Fri Nov 22 2024 20:52:57 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఇస్కాన్ రథయాత్ర సందర్భంగా 7 లక్షల మంది క్రైస్తవులు హిందువులుగా మారారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
అమెరికాలో 7 లక్షల మంది క్రైస్తవులు హిందూమతంలో చేరారు" అని నెటిజన్లు చెబుతూ
Claim :
అమెరికాలో 7 లక్షల మంది క్రైస్తవులు హిందూ మతంలోకి మారారు.Fact :
2023 సంవత్సరం లండన్లో జరిగిన రథయాత్రకు సంబంధించిన వీడియో ఇది.
"అమెరికాలో 7 లక్షల మంది క్రైస్తవులు హిందూమతంలో చేరారు" అని నెటిజన్లు చెబుతూ ఉన్న వీడియో ఇది. భారీ జనసమూహం హరే కృష్ణ అని పఠిస్తూ వీధిలో నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వీడియోలోని కీ ఫ్రేమ్లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ను నిర్వహించగా.. ఈ సమూహానికి చెందిన వ్యక్తులు హరే కృష్ణ అని పఠిస్తూ నడుస్తున్న వీడియోలను YouTubeలో మేము కనుగొన్నాము. ఆ వీడియోలకు "లండన్ రథయాత్ర 2023" అని టైటిల్స్ ఉన్నాయి.
వైరల్ వీడియోను లండన్ లో జులై 30న ఇస్కాన్ నిర్వహించిన రథయాత్రకు సంబంధించినది.
ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రపంచంలోని పలు ప్రాంతాలలో రథయాత్రను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణుని భక్తులు జరుపుకుంటారు కలిసి పలు ప్రాంతాల్లో రథయాత్రను నిర్వహిస్తారు. రథయాత్ర ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో జరుగుతాయి. లండన్లో ఘనంగా భారీ ఎత్తున నిర్వహిస్తారు. లండన్ లో ఊరేగింపు హైడ్ పార్క్ కార్నర్ నుండి మొదలై చివరకు ట్రఫాల్గర్ స్క్వేర్ వరకూ సాగింది. అక్కడ రాత్రి వరకు ఉత్సవాలు నిర్వహించారు.
"అమెరికాలో 7 లక్షల మంది క్రైస్తవులు హిందూమతంలో చేరారు" అని జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. లండన్లో జరిగిన రథయాత్ర సందర్భంగా తీసిన వీడియోను తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు.
Claim : 7 lakh Christians in America have joined Hinduism
Claimed By : X users
Claim Reviewed By : Telugupost FactCheck
Claim Source : X users
Fact Check : False
Next Story