు ఆకాశంలో రాకెట్ ఎగురుతున్నట్లు చూశారు. ఈ ఫుటేజీని TikTok యూజర్, ఫ్లైట్ అటెండెంట్ షేర్ చేసారు, “While working for my flight we witnessed this once-in-a-lifetime phenomenon!” అంటూ పోస్టు చేశారు. జీవిత కాలంలో చూడగలిగే అరుదైన ఘట్టమని తెలిపారు.
రిపబ్లిక్ వరల్డ్ కూడా ఇదే విషయాన్ని నివేదించింది.
వైరల్ వీడియో విడుదల తేదీ, సందర్భాన్ని మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినా, చంద్రయాన్-3 ప్రయోగానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టమైంది. ఈ వీడియో చంద్రయాన్-3 ప్రయోగం కంటే ముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Airplane passenger takes video showing launch of the Chandrayaan-3 on July 14
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story