ఫ్యాక్ట్ చెక్: సౌదీ అరేబియాలో దీపావళి రోజున టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారనేది నిజం కాదు
దీపావళి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగ. కోట్లాది మంది హిందువులు దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. రంగురంగుల దీపాలు, రంగోలీ
Claim :
సౌదీ అరేబియాలో దీపావళి రోజున వీధుల్లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారుFact :
వైరల్ వీడియో పాతది. భారతదేశంలో దీపావళికి సంబంధించినది కాదు
దీపావళి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగ. కోట్లాది మంది హిందువులు దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. రంగురంగుల దీపాలు, రంగోలీలతో ఇళ్లను ముస్తాబు చేస్తారు. కుటుంబ సభ్యులు వివిధ రకాల బాణసంచా పేల్చి ఆనందిస్తారు. సైనికులతో కలిసి పండుగ జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని సర్ క్రీక్‌ను సందర్శించి జవాన్లకు మిఠాయిలు అందించారు.
అక్టోబరు 30, 2024న అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్‌లో రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు సృష్టించారు. అయోధ్య రామమందిరంలో 28లక్షల దివ్వెలు వెలిగించారు. సరయూ నది ఘాట్‌లో 1100 మంది హారతులు ఇచ్చారు. 28 లక్షల దివ్వెల వెలుగులతో భవ్య దిపోత్సవ్ గిన్సిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. పవిత్ర నగరంలో సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడితో సహా 55 ఘాట్లపై ఈ రెండు రికార్డులు నమోదయ్యాయి. 28 లక్షలకు పైగా మట్టి దీపాలు వెలిగించారు. 1,121 మంది వేదాచార్యులు ఏకకాలంలో 'ఆరతి' నిర్వహించారు. డ్రోన్లను ఉపయోగించి దీపాలను లెక్కించారు.
భారీ భవంతులు ఉన్న ప్రాంతంలో టపాసులు పేలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. టపాసులు పేలుతూ ఉంటే కొందరు దాన్ని రికార్డు చేయడం మొదలుపెట్టారు. దీపావళిని సౌదీ అరేబియాలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారనే వాదనతో పోస్టులను వైరల్ చేస్తున్నారు. “ कल असली मुसलमान अरब में दीपावली मना रहे थे और यहाँ सलवार वाले मातम मना रहे थे “ అంటూ పోస్టులు పెట్టారు. "నిజమైన ముస్లింలు దీపావళిని సౌదీ అరేబియాలో జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్లు మాత్రం ఎందుకో మౌనంగా ఉన్నారు" అనే అర్థం వస్తుంది.