Fri Nov 22 2024 18:46:54 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రైతుల ఆందోళనల్లో ట్రాక్టర్ కింద ఒక పోలీసు అధికారి నలిగిపోయారంటూ వైరల్ అవుతున్న వీడియో తప్పుదారి పట్టించేది
దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా భారీ పోలీసు బలగాలతో రైతులను అడ్డుకున్నారు. ఢిల్లీ సమీపంలోని శంభు సరిహద్దు వద్ద రైతులు నిరసనలు చేస్తున్నారు. హర్యానా పోలీసులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ వేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.
Claim :
ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనల్లో ట్రాక్టర్ కింద పోలీసు అధికారి నలిగిపోయారనే వీడియో వైరల్‌గా మారిందిFact :
వైరల్ వీడియో ఇటీవలిది కాదు. ఆగస్టు 2023లో పంజాబ్‌లోని సంగ్రూర్‌లో జరిగిన సంఘటనకు సంబంధించింది
దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా భారీ పోలీసు బలగాలతో రైతులను అడ్డుకున్నారు. ఢిల్లీ సమీపంలోని శంభు సరిహద్దు వద్ద రైతులు నిరసనలు చేస్తున్నారు. హర్యానా పోలీసులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ వేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. హర్యానా పోలీసులతో వాగ్వాదానికి దిగిన రైతులు బారికేడ్లను దాటి దేశ రాజధానిలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీసుల నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్న తర్వాత, వారు నిరసనను ఒక రోజు విరమించి.. ఫిబ్రవరి 14, 2024న తిరిగి ప్రారంభించారు.
రైతుల నిరసనలకు సంబంధించిన తప్పుడు వాదనలతో అనేక పాత వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో మళ్లీ తెరపైకి వస్తున్నాయి. నిరసనకారులు ట్రాక్టర్ ను పోలీసు అధికారి మీద నడిపించారని చూపించే ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో ఇటీవలి 2024లో జరిగిన నిరసనకు సంబంధించినదనే వాదనతో షేర్ చేస్తున్నారు.
“నిజమైన రైతులు పోలీసులను లేదా మరే ఇతర వ్యక్తులను చంపరు. ట్రాక్టర్‌తో పోలీసుల మీదకు దూసుకుని వెళ్లారు. వీరంతా రైతుల ముసుగులో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదులు. @HMOIndia దయచేసి ఈ దేశద్రోహులపై కఠినంగా వ్యవహరించండి” అంటూ పోస్టులు పెట్టారు.
అన్నదాతలు ప్రాణాలు తీస్తున్నారు.. చర్యలు తీసుకోండి అనే వాదనతో మరికొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రైతులు తాజాగా చేస్తున్న నిరసనల్లో ఈ ఘటన చోటుచేసుకుందని వినియోగదారులు పేర్కొంటున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది. ఈ వీడియో 2024లో రైతుల నిరసనకు సంబంధించినది కాదు.
వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అయితే ఈ ఘటన ఆగస్ట్ 2023లో సంగ్రూర్‌లో చోటు చేసుకున్నదని మేము కనుగొన్నాము.
Prabhat khabar.com నివేదిక ప్రకారం.. ఆగస్ట్ 22, 2023న చండీగఢ్‌లో వరదల కారణంగా సర్వం కోల్పోయాం.. నష్టపరిహారం కోరుతూ రైతులు ఒకరోజు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అయితే నిరసనలకు ముందే, సంగ్రూర్ జిల్లా లాంగోవాల్‌లో రైతులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.
ట్రిబ్యూన్ ఇండియా.కామ్ ప్రకారం, చండీగఢ్‌లో ముందుగా నిర్ణయించిన నిరసనల కంటే ఒకరోజు ముందు రైతులు కొన్ని ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, భారతీ కిసాన్ యూనియన్ (కరంతి కారి), BKU (ఏక్తా ఆజాద్), ఆజాద్ కిసాన్ కమిటీ, దోబా, BKU (బెహ్రంకే), భూమి బచావో మోహిమ్ తో సహా 16 వ్యవసాయ సంస్థలు నిరసనల్లో భాగంగా ఉన్నాయి. వరదల వల్ల జరిగిన నష్టాలకు పరిహారం కోరుతూ నిరసనలు చేశారు.
సంగ్రూర్-బర్నాలా జాతీయ రహదారిని దిగ్బంధించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు. అయితే, రైతులు ట్రాక్టర్-ట్రాలీలు, బస్సులను ఉపయోగించి బారికేడ్ల మీదుగా వెళ్లాలని ప్రయత్నించారు. ఈ సంఘటనలో ఒక వ్యక్తి చనిపోగా.. ఇన్స్పెక్టర్ ట్రాక్టర్-ట్రాలీ కింద నలిగిపోయారు.
సంగ్రూర్ పోలీసులు ఆగస్ట్ 21, 2023న వైరల్ వీడియోకు సంబంధించి నిడివి ఎక్కువగా ఉన్న వెర్షన్‌ను ట్వీట్ చేశారు. “ఈరోజు లాంగోవాల్‌లో ఒక నిరసనకారుడు దురదృష్టవశాత్తూ మరణించాడు. సాక్షులు & వీడియోల ప్రకారం మరణించిన వ్యక్తి ట్రాక్టర్ వేగంగా రావడం వల్ల మరణించాడు. ఈ ఘటనలో ఓ పోలీసు ఇన్స్పెక్టర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు” అని అందులో ఉంది.
అందువల్ల, వైరల్ వీడియో పాతది. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో జరిగిన సంఘటనకు సంబంధించినది. ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల నిరసనతో ఎలాంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim : Viral video shows protesting farmers crushing a police official under their tractor during the ongoing protest at Delh
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : Misleading
Next Story